The First To Implement Light Pollution Act

కాంతి కాలుష్య చట్టాన్ని అమలు చేసిన మొట్ట మొదటి దేశం

ప్రపంచంలో కాంతి కాలుష్య చట్టాన్ని అమలు చేసిన మొదటి దేశం చెక్ రిపబ్లిక్.

‘ది ప్రొటెక్షన్ ఆఫ్ ది అట్మాస్పియర్ యాక్ట్’ (The Protection of the Atmosphere Act):

ఇది ‘కాంతి కాలుష్యాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించిన చట్టం’.

2002 జూన్ 01 వ తేదీన, చెక్ రిపబ్లిక్ ద్వారా ప్రపంచంలోనే మొదటిసారిగా అమలులోకి వచ్చింది.

ఇది కాంతి మరియు ఇతర రకాల వాయు కాలుష్యాల పరిష్కారానికి ఉద్దేశించ బడిన చట్టం.

ఈ చట్టంలో, క్షితిజ సమాంతర స్థాయి (Horizon level) కంటే పైకి వేదజల్లబడే కాంతి కాలుష్యం గురించి స్పష్టంగా నిర్వచించబడింది.

గాలిలో కాంతి కాలుష్యం సంభవించకుండా నిరోధించడానికి పౌరులు మరియు సంస్థలు పూర్తిగా రక్షిత లైట్ ఫిక్చర్‌ (fully shielded light fixtures) లను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని చట్టం నిర్దేశిస్తుంది.

ఉల్లంఘించిన వారు చెక్ దేశపు కరెన్సీలో 500 నుండి 150,000 చెక్ క్రౌన్లు (అనగా ప్రస్తుత మారకపు విలువ ప్రకారం సుమారు Rs.1700 to Rs.5,01,300) వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

వాణిజ్య, పారిశ్రామిక, లాజిస్టిక్స్ మరియు విహార-విశ్రాంత జీవితం లాంటి అనేక ముఖ్యమైన కార్యకలాపాలను నిర్వహించడానికి నైట్ లైటింగ్ మనకు ఎంతో సహాయపడు తున్నప్పటికీ, మనం సృష్టించిన కృత్రిమ కాంతిని పరిమితికి మించి అధికంగా వెలిగించినప్పుడు అది నెగెటివ్ గా మారి భూమిపై ఉన్న జంతుజాలం మరియు వృక్షజాలానికి ప్రతికూలంగా పరిణమిస్తుంది.

  • కాంతి కాలుష్యాలలో గల రకాల గురించి ప్రజలను చైతన్య వంతులను చేయడానికి ప్రపంచ సంస్థ IDA (ఇంటర్నేషనల్ డార్క్-స్కై అసోసియేషన్) వారు లాభాపేక్ష లేకుండా చాలా కృషి చేస్తున్నారు.  వారు లైట్ పొల్యూషన్లను ఈ క్రింది విధంగా క్లాసిఫై చేశారు.

1. Glare (గ్లేర్):

  • చూడడానికి అసౌకర్యాన్ని కలిగించే అధిక ప్రకాశం.

2. Sky Glow (స్కై గ్లో):

  • జనావాస ప్రాంతాలలో రాత్రిపూట లైటింగ్ వల్ల ఆకాశం ప్రకాశవంతంగా మారటం.

3. Light Trespass (లైట్ ట్రాస్‌పాస్):

  • ఉద్దేశించిన లేదా అవసరం లేని చోట కాంతి కిరణాలు ప్రసరించటం లేదా పడటం.

4. Clutter (క్లటర్) అయోమయ):

  • కంటికి గందరగోళాన్ని సృష్టించే కాంతి పుంజాల విపరీత ప్రకాశం.

కాంతి కాలుష్యం పెరగటానికి తోడ్పడే ప్రధాన కారణాలు:

  1. వీధి దీపాలు,
  2. ప్రకాశవంతమైన క్రీడా వేదికలు,
  3. ప్రకటన సంకేతాలు (Advertising sign boards)
  4. కర్మాగారాలు (Factories)
  5. స్కై స్క్రాపర్లు (ఆకాశ హర్మ్యాలు) మొదలైనవి.

ప్రపంచంలోనే రాత్రులలో అతి తక్కువ లైట్ పొల్యూషన్ గల ఖండం – ఆఫ్రికా ఖండం.

ప్రపంచంలో అత్యంత ‘కాంతి కాలుష్య దేశాలుగా’ సింగపూర్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు అత్యదిక జన సాంద్రత గల మరి కొన్ని దేశాలు వున్నాయి.

