Diets/Nutrition/T

World’s Dominating Diets

ప్రపంచ ప్రజలు ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాలు

ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఆహార పదార్థాల ఎంపిక రోజువారీగా అవసరమైన నిర్ణయాత్మక శక్తిని ఇస్తుంది.

శరీరం యొక్క సమర్థవంతమైన పనితీరు మనం తీసుకునే ఆహారం దాని నుండి లభించే పోషకాలపై ఆధార పడివుంటుంది.

పోషకాహారం అంటే ఏమిటి?

పోషకాహారం అనేది ఆరోగ్యం మరియు పెరుగుదలకు అవసరమైన ఆహారాన్ని పొందడం లేదా అందించే ప్రక్రియ.

ఆహారం తినే సమయం నుండి అది శరీరంలో వివిధ పనుల కోసం వినియోగించబడే వరకు దానితో అనుసంధానించబడిన ప్రతిదీ ఇందులో ఉంటుంది.

ముఖ్యమైన పోషకాలు ఏమిటి?

నీరు, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు మరియు విటమిన్లు మొదలగునవి ముఖ్యమైన పోషకాలు. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మొత్తం 40 కి పైగా పోషకాలు మనకు అందుతుంటాయి.

మన శరీరం శక్తివంతమైన జీవనం మరియు మంచి శారీరక ఆరోగ్యం కోసం పోషకాల నుండి వేలాది పదార్థాలను ఉపయోగిస్తుంది.

ఆహారం (ఫుడ్) మరియు డైట్ (diet) మధ్య గల వ్యత్యాసం:

ఆహారం (ఫుడ్):

ఇది జీవించడానికి మరియు పెరగడానికి ప్రజలు, జంతువులు లేదా మొక్కలు తీసుకునే ఏదైనా పోషక పదార్ధం.

డైట్ (నియమిత పోషకాహారం):

ఇది ఒక వ్యక్తి, జంతువు లేదా సంఘం అలవాటుగా తినే ఆహారపు రకాలు. ఇది సరైన మొత్తంలో శక్తిని సాధించడానికి అవసరమైన అన్ని ఆహార పదార్థాల కూర్పు. ఇది రోజువారీ శారీరక పనితీరులో సహాయపడుతుంది.

మంచి డైట్ (మంచి నియమిత ఆహారం) అంటే ఏమిటి?

మంచి డైట్ అనేది మనం తీసుకునే పౌష్టికాహారం తీసుకోవడం; అంతే కాదు, వేళ కాని సమయాల్లో ఆహారం తీసుకోకపోవడం, ఆహారం తినకుండా ఎక్కువ గంటలు పనిచేయడం మరియు సరిపడా నిద్ర లేకపోవడం వంటివి కూడా మంచి డైట్ లో భాగమే.

మనం తీసుకునే భోజనం పోషక విలువలతో కూడి, శరీరం యొక్క సక్రమ పనితీరుకి దోహదపడేలా వుండాలి.

రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగాలు:

ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి.

వేగవంతమైన జీవనశైలి కారణంగా చెడు ఆహారపు అలవాట్లు పెరుగుతున్నాయి. సరికాని ఆహారం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. శారీరక శ్రమ, పని స్వభావం మరియు పని విధానాల ద్వారా మంచి ఆహారం నిర్ణయించబడుతుంది.

ప్రాచీన ప్రజల ఆహారం:

పూర్వం, మన పూర్వీకులు ఆహారాన్ని సంపాదించడానికి వేటాడి తమ జీవనోపాధి కోసం ఆహారాన్ని సేకరించేవారు. పురుషులు సాధారణంగా ఆహారపు వేటగాళ్లుగా వుండే వారు. మహిళలు ఆహార సేకరణ చేసేవారు.

తరువాతి సంవత్సరాలలో, వారు ఆహారాన్ని తయారు చేయడానికి సాధనాలను తయారు చేయడం నేర్చుకున్నారు. వారు కొవ్వులు, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు వంటి కేలరీలు అధికంగా ఉండే అధునాతన ఆహారాన్ని తీసుకున్నారు. వంట యొక్క ఆవిష్కరణ ద్వారా కుటుంబాలు మరియు కమ్యూనిటీలు బలోపేతం కాబడ్డాయి.

వ్యవసాయ అభివృద్ధి మరియు శ్రమ విభజన గొప్ప నాగరికతల పెరుగుదలను వేగవంతం చేసింది. ఆసియా, ఆఫ్రికా మరియు ఐరోపాలలో క్రీ. పూ. 10,000 మరియు 3000 మధ్య వ్యవసాయ అభివృద్ధి మొదటగా కనిపించింది. ఇది గ్రామాలు, పట్టణాలు, నగరాలు మరియు నగర-రాజ్యాల పుట్టుకకు దారితీసింది. ప్రజలు వ్యాపారాలు చేయడం మరియు ఇతర వృత్తిపరమైన ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు.

ఆధునిక ఆహార పద్దతులు:

ఇదంతా గతం. నేటి ఆహార ముఖచిత్రం చాలా అధునాతనమైనదిగా బహుముఖంగా మారింది. మనం తీసుకునే ఆహారం చాలా రకాలుగా వైవిధ్యంగా ఉంటున్నది.

నేడు ప్రపంచం తృణధాన్యాలు (cereals), స్వీట్లు మరియు పిండి పదార్ధాలతో చేయబడ్డ ఆహారాల ఆధిపత్యంలో వుంది. విస్తారంగా వ్యాపించిన గ్లోబల్ ఫుడ్ ట్రేడింగ్ సరిహద్దులను చెరిపివేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాసెస్ చేయబడిన చక్కెరలు, ఉప్పు, పాల ఉత్పత్తులు మరియు మాంసంపు ఆహారాలు ఎక్కువగా ఉపయోంచ బడుతున్నాయి.

యాంత్రిక వ్యవసాయం ద్వారా సమృద్ధిగా ఆహారం ఉత్పత్తి చేయబడుతున్నది. ప్రపంచ జనాభాలో సగం మందికి బియ్యం ప్రధాన ఆహారం. ఎక్కువగా పండించే ధాన్యం – గోధుమలు.

మొక్కజొన్న సాగు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ప్రజల ఆహారంలో చక్కెర మరియు స్వీటెనర్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ భాగం అయ్యాయి. ఇంకా అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజల రోజువారీ ఆహారంలో మాంసం మరియు పాలు ఎక్కువగా వుంటున్నాయి.

శరీరం యొక్క పనితీరు మరియు విధుల ఆధారంగా ఆహార వర్గీకరణ:

శరీరం యొక్క శారీరక పనితీరును బట్టి ఆహారాలు 3 గ్రూపులుగా విభజించబడ్డాయి.

1. శక్తి నిచ్చే ఆహారాలు (Energy Yielding Foods):

ఈ ఆహారాలలో కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

అసంకల్పిత ప్రక్రియ (involuntary processes) లను కొనసాగించడానికి శరీరం యొక్క ఉనికి (existence of body) కి అవసరమైన శక్తి ఈ ఆహారాల ద్వారా అందించబడుతుంది. అవి మన వృత్తిపరమైన, గృహ మరియు వినోద కార్యకలాపాలను కూడా సక్రమంగా నెరవేర్చ గలగాలి.

ఉదాహరణలు:

గోధుమలు, పప్పులు, తృణధాన్యాలు, వేర్లు, దుంపలు, ఎండిన పండ్లు, నూనెలు, వెన్న మరియు నెయ్యి.

ఈ ఆహార పదార్థాల ఆక్సీకరణ (oxidation) శరీరానికి అవసరమైన శక్తిని సరఫరా చేస్తుంది.

2. బాడీ బిల్డింగ్ ఫుడ్స్ (శారీరక దార్డ్యానికి దోహద పడే ఆహారాలు):

నాణ్యమైన ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటారు.

ఉదాహరణలు:

పాలు, మాంసం, గుడ్లు, చేపలు, పప్పులు మరియు గింజలు.

పాలు, మాంసం, గుడ్లు మరియు చేపలలో నాణ్యమైన ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

పప్పులు మరియు గింజలు కూడా ప్రోటీన్లు సమృద్దిగా గల ఆహారమే కానీ పై వాటితో పోలిస్తే మెరుగైన నాణ్యతను కలిగి ఉండవు.

ఈ బాడీ బిల్డింగ్ ఆహారాలు రోజువారీ జీవిత కార్యకలాపాలకు అవసరమైన శక్తిని అందిస్తాయి.

3. రక్షణ మరియు నియంత్రణ ఆహారాలు (Protective and Regulatory Foods):

ఈ ఆహారాలలో ప్రోటీన్లు, ఖనిజాలు మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

శరీర ఉష్ణోగ్రత, కండరాల సంకోచం, నీటి సమతుల్యత, రక్తం గడ్డకట్టడం, వ్యర్థాలను తొలగించడం, హృదయ స్పందనను నిర్వహించడం తదితర శరీర నియంత్రణ మరియు ఆరోగ్య కార్యకలాపాల నిర్వహణకు ఇవి చాలా అవసరం.

ఉదాహరణలు:

పాలు, గుడ్డు, కాలేయం, పండ్లు మరియు కూరగాయలు మొదలైనవి.

  • సమతుల్య ఆహారం శారీరక మరియు మానసిక కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది.
  • పోషకాలతో పాటు, ఒక వ్యక్తి యొక్క ఆహారం వారి జీవన శైలి మరియు పర్యావరణ కారకాలచే ప్రభావితమవుతుంది.
  • ఉదాహరణకు, కంప్యూటర్‌ తో ఎక్కువ గంటలు పనిచేసే వారి ఆలోచనా శక్తిని ఉత్తేజపరిచేందుకు, విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు తరచుగా మధ్య మధ్యలో టీ తీసుకోవచ్చని కొన్ని రిసెర్చ్ లలో తేలింది.
  • ఒక్కమాటలో చెప్పాలంటే, మన ఆహారం మన జీవితాన్ని మంచి మానసిక మరియు శారీరక ఆరోగ్యాలతో సంతృప్తిగా, సమర్థవంతంగా గడిపే విధంగా ఉండాలి.

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు సరైన శారీరక శ్రమ మరియు ధూమపానానికి దూరంగా ఉండటం వల్ల 90% మధుమేహం టైప్ 2, 80% హృదయ సంబంధ వ్యాధులు మరియు 30% క్యాన్సర్ వ్యాధులను నివారించవచ్చని WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) సూచించింది.

ఆరోగ్యకరమైన మరియు పౌష్టికాహారం యొక్క వినియోగం గురించి పరిజ్ఞానం మరియు అవగాహనలు, ఆరోగ్యకరమైన మరియు చురుకైన జీవితాన్ని గడపడానికి మనకు ఉపయోగ పడతాయి.

సరైన పౌష్టిక ఆహారం గురించి చేయదగిన పనులు (Dos about proper diet):

1. ఆహారంలోని పోషకాల యొక్క భౌతిక మరియు రసాయన కూర్పు గురించి వినియోగదారునకు తగినంత పరిజ్ఞానం ఉండాలి.

2. మనం తినే ఆహారాన్ని పోషక విలువలు కోల్పోకుండా ఎలా వండాలో తెలుసుకోవాలి.

3. పోషకాలను క్రమబద్ధీకరించడానికి మరియు సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి కాచిన పాలను మాత్రమే టీ లేదా కాఫీని తయారు చేయడంలో ఉపయోగించాలి; ఎందుకంటే పాలను కాచటం వల్ల దానిలోని కొవ్వు పదార్థాలు క్రమబద్దికరించబడి సులభంగా జీర్ణమవుతుంది.

4. మంచి విలువైన జీవితాన్ని గడపడానికై మనం బాగా సమతుల్యమైన, తగినంత సురక్షితమైన పోషకాహారాన్ని తీసుకోవాలి.

5. పోషకాహార లోప పదార్థాలు తీసుకోవటం వల్ల మన శరీరం పోషకాహార లేమికి గురవుతుంది. పోషకాల లోటు లేదా విపరీతమైన పోషకాహార వినియోగం ఈ రెంటినీ కూడా పోషకాహార లోపం అంటారు.

6. ఓవర్ న్యూట్రిషన్ ఊబకాయానికి దారితీస్తుంది. తగినంత శారీరక శ్రమ లేకుండా అధిక కేలరీలు (ఆహారం) తినడాన్ని ఓవర్ న్యూట్రిషన్ అంటారు. ఇది అధిక రక్తపోటు, మెటబాలిక్ సిండ్రోమ్, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం మొదలైన ఇతర సమస్యలకు దారితీయవచ్చు.

7. తగినంత పోషకాలు లేని ఆహారాన్ని పోషక విలువలు లేని ఆహారం అంటారు. దీనివల్ల శారీరక మరియు మానసిక అభివృద్ధి క్షీణించి అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది.

నేటి ప్రధాన ఆహారాలు:

నేడు ప్రజలు ఎక్కువగా ఆధారపడిన ప్రధాన ఆహారాలు:

తృణధాన్యాలు (Cereals), దుంపలు మరియు గడ్డలు, దినుసు పంటలు (starchy roots & tuber crops), కూరగాయలు (vegetables), చక్కెర & స్వీటెనర్లు (sugar & sweeteners), పప్పులు (pulses), మాంసం (meat), పాలు (milk), వెజిటబుల్ ఆయిల్స్ (vegetable oils) మరియు ఇతరాలు.

Published by:

Leave a Reply