Vegetables/T

కూరగాయలు & పండ్లు:

తినదగిన మొక్కల యొక్క అన్ని పదార్థాలను (విత్తనాలు, వేర్లు, ఆకులు, కాండం, పువ్వులు మరియు పండ్లు వంటి వాటిని) కూరగాయలు అంటారు. వాటి యొక్క పోషక లక్షణాలు చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి.

కాలీఫ్లవర్, వంకాయ, పాలకూర, ముల్లంగి, బచ్చలికూర, బంగాళాదుంపలు, టమోటాలు మొదలైనవి చాలా సాధారణమైన కూరగాయలు.

ఆపిల్, బెర్రీలు, మామిడి, అరటి, నారింజ మొదలైనవి ప్రజలు సాధారణంగా తినే కొన్ని పండ్లు.

ప్రపంచ కూరగాయలలో సగానికిపైగా ఉత్పత్తి చేస్తూ చైనా అగ్రస్థానంలో ఉంది. ఈ దేశం కూరగాయల ఉత్పత్తి కోసం అత్యధిక భూభాగాన్ని కేటాయించింది.

చైనా తర్వాతి స్థానాల్లో భారత్, అమెరికా, టర్కీ, ఇరాన్, ఈజిప్ట్ లు ఉన్నాయి. స్పెయిన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా అత్యధిక సగటు దిగుబడిని కలిగి వున్నాయి.

చాలా కూరగాయలలో తక్కువ కొవ్వు మరియు ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు విటమిన్ A, C మరియు E వంటి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడానికి మరియు నిల్వ జీవితాన్ని (షెల్ఫ్ లైఫ్ ని) పొడిగించడానికి పండ్లు మరియు కూరగాయలు అధిక స్థాయి కార్బన్ డయాక్సైడ్ లేదా అధిక ఆక్సిజన్ స్థాయిలతో కూడిన నియంత్రిత వాతావరణంలో నిల్వ చేయబడతాయి. రోజుకు ఐదు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఎదో రూపంలో పండ్లు మరియు కూరగాయలు వున్న ఆహారాన్ని తినాలని చాలా మంది పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

ప్రపంచ ప్రజలు ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాలు

Presented by:

Leave a Reply