కామన్ స్పోర్ట్స్ ఇంజురీస్:
ఆటలాడేటప్పుడు / వ్యాయామం చేసేటప్పుడు సాధారణంగా సంభవించే గాయాలు:
పిల్లలు లేదా క్రీడాకారులు తరచుగా లోనయ్యే గాయాలు కండరాల వ్యవస్థకి సంబంధించినవిగా వుంటాయి.
కండరం (muscle) అంటే ఏమిటి?
- కండరం అనేది పీచు (పదార్థ) కణజాలంతో నిర్మిత మైన బ్యాండ్ లేదా కట్ట వంటిది. ఇది మానవ లేదా జంతువుల శరీరంలో సంకోచం మరియు కదలికలను కలుగజేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
మన శరీరంలోని కండరాలు (muscles) లేదా కండరాల వ్యవస్థ (Muscle System) యొక్క వర్గీకరణ:
- మన శరీరంలో 3 రకాల కండరాల వ్యవస్థ వుంది.
1. అస్థిపంజర (అస్థిక) కండరాలు (skeletal muscles):
- ఇది శరీరానికి అనగా అస్థిపంజరానికి అతుక్కొని వుండి శరీరం ఈజీగా మూవ్ అవడానికి (కదలడానికి) సహాయపడుతుంది.
- మన శరీరంలో ఎక్కువగా ఈ కండరాలే వుంటాయి.
2. మృదు కండరాలు (smooth muscles):
- ఇవి అంతర్గత అవయవాలకు (internal organs) సంబంధించిన కండరాలు.
- వీటిని అసంకల్పిత కండరాలు (involuntary muscles) అని కూడా అంటారు; అంటే వీటిని స్వచ్ఛందంగా మనం నియంత్రించలేము.
3. గుండె కండరాలు (Cardiac muscles):
- ఇవి గుండెకు సంబంధించిన కండరాలు. ఇవి కూడా అసంకల్పితంగా కండరాలు, ఇంకా మృదువైన కండరాలను పోలి ఉంటాయి. ఈ కార్డియాక్ మసల్స్ చాలా బలంగా ఉంటాయి. ఎంత బలంగా అంటే గుండె రక్తం సరఫరా చేసే ప్రక్రియలో మొత్తం కండరాలు ఒకే సమయంలో కుదించబడి వెంటనీ వ్యాకోచం (contraction and expansion) చెంద గలుగుతాయి.
ఇప్పుడు మనం సాధారణ స్పోర్ట్స్ ఇంజురీస్ (sports injuries) గురించి చర్చిద్దాం.
- ఇది (Ligaments) స్నాయువులు సాగడం లేదా చీలడం వల్ల సంభవిస్తుంది.
What is ligament?
లిగమెంట్ అంటే ఏమిటి?
- లిగమెంట్స్ అంటే ఒక ఎముకను మరొక ఎముకతో జతచేసే (బందించి ఉంచే) కణజాల వ్యవస్థ (band of tissues).
బెణుకులకి (sprains కి) వాటి తీవ్రతని బట్టి ట్రీట్ మెంట్ వుంటుంది.
జనరల్ గా బెణుకులు రెండు రకాలని చెప్పవచ్చు.
A. సాధారణ బెణుకులు (Simple Sprains):
- ఇవి సాధారణంగా సంభవించే బెణుకులు. లిగమెంట్లు సాగటం వల్ల వచ్చే బెణుకులు కేవలం వాపుని, నొప్పిని కలగ జేస్తాయి. ఇవి సింపుల్ ట్రీట్ మెంట్ తో త్వరగానే నయమవుతాయి.
B. Severe Sprains (తీవ్రమైన బెణుకులు):
ఇవి లిగమెంట్లు దెబ్బతినటం వల్ల ఏర్పడతాయి. ఇలాంటి సందర్భాలలో ప్రభావిత అవయవాన్ని లేదా జాయింట్‌ను కదల్చడం కష్టం అవుతుంది. తప్పని సరిగా మెడికల్ హెల్ప్, సరైన ట్రీట్ మెంట్ తీసుకోవాలి.
The most vulnerable (affected) areas of the body to sprains:
బెణుకులు ఎక్కువగా సంభవించే శరీర భాగాలు:
చీలమండలు (Ankle), మోకాలు (Knee) మరియు మణికట్టు (Wrist).
- స్ట్రెయిన్ అనేది కండరాలు (muscles) లేదా (tendons) స్నాయువులకు అయ్యే గాయం/గాయాలు.
ఈ స్త్రేయిన్ల వల్ల సడన్ గా కండరాలు పట్టేసి తమ సాధారణ (వ్యవస్థని) బలాన్ని కోల్పోతాయి.
ఇవి సాధారనంగా కండరాలు విపరీత మైన వత్తిడికి గురవటం అంటే సాగటం (pulled), మేలి తిరగటం (twisted), లేదా పగులు (torn) ల వల్ల ఏర్పడతాయి. మెడికల్ ట్రీట్ మెంట్ అవసరం.
ఇది శరీరం లేదా శరీర భాగంలోని ఏదైనా ప్రాంతం (కంపార్ట్‌మెంట్) యొక్క బాధాకరమైన వాపు స్థితి (the painful and swelling condition).
ఇది శరీరంలోని కొన్ని భాగాలకు బలంగా దెబ్బ తగలడం వల్ల (accidents/hits) లేదా సుదూర పరుగు (long-distance running) వంటి క్రీడల్లో సంభవించే ఇంజురీస్ (గాయాలు).
కండరాలు (muscles), నరాలు (nerves), రక్త నాళాలు (blood vessels) ఈ కంపార్ట్‌మెంట్లలో అమర్చబడి ఉంటాయి.
ఏదైనా ఒక కండరము గాయపడినప్పుడు కమిలి అక్కడ వాపు వస్తుంది. ఆ వాపు వల్ల ఆ భాగంలోని కండరాలు వ్యోకోచించి ఆ కంపార్ట్మెంట్ను (శరీర భాగాన్ని) నింపి వత్తిడికి గురి చేస్తాయి.
దాని వల్ల ఆ ప్రాంతం (compartment) లో వున్ననరాలు మరియు రక్తనాళాలకు అంతరాయం కలిగి కంపార్ట్‌మెంట్ సిండ్రోమ్ అని పిలువబడే బాధాకరమైన పరిస్థితి వస్తుంది. ఇది కొన్ని సార్లు దీర్ఘ కాలం బాధిస్తుంది. లేట్ చేయకుండా మెడికల్ హెల్ప్ తీసుకోవటం మంచిది.
- సింపుల్ గా చెప్పాలంటే మోకాలి పిక్కలు పట్టేయటం లేదా నొప్పికి గురవటం:
ఈ అకిలెస్ టెండన్ అంటే మోకాలి పిక్క (వెనుక) కండరాల (calf muscle) ను మడమ వెనుక భాగానికి కలుపుతుంది.
అకిలెస్ స్నాయువు గాయాలు తరచుగా వ్యాయామం చేయడానికి ముందు సరైన వార్మప్ ఎక్సర్ సైజెస్ (warm-up exercises) చేయక పోవడం వల్ల కాలి పిక్కలు పట్టేసి సంభవిస్తాయి. ఈ గాయాలు తీవ్రమైన నొప్పిని కలిగించి ఒక్కొక్క సారి కాలు కదపటం కుడా కష్ట మవుతుంది.
ఈ టెండన్ స్ట్రెచ్ అయినప్పుడు, చీలడం (torn) వల్ల లేదా మరేదైనా వత్తిడి ఈ అకిలీస్ టెండన్ గాయాలు ఏర్పడతాయి.
ఫుట్‌బాల్ మరియు బాస్కెట్‌బాల్ వంటి వృత్తిపరమైన అథ్లెట్లు త్వరగా వేగంగా కదలటం లేదా దూకడం వంటి వాటి వల్ల తరచుగా ఈ గాయాలకు గురవుతారు.
All Blogs & Vlogs from mamlabs.net