HCL TechBee Program/Tel

ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ / Part–01

ఇంటర్ (12th క్లాస్) తరువాత చదువుకుంటూనే సంపాదించుకునే అవకాశం

ఇంటర్ పాసైన తర్వాత విద్యార్థులు అనేక ఆప్షన్స్ మధ్య ఏ కెరీర్‌ను ఎంచుకోవాలా అనే క్రాస్ రోడ్స్ లో నిలబడి సందిగ్దావస్థలో ఉంటారు.

ఆర్థికంగా వెనుక బడిన విద్యార్థులు తాము చదువు కుంటూనే స్టైపండ్/జీతం సంపాదించుకునే అవకాశమున్న వివిధ కెరీర్ ప్రోగ్రాంల వివరాలు సేకరించి అందివ్వాలనే ఉద్దేశ్యంతో “ఎర్నింగ్ వైల్ లెర్నింగ్” అనే ఈ సిరీస్ ను ప్రారంభిస్తున్నాం.

ముందుగా మన దేశం లో వున్న సుప్రసిద్ధ ఐ.టి. రంగ కంపెనీ HCL టెక్నాలజీస్ వారు ఇంటర్ మీడియెట్ పూర్తయిన బీద గ్రామీణ లేదా చిన్న పట్టణాలు (టైర్-2 & టైర్-3 పట్టణాల) లో వున్న తెలివైన విద్యార్థుల కోసం స్టైపండ్/జీతం సంపాదించు కుంటూనే డిగ్రీ చదువుకునే HCL TechBee అనే అద్భుత ప్రోగ్రాంను అమలు చేస్తున్నారు.

ఆ వివరాలను ఈ మొదటి భాగంలో మీకు అందజేస్తున్నాము.

భారతదేశంలోని టైర్-2 మరియు టైర్-3 పట్టణాలు అని వేటిని అంటారు?

భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం:

  • జనాభా 50,000 – 100,000 వరకూవున్న పట్టణాలను టైర్-2 టౌన్స్ అంటారు.
  • జనాభా 20,000 – 50,000 వరకూ వున్న పట్టణాలను టైర్ 3 టౌన్స్ అంటారు.

2017 లో 80 మందితో కూడిన బ్యాచ్‌ తో ఈ ప్రోగ్రాం మొదలైంది.

కాలానుగుణంగా, HCL ప్రోగ్రామ్‌ను ఫైన్-ట్యూన్ చేసింది. 2021లో ప్రోగ్రామ్‌లో 12 వ తరగతి (ఇంటర్) పాసైన 4,000 మందిని తీసుకుంది.

2022లో ఈ సంఖ్య 8,000 కి పెంచబడింది.

నేడు, శిక్షణ పొందిన టెక్‌బీలు క్లౌడ్ ఇంజనీర్లు, డిజిటల్ ఇంజనీర్లుగా అనేక ఇంటర్నల్ ప్రోగ్రామ్‌లపై పని చేస్తున్నారు.

టెక్ బీ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యాంశాలు:

  • ఇది IT స్థాయి ప్రవేశ ఉద్యోగాల కోసం ఇంటర్ పూర్తి చేసిన తర్వాత చేసే ఫుల్ టైమ్ జాబ్ ప్రోగ్రామ్.
  • ఎంపికైన అభ్యర్థులు 12 నెలల శిక్షణ పొందవలసి ఉంటుంది.
  • ప్రోగ్రామ్‌లో భాగంగా అభ్యర్థి బిట్స్ పిలానీ (BITS PILANI), అమిటీ యూనివర్సిటీ ఆన్‌లైన్ (Amity University Online) లేదా శాస్త్రా యూనివర్సిటీ (SASTRA University) మొదలగు యూనివర్సిటిల నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందుతారు.
  • అభ్యర్ధులు IT రంగంలో ఆచరణాత్మక, ప్రయోగాత్మక శిక్షణ పొందుతారు.
  • ఎంపికైన అభ్యర్థి 12వ తరగతి తర్వాత 4 సంవత్సరాల పని అనుభవంతో కెరీర్ పోటీలో యితరుల కంటే ముందుంటాడు.
  • ఇంటర్న్‌షిప్ సమయంలో రూ. 10,000 స్టైఫండ్ అందించబడుతుంది.
  • HCL లో ఫుల్ టైమ్ జాబ్ ప్రారంభించిన తర్వాత సంవత్సరానికి రూ. 1.70 నుండి రూ. 2.20 లక్షల వరకూ జీతం వుంటుంది.

అర్హత (Eligibility):

  • అభ్యర్థి భారతదేశ నివాసి అయి ఉండాలి.
  • కనీసం 60% మార్కులతో 12వ తరగతి (ఇంటర్) పాసయి వుండాలి.
  • అంతేకాకుండా ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షల్లో గణితం లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ అనేది తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. అందులో కనీసం 60% మార్కులు సాధించి వుండాలి.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో ఇచ్చిన పుట్టిన తేదీ పరిధికి అభ్యర్థి యొక్క వయసు సరిపోవాలి. లేకపోతె రిజిస్ట్రేషన్ సాధ్యపడదు.

ఎంపిక ప్రక్రియ (Selection Process):

కేండిడేట్స్ యొక్క ఎంపికలో మూడు సులభమైన దశలు ఉన్నాయి:

నమోదు చేసుకోవటం (Registration):

HCL వెబ్‌సైట్ హోమ్ పేజీని సందర్శించండి (లింక్ క్రింద ఇవ్వబడింది):

www.hcltechbee.com

దరఖాస్తు ఫారమ్‌ను పూరించి నమోదు చేయండి.

  • డైరెక్ట్ లింక్ క్రింద ఇవ్వబడింది.

https://registrations.hcltechbee.com/

రిజిస్ట్రేషన్ తర్వాత అభ్యర్థి యొక్క ఈ మెయిల్ కు ధృవీకరణ మెయిల్‌ (confirmation mail) పంపబడుతుంది. అప్పుడు అభ్యర్థి మెయిల్‌లో యిచ్చిన యాక్టివేట్ లింక్‌ను “ఇక్కడ/Here” స్థానంలో క్లిక్ చేయడం ద్వారా తన ఎకౌంట్ ను యాక్టివేట్ చేయాలి.

HCL CAT (కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్) పరీక్ష:

ఇది ఇంగ్లీష్ లో వుంటుంది. (ఈ పరీక్ష కోసం అభ్యర్థి ఎలాంటి రుసుము చెల్లించ వలసిన అవసరం లేదు).

ఈ CAT టెస్ట్ లో అభ్యర్థి అటెండ్ అవ్వాల్సిన సబ్జెక్ట్ లు ఏంటంటే – క్వాంటిటేటివ్ (quantitative), లాజికల్ రీజనింగ్ (logical reasoning) మరియు లాంగ్వేజ్ ఎబిలిటీస్ (language abilities) అనే అంశాలు.

ఇంటర్ వ్యూ (Interview):

HCL ఎంపిక కమిటీతో ముఖాముఖి (face-to-face) ఇంటర్యూ వుంటుంది.

ఎంపికైన అభ్యర్థుల కోసం ఆసక్తి లేఖ/ఆఫర్ లెటర్ (Interest/Offer Letter) జారీ చేయబడుతుంది.

శిక్షణ కార్యక్రమం (Training Program):

ఎంపికైన అభ్యర్థులు నోయిడా, బెంగుళూరు, లక్నో, నాగ్‌పూర్, చెన్నై, మదురై మరియు విజయవాడ మొదలగు నగారాలలో కేటాయించిన శిక్షణా కేంద్రాలలో ఒక సంవత్సరం పాటు హైబ్రిడ్ మోడల్ శిక్షణ అంటే ఆన్‌లైన్ మరియు క్లాస్‌రూమ్ మోడల్స్ కలగలసిన శిక్షణను అందుకుంటారు.

  • హాస్టల్ సౌకర్యం వుంటుంది, కానీ తప్పనిసరి కాదు.

శిక్షణ తర్వాత ప్లేస్‌మెంట్ / ఉద్యోగాలు (Placement / Jobs After Training):

శిక్షణ పూర్తయిన అభ్యర్దులను “IT ఇంజనీర్” ఉద్యోగం అంటే డెవలప్‌మెంట్ / టెస్టింగ్ / సపోర్ట్ విభాగాలలో  ఎదో ఒక వింగ్ లో నియమిస్తారు.

రాత్రి (నైట్) షిఫ్టులు కూడా చేయాల్సి రావచ్చు. ప్లేస్ మెంట్ అనేది కంపెనీ కి చెందిన ఏ ప్రాంతం లో నైనా పడవచ్చు. అది మేనేజ్ మెంట్ నిర్ణయం మీద ఆధార పడి వుంటుంది.

ప్రయోజనాలు (Benefits):

ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, అభ్యర్థులు ఈ క్రింది బెనిఫిట్స్ పొందుతారు:

  • HCL టెక్నాలజీస్‌లో డెవలపర్/టెస్టర్/సపోర్ట్/మెయింటెనెన్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం.
  • అత్యుత్తమ శిక్షణా కేంద్రం నుండి సంబంధిత ఉద్యోగ ధృవీకరణ పత్రాలను పొందగలగటం.
  • ఆరోగ్య మరియు జీవిత బీమా ప్రయోజనాలు.
  • BITS పిలానీ, అమిటీ యూనివర్సిటీ ఆన్‌లైన్ లేదా SASTRA యూనివర్సిటీ నుండి వర్క్ ఇంటిగ్రేటెడ్ ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం.
  • మిగిలిన యితర ఉద్యోగులకు లభించే అన్ని సాధారణ ప్రయోజనాలు వుంటాయి.

ప్రోగ్రామ్ ఫీజు మరియు లోన్ సహాయం:

  • బ్యాంకు రుణం రూపంలో ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది.

టూకీగా చెప్పాలంటే యిదీ HCL వారు దిగువ ఆదాయ తరగతులకి చెందిన ఇంటెలిజెంట్ ఇంటర్ విద్యార్థుల కందిస్తున్న ఒక గోల్డెన్ అపర్చ్యునిటీ – ఈ HCL TechBee ప్రోగ్రాం.

  • కనుక అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవటానికి సంబందిత లింక్ లు ఈ దిగువ మళ్ళీ యివ్వవడ్డాయి. కనుక HCL వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని మీ అదృష్టాన్ని పరీక్షించు కొండి.

Home Page:

www.hcltechbee.com

Registration Page:

https://registrations.hcltechbee.com/

Presented by:

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply