Story of The First Cars/Telugu

చరిత్రలో మొట్ట మొదటి కార్లు

కాలినడకన తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆదిమ మానవుడు మొదట గుర్రాల వంటి జంతువులకు క్యారేజీలను జోడించడం నేర్చుకున్నాడు. వాటితో తన ప్రయాణాన్ని కొనసాగించాడు.  

ఆ తర్వాత చాలా కాలానికి, మనిషి కార్లను సృష్టించడ మనేది మానవ నాగరికతా పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన మైలురాయి.

ఈ నాడు మనం అనేక రకాల కార్లను మన అవసరాలకి తగ్గట్లు ఉపయోగించు కుంటున్నాము.

కానీ మొట్ట మొదట్లో కార్లను తయారు చేయటంలో మనిషి చేసిన ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల ఫలితంగా తయారైన మొట్ట మొదటి కార్లు ఎలా వుండేవనే విషయం ఒక ఫిక్షన్ స్టోరీలా చాలా ఇంట్రస్టింగ్ ఉంటుంది. అదే ఈ – “మొట్ట మొదటి కార్ల కథ”.

1770 వ సంవత్సరంలో మొట్ట మొదటగా కన్నాట్ “ఫార్డియర్” (Cugnot Fardier) అనే కారు నిర్మించబడింది.

దీనిని ఫ్రెంచ్ ఆవిష్కర్త (French inventor) అయిన నికోలస్ జోసెఫ్ కన్నాట్ (Nicolas-Joseph Cugnot) నిర్మించాడు.

అతను ఈ మొదటి ఆటోమొబైల్‌కు ‘ఫార్డియర్ ఎ వేపర్’ (Fardier a vapeur) అని పేరు పెట్టాడు.

Fardier a vapeur

ఇది ఆయనే స్వంతంగా తయారు చేసిన కన్నాట్ స్టీమ్ ఇంజిన్‌తో నడిచేది. ఇది ప్రాక్టికల్ గా సక్సెస్ కాలేదనే చెప్పాలి.

19వ శతాబ్దం ప్రారంభంలో, మరింత ఆచరణాత్మకమైన, ఆవిరి (steam) తో నడిచే కార్లు అందుబాటులో కొచ్చాయి.

ఆ కేటగరీ కి చెందినదే బోర్డినో స్టీమ్ కేరేజ్ (Bordino steam carriage).

ఈ వాహనం ప్రాథమికంగా లాండౌ (landau) మాదిరి ఉంటుందని చెప్పొచ్చు.

లాండౌ అంటే గుర్రపు బండి అని అర్థం. దీని వెనుక భాగంలో బాయిలర్, క్యాబిన్ కింద ఇంజిన్ లను అమర్చేవారు.

స్టీమ్ ఇంజిన్ తో నడిచే ఈ రెండవ జనరేషన్ కార్లు కూడా విజయవంతం కాలేదు. ఎందుకంటే అవి కాంప్లికేటేడ్ డిజైన్ తో భారీ సైజులో వుండి చాలా ఖరీదైనవి కావటమే.

బెల్జియన్ ఇంజనీర్ అయిన ఎటిఎన్నే లెనోయిర్ (Etienne Lenoir) ఇంటర్నల్ కంబష్చన్ (I.C. ఇంజిన్) ఆవిష్కరించటంతో, కార్లకి అవసరమైన మొట్ట మొదటి ప్రాక్టికల్ పవర్ యూనిట్ 1860 లో అభివృద్ధి చేయబడింది.

1890 నాటికి, జర్మనీలో కార్ల్ బెంజ్ (Karl Benz) మరియు గాట్లీబ్ డయామ్లర్ (Gottlieb Diamler), అలాగే ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఆల్బర్ట్ డి డియోన్ (Albert de Dion) మరియు అర్మాండ్ ప్యుజట్ (Armand Peugeot) లు ప్రజలకి అమ్మడానికై కార్లను నిర్మించటం ప్రారంభించారు.

కార్ల్ బెంజ్ (Karl Benz):

జర్మనీకి చెందిన కార్ల్ బెంజ్ 1885లో తన స్వంత డిజైన్‌తో కూడిన ఫోర్-స్ట్రోక్ ఇంజిన్‌ను ఉపయోగించి మోటర్‌వ్యాగన్‌ను సృష్టించాడు. ఆ మోడల్ కి పేటెంట్ తీసుకొని దానికి “బెంజ్ పేటెంట్ మోటర్‌వాగన్” (Benz Patent Motorwagen) అని పేరు పెట్టాడు.

గాట్లీబ్ డైమ్లెర్ (Gottlieb Daimler):

అదే సంవత్సరం అంటే 1885లోనే, ఆ దేశానికే (జర్మనీకి) చెందిన ఇంజనీర్, డిజైనర్ మరియు పారిశ్రామికవేత్త అయిన గాట్లీబ్ డైమ్లెర్ (Gottlieb Daimler) మొదటి ఇంటర్నల్ కంబష్చన్ (అంతర్గత దహన) మోటార్‌సైకిల్‌ను రూపొందించాడు. దానికి ఆయన “రీట్‌వాగన్” (Reitwagen) అంటే ‘రైడింగ్ కార్’ అని పేరు పెట్టాడు.

ఆ ఇంజన్‌కి ఆయన ‘గ్రాండ్ ఫాదర్ క్లాక్ ఇంజన్’ (Grandfather Clock engine) అని నామకరణం చేశాడు. ఈ ఇంజన్‌ను అప్పట్లో మోటారు పడవల్లో కూడా ఉపయోగించేవారు.

ఆ తర్వాత 1886లో ఆయన డైమ్లర్ మోటార్‌కోచ్‌ (Daimler Motorcoach) ని రూపొందించాడు.

నాడు జర్మనీలో ఒకరికొకరు దాదాపు 60 మైళ్ల దూరంలో వున్నటువంటి బెంజ్ మరియు డైమ్లర్ లు 1886లో తమ తమ ఆటోమొబైల్స్ ను ఎవరికీ వారే  స్వతంత్రంగా ఉత్పత్తి చేశారు.

ఆల్బర్ట్ డి డియోన్:

(Albert de Dion):

ఆల్బర్ట్ డి డియోన్ ఒక ఫ్రెంచ్ ఆటోమొబైల్ పారిశ్రామికవేత్త.

అతను మొదట్లో ఒక మోడల్ స్టీమ్ ఇంజన్‌ని నిర్మించాడు.

ఆయన డి డియాన్-ఆటో బోవ్టన్ (De Dion-Bouton) అనే స్వంత ఆటోమొబైల్ కంపెనీని కలిగి ఉన్నాడు. అది అప్పట్లో కొంతకాలం ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా వుండేది.

అర్మాండ్ ప్యుజట్ (Armand Peugeot):

ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త అయిన అర్మాండ్ ప్యుజట్ మొదట్లో సైకిళ్ల తయారీదారుగా వున్న తన కంపెనీ ప్యుజట్‌ను, ఆ తరువాత ఆటోమొబైల్స్‌ కంపెనీగా మార్చాడు.

వీరంతా ఉత్పత్తి చేసిన ఆయా కార్లు రానున్న ఆధునిక మోటారు కార్ల భవిష్యత్తుకి పునాదులు వేశాయి.

అయితే, అవి ముందు అనుకున్నట్లుగా, పబ్లిక్ కి రుచించని పాత డిజైన్ తో కూడిన ఖరీదైన కార్లుగా ఉండేవి. వీటి ఉత్పత్తి కూడా పరిమిత సంఖ్యలో చేయబడు తుండేది.

ఈ మొట్ట మొదటి కార్లు, తమ ఉత్పత్తికి తీసుకునే సమయం చాలా ఎక్కువగా వుండేది.

ఎందుకంటే ఆ కార్లు, వేటికవే విడివిడిగా తయారుచేయబడ్డ విడి భాగాలను ఒకచోటకి చేర్చి మేన్యువల్ గా అసెంబుల్ చేయ వలసి రావటంతో ఒక్కో కారు తయారు చేయడానికి చాలా సమయం పట్టేది.

దీనికి నైపుణ్యం కలిగిన మెకానిక్‌లు కూడా అవసరమయ్యే వారు.

హెన్రీ ఫోర్డ్ (Henry Ford):

అమెరికాలో వున్న డెట్రాయిట్ కార్ల తయారీదారు, ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు అయిన హెన్రీ ఫోర్డ్ అనే వ్యాపారవేత్త ఈ సమస్యను పరిష్కరించాడు.

ఆయన మొట్ట మొదటగా కార్ల తయారీలో మాస్ ప్రొడక్షన్ సిస్టమ్ ను ప్రవేశపెట్టిన వ్యక్తి.

ఈ విధానమే నేటికీ అన్ని ఇండస్త్రియల్ ఉత్పత్తి రంగాలలోను కొనసాగుతోంది. ఈ విధానంలో ఒకే విధమైన స్టాండర్డ్ డైమెన్సన్లతో తయారైనటువంటి విడిభాగాలను మూవింగ్ ప్రొడక్షన్ లైన్ అనే సిస్టం ద్వారా అసెంబుల్ చేసే వారు. తద్వారా తయారీ ఖర్చు మరియు సమయం గణనీయంగా తగ్గిపోయింది.

ఒక్క కారుకే అనేక రోజులు పాటు సాగే ఉత్పత్తి సమయం – అతి స్వల్ప కాలానికి – అంటే దాదాపు 12 గంటలకి – ఇంకా చెప్పాలంటే కొన్ని నిమిషాలకే పరిమిత మైంది.

అంతేకాక ఈ పద్దతి వల్ల కార్లను మునుపటి కంటే కుడా చాలా చౌకగా తయారు చేయటం సాధ్యపడింది.

ఇలా మాస్ ప్రొడక్షన్ లో తయారైన మొట్ట మొదటి కారు – “ఫోర్డ్ మోడల్ – T”.

ఇది 1908లో ఉత్పత్తి చేయబడింది.

1920 నాటికి, ఆ నాటి కార్ల ప్రపంచంలో సగం కార్లు, ఫోర్డ్ మోడల్ T తో నిండిపోయాయి.

సంక్షిప్తంగా చెప్పాలంటే ఇదే – “మొట్ద మొదటి కార్ల కథ”.

ఇంగ్లీష్ పోస్ట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి – Click Here for English Post

Presented by:

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply