GK-06/Telugu

General Knowledge / Part-06

జనరల్ నాలెడ్జ్ / పార్ట్ – 06

ఇంగ్లీష్ వెర్షన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

1. అప్నియా (Apnoea or Apnea) తో బాధపడే వ్యక్తి (రోగి) ఏ పని చేయలేడు?

( If a person suffer from apnoea (apnea), what is (the patient) unable to do?)

  • బ్రీతింగ్ (Breathing) / ఊపిరి పీల్చుకోవడం (చేయలేడు).

అప్నియా (స్లీప్ అప్నియా) అనేది ఒక రోగ లక్షణ స్థితి (నిద్ర రుగ్మత). దీనిలో శ్వాస పదేపదే ఆగి ప్రారంభమవుతుంది. వయస్సు పైబడిన పురుషులు మరియు ఊబకాయులలో ఇది సర్వసాధారణం.

ఇది గుండె మరియు మెదడు సమస్యలకు దారి తీస్తుంది.

ఇది కొంతమంది పెద్దలలో నిద్రలో (స్లీప్ అప్నియా) లేదా అప్పుడే పుట్టిన శిశువులలో సంభవిస్తుంది.

ప్రధాన కారణం శ్వాసనాళాలలో అడ్డంకి కారణంగా శ్వాస తీసుకోవడానికి నిరోదం ఏర్పడుతుంది.

అప్నియా యొక్క ప్రధాన రకాలు:

A. Obstructive Sleep Apnoea (OSA) / (అబస్ట్రక్టివ్ స్లీప్ అప్నియా):

ఇది అత్యంత సాధారణ అప్నియా (సుమారు 84%).

నోరు మరియు గొంతులో ఫంక్షనల్ అడ్డంకి కారణంగా శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది.

B. Central Sleep Apnoea (CSA) / సెంట్రల్ స్లీప్ అప్నియా:

ఇది దాదాపు 0.4%తో అతి తక్కువగా సంభవించే అప్నియా. ఇది నాడీ సంబంధిత సమస్య.

మెదడు మరియు నాడీ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థకు శ్వాస సంకేతాలను పంపనందున శ్వాస తీసుకోవటం ఆగిపోతుంది.

C. Mixed (Complex / Combined) Sleep Apnoea (MSA) / మిక్స్డ్ అప్నియా:

ఇది OSA మరియు CSA రెండింటి యొక్క మిశ్రమ పరిస్థితి.

ఇది దాదాపు 15% వరకు ఉన్న అప్నియా రోగులలో కొనసాగుతుంది.

అప్నియా రోగులలో సాధారణ లక్షణాలు బిగ్గరగా గురక పెట్టడం మరియు రాత్రిపూట పూర్తిగా నిద్రపోయిన తర్వాత కూడా అలసటగా అనిపించడం.

చికిత్స: తరచుగా జీవనశైలిలో మార్పు చేయటం మరియు రాత్రిపూట శ్వాస సహాయక పరికరం (CPAP = Continuous Positive Airway Pressure) ఉపయోగించడం వంటివి ఉంటాయి.

2. మొదటి జేమ్స్ బాండ్ చిత్రం ఏది?  (What was the first James Bond film?) 

  • డాక్టర్ నో (Doctor No).

ఇది 1962లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో మరియు 1963లో USలో విడుదలైంది.

సీన్ కానరీ (జేమ్స్ బాండ్), ఉర్సులా ఆండ్రెస్ (హనీ రైడర్), జోసెఫ్ వైజ్‌మన్ (డా. జూలియస్ నో), మరియు జాక్ లార్డ్ (ఫెలిక్స్ లీటర్) ప్రధాన పాత్రలు పోషించారు.

ఐరిష్ చలనచిత్ర దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్ అయిన టెరెన్స్ యంగ్ మొదటి మూడు చిత్రాలకు దర్శకత్వం వహించారు; అవేంటంటే – డాక్టర్ నో (1962), ఫ్రమ్ రష్యా విత్ లవ్ (1963), మరియు థండర్‌బాల్ (1965).

జేమ్స్ బాండ్ చిత్రాల ఇతివృత్తం ఇయాన్ ఫ్లెమింగ్ రాసిన నవలల ఆధారంగా రూపొందించబడింది, అతను బ్రిటీష్ నౌకాదళ ఇంటెలిజెన్స్ అధికారి, తదనంతరం రచయిత మరియు పాత్రికేయుడిగా మారాడు.

అతను తన జేమ్స్ బాండ్ సిరీస్ లకు చెందిన ‘స్పై నవల’ లతో ప్రసిద్ధి చెందాడు.

జేమ్స్ బాండ్ పాత్ర మొదట ‘క్యాసినో రాయల్’ నవలలో పరిచయం చేయబడింది, అయితే మొదట ‘డాక్టర్ నో’ సినిమాగా చిత్రీకరించబడింది.

ఈ చిత్రాలలో స్పెక్టర్ (Spectre) అనే ఆసక్తికరమైన కాల్పనిక సంస్థ 1961 లో ప్రచురించబడిన థండర్‌బాల్ నవలలో పరిచయం చేయబడింది.

అమెరికన్ ఫిల్మ్ టైటిల్ డిజైనర్ మారిస్ బైండర్, జేమ్స్ బాండ్ పాత్రను గన్ బారెల్ నుండి కనబడే విధంగా పరిచయం చేస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధాన టైటిల్ సీక్వెన్స్ ను సృష్టించాడు. డాక్టర్ నో సినిమా బడ్జెట్ 1.1 మిలియన్ డాలర్లు. అయితే ఇది బాక్స్ ఆఫీసు వద్ద 59.5 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని వసూలు చేసింది.

3. కృత్రిమంగా సృష్టించబడిన మొదటి మూలకం ఏది?

(Which was the first element to be created artificially?)

  • Technetium (టేక్నీషీయం).

టెక్నీషియం ప్లాటినం మాదిరిగానే ఒక మెరిసే బూడిదలాంటి స్ఫటికాకార ట్రాన్సిషన్ మెటల్.

ఇది 1937లో పరమాణు సంఖ్య 43 కలిగిన పార్టికల్ యాక్సిలరేటర్‌లో కృత్రిమంగా సృష్టించ బడింది.

దీని సింబల్ Tc. ఇది సాధారణంగా బూడిద పొడి రూపంలో లభిస్తుంది.

ఇది ఆవర్తన పట్టిక (the periodic table) లోని గ్రూప్ 7 క్రింద వస్తుంది. ఇది మాంగనీస్ మరియు రీనియం మూలకాల మధ్య ఉంటుంది. అలాగే ఈ రెండింటి మధ్యస్త రసాయన లక్షణాలను కలిగి ఉంటుంది.

ఎమిలియో గినో సెగ్రే (Emilio Gino Segre) 1959 లో ఓవెన్ చాంబర్‌లైన్‌తో పాటు టెక్నీషియం మరియు అస్టాటిన్ మరియు యాంటీప్రొటాన్‌లను కనుగొన్నందుకు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.

పాల్ W మెర్రిల్ (Paul W Merrill) అనే అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త, నక్షత్ర పరిణామం యొక్క చివరి దశలో S-రకం రెడ్ జెయింట్స్ (తక్కువ ద్రవ్యరాశి కలిగి ప్రకాశించే జెయింట్ స్టార్స్) నుండి వచ్చే కాంతిలో టెక్నీషియం యొక్క తరంగదైర్ఘ్యాల వర్ణపట మూలకాన్ని (the spectral signature of technetium’s wavelengths) కనుగొన్నారు. అణు ప్రతిచర్యల ద్వారా నక్షత్రాలలో టెక్నీషియం ఉత్పత్తి అవుతుందని ఇది నిరూపించింది.

4. వైద్య విద్యార్థులు ఏ ప్రాచీన గ్రీకు వైద్యుడి పేరు మీద ప్రమాణం చేస్తారు?

(Which ancient Greek physician gave his name to an oath taken by medical students?)

  • హిప్పోక్రేట్స్  (Hippocrates)

హిప్పోక్రేట్స్‌ను “ఫాదర్ ఆఫ్ మెడిసిన్” అని పిలుస్తారు.

అతను క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో జీవించాడు.

మతం నుండి వైద్య విభాగాన్ని వేరు చేసి, వ్యాధులు సహజంగానే వస్తాయని, మూఢ నమ్మకాలు, దేవుళ్ల వల్ల కాదని ఆయన విష్పస్తంగా చెప్పాడు.

అతను హిప్పోక్రటిక్ కార్పస్ ఏర్పాటు మరియు ఇతర విధానాల ద్వారా మునుపటి కేసుల వైద్య పరిజ్ఞానాన్ని సంగ్రహించడం (రికార్డ్ చేయటం) ద్వారా చరిత్రలో కేస్ స్టడీ లాంటి క్రమబద్ధమైన క్లినికల్ అధ్యయనాన్ని మొట్ట మొదటగా అభివృద్ధి చేశాడు.

హిప్పోక్రాటిక్ ప్రమాణం సాధారణంగా మెడికల్ గ్రాడ్యుయేట్‌లు మెడికల్ ప్రాక్టీస్‌లోకి ప్రవేశించె ముందు  తీసుకుంటారు.

నిజానికి ఇది వ్యాధులను నయం దేవతల పేరుమీద గ్రీకులో వ్రాయబడిన ప్రసిద్ధ వైద్య వాచకం (text).

ఇది వైద్య గోప్యత (గోప్యత ఒప్పందాల ద్వారా వాగ్దానం) మరియు దుర్వినియోగం చేయకపోవడం వంటి నైతిక ప్రమాణాల ప్రమాణం.

పాత రోజుల్లో హిప్పోక్రటిక్ ప్రమాణాన్ని ఉల్లంఘించినందుకు జరిమానాతో మొదలై అంతిమంగా మెడికల్ ప్రాక్టీస్ ను రద్దు చేయటం లాంటి శిక్షలను అమలు చేసేవారు. ఆధునిక కాలంలో, హిప్పోక్రటిక్ ప్రమాణాన్ని ఉల్లంఘించినందుకు ప్రత్యక్ష శిక్ష లాంటివి ఏమీ లేవు.

5. ప్రపంచంలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?

(Which country is the world’s largest producer of coffee?)

  • బ్రెజిల్ (Brazil)

150 సంవత్సరాలకు పైగా బ్రెజిల్ కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా ఉంది.

కాఫీ పంటను 27,000 చ.కి.మీ భూమిలో సాగు చేస్తున్నారు.

కాఫీని బ్రెజిల్‌లో కేఫ్ కర్టో లేదా కేఫ్ ఎక్స్‌ప్రెసో అంటారు.

సావో పాలో, పరానా మరియు మినాస్ గెరైస్ నగరాలు బ్రెజిల్‌లో కాఫీని పండించతంలో మొదటి మూడు ప్రధాన నగరాలుగా ముందు వరసలో వున్నాయి.

అరబికా మరియు రోబస్టాలు ఈ దేశంలో పండించే రెండు ప్రధాన కాఫీ గింజలు.

లాభదాయకమైన వాతావరణం మరియు ఎంతో విస్తీర్ణం గల తోటలు బ్రెజిల్‌ను కాఫీ సాగులో అగ్రస్థానంలో ఉంచుతున్నాయి. కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత, వియత్నాం, కొలంబియా, ఇండోనేషియా మరియు ఇథియోపియాలు తర్త్వాతి స్థానాల్లో వస్తాయి.

6. లండన్‌కు గల రోమన్ పేరు ఏమిటి? (What was the Roman name for London?)

  • లోండినియం (Londinium).

లోండినియం (రోమన్ లండన్) 1వ శతాబ్దంలో స్థాపించబడింది. అప్పట్లో ఇది ఆధునిక లండన్ వైశాల్యంలో సగానికి సమానమైన వైశాల్యంతో కట్టబడింది.

ఇది వాస్తవానికి రోమన్ బ్రిటన్‌కు (బ్రిటానియా అని కూడా పిలుస్తారు) సెటిల్‌మెంట్ (ఒప్పిడమ్) రాజధానిగా 41 CE నుండి 410 CE వరకు కొనసాగింది.

ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రెండవ పొడవైన నది అయిన థేమ్స్ నదీ పరివాహక ప్రాంతం చుట్టూ నిర్మించబడింది.

ఇది 1వ శతాబ్దం చివరి నాటికి పెద్ద పెద్ద పబ్లిక్ భవనాలు మరియు ఫోరమ్‌లతో బ్రిటానియాలో గొప్ప నగరంగా విస్తరించింది. 2వ శతాబ్దంలో ఇది ఫోరమ్-బాసిలికా వంటి ప్రసిద్ధ నిర్మాణాలతో చాలా అభివృద్ధి చెందింది.

రోమన్లు లండన్ నగర భూభాగం చుట్టూ రక్షణ గోడగా లండన్ గోడను దాదాపు 190 మరియు 225 CE మధ్య నిర్మించారు. ఇది పాత నగరం యొక్క చుట్టుకొలతను తెలుపుతూ దాదాపు 1600 సంవత్సరాల పాటు కొనసాగింది.

లండన్ పేరు లొండినియన్, లోండినియం, లిండన్ నుండి మొదలై ప్రస్తుత పేరు – లండన్‌ గా క్రమంగా రూపాంతరం చెందిందని చరిత్రకారులు చెప్తున్నారు.

7. ‘మోరిబండ్’ అనే పదానికి అర్థం ఏమిటి? (What is the meaning of the word ‘moribund’?)

  • మరణానికి సమీపంలో (మరణిస్తున్న) / మరణం అంచులలో వున్న / అంపశయ్యపై వున్న అని అర్థం. (Near death (dying) or on the point of death).

ఇది మృత్యుశయ్యపై ప్రాణం పోయే ముందు వుండే రోగి యొక్క పరిస్థితి.

ఈ పదం యొక్క మూలం లాటిన్ నుండి వచ్చింది. మోరీ అంటే లాటిన్‌లో ‘చనిపోవడం’ అని అర్థం.

ఇక్కడ తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మరణానికి దగ్గరగా వున్నప్పుడు కొన్ని కీటకాలు గూళ్ళను వదిలి బయటకి వస్తాయి.

అదే విధంగా మృత్యుముఖంలో వున్న చీమలు కూడా నివాసం వదలి సహచరుల నుండి వేరు పడతాయి.

దీనికి కారణం బహుశా వ్యాధికారక అంటువ్యాధుల నుండి వారి బంధు వర్గాన్ని రక్షించడం కావచ్చు.

ఇంగ్లీష్ లో ఈ పద వినియోగ ఉదాహరణలు:

మోరిబండ్ కంప్యూటర్ / మోరిబండ్ గవర్నమెంట్:

కంప్యూటర్ ఏ దశలోనైనా ఆగిపోవచ్చు / కూలిపోవడానికి సిద్దంగా వున్న ప్రభుత్వం. మోరిబండ్ లాంగ్వేజ్ = అంతరించిపోతున్న లేదా కనుమరుగవుతున్న భాష.

8. 1876లో టెలిఫోన్‌ ఆవిష్కర్తగా పేటెంట్ పొందిన స్కాటిష్ శాస్త్రవేత్త ఎవరు?

(Which Scottish scientist and inventor patented the telephone in 1876?)

  • అలెగ్జాండర్ గ్రాహం బెల్ (Alexander Graham Bell).

గ్రాహం బెల్ స్కాట్ ల్యాండ్ లో జన్మించిన శాస్త్రవేత్త మరియు ఇంజనీర్. అతను 1885లో అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ కంపెనీ (AT&T) ని కూడా స్థాపించాడు.

గ్రీకు భాషలో టెలి అంటే దూరం మరియు ఫోన్ అంటే వాయిస్ (ధ్వని) కాబట్టి టెలిఫోన్ అనే పదం

సుదూర స్వరాన్ని (సుదూరవాణి ని) సూచిస్తుంది.

1876 మార్చి నెలలో యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ (USPTO) ద్వారా ఎలక్ట్రిక్ టెలిఫోన్‌కు మొట్ట మొదటి పేటెంట్ అలెగ్జాండర్ గ్రాహం బెల్‌కు లభించింది.

USPTO అనేది US డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌లో జాతీయ పేటెంట్ కార్యాలయం మరియు ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ అథారిటీ.

బెల్ యొక్క పేటెంట్ తరువాత అభివృద్ధి చెందిన టెలిఫోన్ పరికరాలకు మాస్టర్ పేటెంట్‌గా నిలిచింది.

టెలిఫోన్ లో వుండే ముఖ్య పరికరాలు ట్రాన్స్‌మిటర్ (మైక్రోఫోన్) మరియు రిసీవర్ (ఇయర్‌ఫోన్).

మొట్ట మొదటి టెలిఫోన్‌లు కస్టమర్-టు-కస్టమర్ టైపువి అంటే ఇద్దరు కస్టమర్‌ల మధ్య నేరుగా కనెక్ట్ చేయబడే వన్న మాట.

ఈ వ్యవస్థ తర్వాత మనుషులతో నిర్వహించబడే ఎక్స్ఛేంజీల (స్విచ్‌బోర్డ్ రకం) వలె ఆధునీకరించ బడ్డాయి. 1973లో, హ్యాండ్‌హెల్డ్ మొబైల్ ఫోన్‌లు మొదటిసారిగా వాడుకలో కొచ్చాయి.

9. సింప్లాన్ పాస్ ద్వారా ఏ రెండు దేశాలు అనుసంధానించ బడ్డాయి?

(Which two countries are connected by the Simplon Pass?)

  • స్విట్జర్లాండ్ మరియు ఇటలీ (Switzerland and Italy).

ఇది ఎత్తైన పర్వత మార్గం. ఈ మార్గం పెన్నైన్ ఆల్ప్స్ మరియు లెపోంటైన్ ఆల్ప్స్ ల మధ్య స్విట్జర్లాండ్‌ని ఇటలీతో కలుపుతుంది.

ఈ ఆల్ప్స్ పర్వత శ్రేణి స్విట్జర్లాండ్ మరియు ఇటలీ మధ్య విస్తరించి ఉంది.

వలైస్ ఆల్ప్స్ అని కూడా పిలువబడే పెన్నైన్ ఆల్ప్స్ పర్వత శ్రేణులు (ఆల్ప్స్ యొక్క పశ్చిమ భాగం) వలైస్ (స్విట్జర్లాండ్) మరియు ఇటలీలో ఉన్నాయి.

లెపాంటైన్ ఆల్ప్స్ అనేది స్విట్జర్లాండ్ మరియు ఇటలీలో ఉన్న ఒక పర్వత శ్రేణి (ఆల్ప్స్ యొక్క వాయువ్య భాగం). రెండు దేశాల మధ్య రైలు రాకపోకలను కొనసాగించేందుకు, స్విట్జర్లాండ్‌లోని ‘బ్రిగ్’ మరియు ఇటలీలోని డొమోడోసోలా నగరాలను కలుపుతూ 20వ శతాబ్దంలో సింప్లాన్ పాస్ సమీపంలో సింప్లాన్ టన్నెల్ అనే సొరంగం నిర్మించబడింది.

10. రక్తంలోని వ్యర్థ పదార్థాలను తొలగించే ప్రక్రియకు ఏ పేరు పెట్టారు?

(What name is given to the process of removing waste products from the blood?)

  • డయాలసిస్ (Dialysis)

మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోయినప్పుడు రక్తాన్ని శుద్ధి చేయడానికి ఇది హీమోడయాలసిస్ (హీమోడయాలసిస్) అనే వైద్య ప్రక్రియకి వాడే షార్ట్ నేమ్.

మూత్రపిండాలు రక్తం నుండి క్రియేటినిన్, యూరియా వంటి వ్యర్థ పదార్థాలతో కూడిన నీటిని తొలగింఛి రక్తాన్నిశుద్ధి చేసే అవయవాలు.

డయాలసిస్‌లో మూడు రకాలు ఉన్నాయి.

1. సంప్రదాయ డయాలసిస్ (Conventional dialysis):

ఇది సాధారణంగా వారానికి మూడు సార్లు చేయబడుతుంది. ప్రతి చికిత్సకు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది.

2. రోజువారీ డయాలసిస్ (Daily dialysis):

ఇది వారానికి ఆరు రోజులు, రోజుకి 2 గంటల పాటు రోగి ఇంట్లోనే వుండి తనకు తానే చేసుకునే డైయాలసిస్.

3. రాత్రిపూట చేసే డయాలసిస్ (Nocturnal dialysis):

ఇది సాంప్రదాయ డయాలసిస్ మాదిరిగానే ఉంటుంది. రోగి నిద్రలో ఉన్నప్పుడు ఒక సెషన్‌కు 6 నుండి 10 గంటల పాటు, వారానికి 3 నుండి 6 రాత్రులు చేస్తారు.

ఇంగ్లీష్ వెర్షన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Presented by:

MAM Labs

ఇతర తెలుగు పోస్ట్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply