Vegetable Oils/T

వంట నూనెలు (Vegetable oils)

వెజిటబుల్ ఆయిల్స్ ను ఆహార పదార్థాలుగా ఉపయోగిస్తారు. వాటిని వెజిటబుల్ ఫేట్స్ అని కూడా అంటారు. అవి విత్తనాలు లేదా కొన్ని పండ్లు లేదా వాటి భాగాల నుండి తయారవుతాయి.

సాధారణంగా ఉపయోగించే కొన్ని వెజిటబుల్ ఆయిల్స్:

పొద్దుతిరుగుడు నూనె, సోయాబీన్ నూనె, కొబ్బరి నూనె, కోకో వెన్న, ద్రాక్ష గింజల నూనె, ఆలివ్ నూనె, పామాయిల్ మరియు రైస్ బ్రాన్ ఆయిల్ మొదలైనవి.

మొక్కల భాగాల (విత్తనాలు) నుండి నూనెను సంగ్రహించడం ద్వారా వీటిని తయారు చేస్తారు.

అవి ఆహార దినుసులకు పెళుసు దనాన్ని ఇవ్వడానికి, కేలరీలను జోడించడానికి, కొవ్వులు మరియు పిండి పదార్ధాలను రుచిగా మార్చడానికి, ఉపయోగ పడతాయి.

వంట నూనెల యొక్క ఇతర ఉపయోగాలు:

1. బయోడిగ్రేడబుల్ హైడ్రాలిక్ ద్రవం మరియు కందెనలు (lubricants) ఉత్పత్తి చేయడానికి.

2. కొన్ని పెంపుడు జంతువుల ఆహారాన్ని తయారు చేయడం కోసం.

3. బయోడీజిల్ తయారీకి.

4. సబ్బులు, చర్మ ఉత్పత్తులు, కొవ్వొత్తులు, పరిమళ ద్రవ్యాలు మరియు ఇతర సౌందర్య ఉత్పత్తులను తయారు చేయడం కోసం.

5. పెయింట్స్ మరియు వుడ్ ట్రీట్మెంట్ (wood treatment) ఉత్పత్తులను తయారు చేయడానికి.

6. ఎలక్ట్రికల్ పరికరాలలో అవాహకాలు (insulators ) గా ఉపయోగిస్టారు.

ప్రపంచ ప్రజలు ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాలు

Presented by:

Leave a Reply