హాంకాంగ్ ప్రపంచంలోని అత్యంత ప్రకాశవంతమైన కాంతిని వెదజల్లే నగరంగా గుర్తించ బడింది.

ముఖ్యంగా ప్రసిద్ది చెందిన బౌద్ధ విగ్రహం వద్ద ఏర్పాటు చేయబడ్డ కాంతి అంతర్జాతీయ ప్రమాణాల సగటు కంటే 1000 రెట్లు ఎక్కువగా వున్నది.

కాంతి కాలుష్యం (Light Pollution) ద్వారా సంభవించే దుష్ఫలితాలు:

ఆరోగ్య సమష్యలు:

మన సర్కాడియన్ సైకిల్ (బయోలాజికల్ క్లాక్ = జీవ సమయ చక్రం) రాత్రిపూట మనం చూసే అధిక కాంతి (స్మార్ట్ ఫోన్‌ల నుండి నేరుగా మన కళ్లలోకి పరావర్తనం చెందే కాంతి కూడా) వల్ల తీవ్రంగా ప్రభావితమవుతుంది.

ఈ అధిక కాంతి వల్ల నిద్ర రుగ్మతలు (sleep disorders), డిప్రెషన్, ఊబకాయం (risks of obesity), మధుమేహం (diabetes), రొమ్ము క్యాన్సర్ (breast cancer) మొదలైన ఆరోగ్య సమస్యలు వయసుతో సంభంధం లేకుండా తలెత్తుతాయి

ఎక్కువ వెలుతురు నుండి సడెన్ గా అతి తక్కువ వెలుతురు చూడవలసి వచ్చినపుడు, మన కళ్ళు కొత్త లైటింగ్ కండిషన్‌కు అనుగుణంగా వెంటనే మారటం కష్టం. ఈ స్థితి కళ్లను దెబ్బతీసి కంటి సమస్యలు ఏర్పడటానికి దోహద పడుతుంది.

రాత్రులందు చీకటిగా వున్నప్పుడు సెల్ ఫోన్ ఎక్కువ వాడటం, టివి చూడటం, కంప్యుటర్ తో వర్క్ చేయటం లాంటివి కుడా కంటిపై విపరీత ప్రభావాన్ని కలిగిస్తాయి.

పర్యావరణ వ్యవస్థకి, వన్యప్రాణులకు పొంచి వున్న ముప్పు:

రాత్రి పూట ప్రసరించే అధిక కృత్రిమ కాంతి, మొక్కలు, జీవులు, పక్షులు, కీటకాలు మరియు క్షీరదాల (mammalians) యొక్క కాల గమన జీవ చక్రం యొక్క లయ (the rhythm of Earth’s daily cycle of light and darkness) పై చాలా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది.

శక్తి వనరుల వృధా (Waste of energy):

అనవసరమైన లేదా అధిక ఇండోర్ మరియు అవుట్‌డోర్ లైటింగ్ మన శక్తి వనరులను వృధా చేస్తుంది. డిమ్మర్లు (dimmers), ఫుల్-షీల్డ్ ఫిక్చర్‌లు, LEDలు (లైట్-ఎమిటింగ్ డయోడ్‌లు) మరియు CFLలు (కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్), మోషన్ మరియు టైమ్-సెన్సర్ లైటింగ్ సిస్టమ్‌లు వంటి నాణ్యమైన లైటింగ్ డిజైన్లు మితి మీరిన కాంతి వినియోగం మరియు డిపెండెన్సీని తగ్గిస్తుంది.

డబ్బు వృధా కావటం (Waste of Money):

సరైన (గృహ లేదా పారిశ్రామిక లేదా పబ్లిక్ లైటింగ్ వ్యవస్థను అవలంబిస్తే దాదాపు 50% నుండి 70% వరకూ ఖర్చులు తగ్గుతాయని నిపుణుల అంచనా.

సామాజిక సమస్యలు (Social Issues):

మితిమీరిన కాంతి వల్ల హెచ్చుగా ప్రకాశ వంతమైన  రాత్రు లందు ఆకాశాన్ని పరిశీలించే  ఖగోళ శాస్త్రవేత్తలకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. నక్షత్రాలతో ప్రకాశించే రాత్రులను కోల్పోవడం వల్ల మన భవిష్యత్ తరాలకు ఉహించని నష్టం వాటిల్లుతుంది.

Presented by:

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply