Facts & Factoids/Telugu/05

ఫేక్ట్స్ & ఫేక్టోయిడ్స్ / పార్ట్ – 05 / తెలుగు

1. స్పృహ తప్పి క్రిందకు పడిపోయేటప్పుడు ఎందుకు ముందుగా తల భాగమే నేలను తాకుతుంది?

 • స్పృహ తప్పి పడి పోవటాన్ని (మూర్ఛపోవడాన్ని) హైపోక్సియా (Hypoxia) అంటారు.

మెదడుకు తగినంత ఆక్సిజన్ సరఫరా లేనప్పుడు ఈ విధంగా జరుగుతుంది.

మెదడు పనితీరు ముఖ్యంగా ఆక్సిజన్‌ (ప్రాణ వాయువు) పై ఆధారపడి ఉంటుంది.

మనం పీల్చుకునే (తీసుకునే) ఆక్సిజన్ లో 25 శాతానికి పైగా ఆక్సిజన్ ను మన మెదడే ఉపయోగించుకుంటుంది. విశ్రాంతి సమయంలో అయితే అది 20% వరకూ వుంటుంది.

ఎప్పుడైతే మెదడుకి తగినంత ఆక్సిజన్ లభించ లేదో వెంటనే మనం స్పృహ కోల్పోవటం జరుగుతుంది. భూమికి గల గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆక్సిజన్ భూమికి క్రింది వైపుగా ఎక్కువగా కాన్సంట్రేట్ అయి (పేరుకొని) వుంటుంది. ఆ కారణంగానే ఆక్సిజన్ ను వెంటనే తీసుకొనే ప్రక్రియలో భాగంగా మన తల మొదటగా భూమి వైపుగా వంగుతుంది.  అందువల్లనే స్పృహ కోల్పోయే మనిషి తల ముందుగా నేలను తాకుతుంది.

రెండు నిమిషాల కంటే ఎక్కువ కాలం స్పృహ (హైపోక్సియా) కోల్పోవటం జరిగితే అది శాశ్వతంగా మెదడు దెబ్బ తినడానికి కారణం కావచ్చు.

అందుకే వెంటనే ఫస్ట్ ఎయిడ్ (లేదా ) మెడికల్ హెల్ప్ తీసుకోవటం మంచిది.

2. ఫ్లైట్ సర్జన్లు (Flight Surgeons) అంటే ఎవరు?

 • ఫ్లైట్ సర్జన్స్ అంటే ఏరోస్పేస్ మెడిసిన్‌ (Aerospace Medicine) లో శిక్షణ పొందిన వైద్యులు.

ఏరోస్పేస్ మెడిసిన్ లో రెండు విభాగా లున్నాయి.

ఒకటి ఏవియేషన్ మెడిసిన్ అంటే మన భూమి ఉపరితల వాతావణంలో విహరించే విమానాల కోసం నిర్దేశించినది.

రెండు స్పేస్ మెడిసిన్ అంటే అంతరిక్ష వాహనాల కోసం (Satellites, etc.) కోసం పనిచేసేది.

ఈ వైద్య శాస్త్రం వాతావరణ ఎగిరే విమానాల వైద్యం, మరియు అంతరిక్ష వైద్యం, రెండింటిలోనూ ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేకత కలిగి ఉంది.

ఫిజియాలజిస్ట్ పాల్ బెర్ట్ (Paul Bert) ఈ సైన్స్ శాఖను కనుగొన్నాడు. అందుకే ఆయనను ‘ఆధునిక ఏవియేషన్ మెడిసిన్ పిత’ (Father of Modern Aviation Medicine) గా పరిగణిస్తారు.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆయన ఈ విభాగంపై పరిశోధన చేయడం ప్రారంభించారు.

ప్రపంచంలోనే ఈ విధమైన మెడిసిన్ లో అంతరిక్ష పరిశోధన కోసం మొదటి యూనిట్ అమెరికా లో స్థాపించబడింది.

3. గుండె నుండి వెలువడే రక్తం (మనిషి విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా) ఒక నిమిషంలో వ్యక్తి యొక్క కాలి వేళ్ళ వరకు ప్రయాణించి తిరిగి గుండెకు చేరాటానికి ఎంత సమయం పడుతుందో తెలుసా?  

 • ఒక నిముషం (One minute).

మన శరీర అవయవాలకు అవసరమయ్యే రక్త సరఫరాపై చేసిన పరిశోధనలు ఈ క్రింది విషయాలను తెలియజేస్తున్నాయి:

మన శరీరంలోని నిర్దిష్ట అవయవాలకు (Specific organs) కి మన గుండె నుండి సరఫరా అయ్యే రక్తంలో 64.7% రక్తం అవసరమవుతుంది. దీనినే కార్డియాక్ అవుట్‌పుట్ (CO) అని పిలుస్తారు.

స్పెసిఫిక్ ఆర్గాన్స్ (నిర్దిష్ట అవయవాలు) అంటే ఏమిటి?

 శరీరంలో ఎదో ఒక ప్రాంతానికే పరిమితమయ్యే గుండె, మెదడు, కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, పొట్ట మొదలైనవాటిని నిర్దిష్ట అవయవాలంటారు.

మిగిలిన 35.3% రక్త ప్రవాహం డిస్ట్రిబ్యూటివ్ అవయవాలకు (Distributive organs కి) సరఫరా చేయబడుతుంది.

డిస్ట్రిబ్యూటివ్ ఆర్గాన్స్ అంటే ఏమిటి?

శరీరం అంతటా విస్తరించ బడిన కండరాలు అనగా ఎముకలు, నరాలు, ఫాసియా, చర్మం మొదలైన వాటిని డిస్ట్రిబ్యూటివ్ ఆర్గాన్స్ (distributive organs) అంటారు.

4. మానవ శరీరంలో ఆహారం జీర్ణం అవడానికి మరియు అబ్సోర్ప్షన్ (శోషణ) కు కారణ మయ్యే ప్రధాన అవయవం ఏది?

 • చిన్న ప్రేగు (small intestine).

భూమిపై నివశించే అన్ని జీవరాసుల వలె మానవులు కుడా తాము తినే ఆహారం నుండి పోషకాలను సంగ్రహిస్తారు. ఈ ప్రక్రియను జీర్ణక్రియ (మెటబాలిజం) అంటారు.

ఈ జీర్ణ వ్యవస్తకి అవసరమయ్యే అవయవాలను ప్రాథమిక (primary) మరియు ద్వితీయ (secondary) అవయవాలు (లేదా అనుబంధ అవయవాలు) గా విభజించవచ్చు.

 • ప్రాథమిక అవయవాలు (Primary organs):

నోరు (mouth), అన్నవాహిక (esophagus), కడుపు (stomach), చిన్న ప్రేగు (small intestine) మరియు పెద్ద ప్రేగు (large intestine).

 • ద్వితీయ అవయవాలు (secondary organs):

కాలేయం (liver), క్లోమం (pancreas), లాలాజల గ్రంథులు (salivary glands), మరియు పిత్తాశయం (gall bladder).

జీర్ణవ్యవస్థ యొక్క ప్రాధమిక అవయవాలు శరీరంలోని ఇతర అవయవాలతో కమ్యూనికేట్ చేస్తాయి.

ఈ ప్రక్రియలో, జీర్ణక్రియకు అవసరమైన అన్ని రసాయన పరస్పర చర్యలు (all chemical interactions) ద్వితీయ అవయవాల ద్వారా నిర్వహించబడతాయి.

ఆహారం నుండి పోషకాలు (విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు ప్రోటీన్లు) మరియు నీటిని గ్రహించి వాటిని శరీరానికి సరఫరా చేయడం చిన్న ప్రేగు యొక్క ప్రధాన విధి.

చిన్న ప్రేగును ఆంట్రమ్ (antrum) అని పిలుస్తారు. ఇది కడుపు దిగువ భాగం నుండి ప్రారంభమవుతుంది.  దాని చివరి భాగం పెద్ద ప్రేగుతో అనుసంధానించబడి ఉంటుంది.

చిన్న ప్రేగు యొక్క వ్యాసం (diameter) సుమారు 2.5 సెం.మీ (1 అంగుళం) వుంటుంది. పెద్దవారిలో దాని పొడవు 3 మీటర్లు (10 అడుగులు) కంటే ఎక్కువగా ఉంటుంది.

5. మనం తినే ఆహారంలో ఎంత శాతం ఇనుము మానవ శరీరంలోకి చేరుతుంది?

 • 10% – 15%

శరీరంలో ఇనుము ఒక ముఖ్య ఖనిజం. ఇంకా చెప్పాలంటే రక్తంలో హిమోగ్లోబిన్ (hemoglobin) అభివృద్ధికి ఇది చాలా కీలకం.

జీర్ణ ప్రక్రియలో ఇనుమును ఏ విధంగా మన శరీరం సంగ్రహిస్తుందంటే:

ఎదిగిన మగవారి విషయంలో: ఆహారంతో లభించిన ఇనుములో 10% మాత్రమే శరీరం గ్రహిస్తుంది.

ఎదిగిన స్త్రీల విషయంలో: ఇది 15% గా వుంటుంది. అంటే మగవారి కంటే ఆడవారి లోనే జీర్ణ ప్రక్రియలో ఇనుము ఎక్కువగా శరీరంలో కలుస్తుంది.

ఆహరం ద్వారా మనం తీసుకునే జంతువుల మాంసంలో ఉండే ఐరన్ ను సులభంగా మన శరీరం గ్రహించు కుంటుంది.

కానీ, కాయ కూరల ద్వారా వచ్చే ఇనుము జీర్ణ మయ్యి శరీరానికి ఉపయోగ కరంగా మారటం మాత్రం మాంసంతో చూసుకంటే కొంచెం కష్టతరం.

6. మానవ శరీరంలో ఎన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి?

 • మన శరీరంలో రెండు కమ్యూనికేషన్ వ్యవస్థలు వున్నాయి.

 • The nervous system (నాడీ వ్యవస్థ):

ఈ వ్యవస్థలో, నరాల నెట్‌వర్క్‌లో భాగంగా శరీరం అంతటా విద్యుత్ ప్రేరణలు ప్రయాణించటం ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది.

 • The endocrine system (ఎండోక్రైన్ వ్యవస్థ):

మన శరీరంలో హార్మోన్లు అని పిలువబడే రసాయనాలు రక్తప్రవాహంలో కలసి ప్రవహించటం ద్వారా ఈ  కమ్యూనికేషన్ జరుగుతుంది.

7. ప్రతి నిమిషానికి ఎన్ని డెడ్ స్కిన్ సేల్స్ (చనిపోయిన చర్మ కణాలు) శరీరం నుండి రాలి పడతాయి?

 • 30,000 నుండి 40,000 మధ్య.

చర్మమే మన శరీరాన్ని ఎప్పుడూ రక్షిస్తూ వుంటుంది.

పాత చర్మ కణాల స్థానంలో ఎల్లప్పుడూ కొత్త చర్మ కణాలు ఉత్పత్తి చేయబడి అవి పాత కణాలను చర్మం యొక్క ఉపరితలంపైకి నెట్టుతాయి.

ఈ ప్రక్రియను మైటోసిస్ (mitosis) అంటారు. ఇది చర్మం లోపలి పొరలో ఏర్పడుతుంది.

వైద్యపరంగా ఈ ప్రాసేష్ ను “స్ట్రాటమ్ జెర్మినేటివమ్” (stratum germinativum) అని పిలుస్తారు.

కొత్త కణాల ద్వారా కెరాటిన్ (Keratin) ఉత్పత్తి అవుతుంది.

కెరాటిన్ అనేది చర్మం, జుట్టు, గోర్లు, (జంతువులలో) ఈకలు, కొమ్ములు మరియు గిట్టల వంటి బయటి (గట్టి) పొరను రూపొందించడానికి ఉపయోగపడే ఫైబ్రస్ ప్రొటీన్.

చనిపోయిన కణాలలో కుడా కెరాటిన్ ఉంటుంది. ఇది వాటర్‌ప్రూఫ్ స్టేటమ్ కార్నియం లేయర్ (waterproof statum corneum layer) అని పిలువబడే పొరను ఏర్పరుస్తుంది. ఈ పొర మన శరీరాన్ని వాటర్ ప్రూఫ్ చేస్తుంది. అంటే ఇది శరీరం లోపల వున్న నీటి ఆవిరిని బయటకు పోకుండా నిరోధిస్తుంది; అలాగే చర్మం ద్వారా శరీరంలోకి నీరు ప్రవేశించకుండా కూడా నిరోధిస్తుంది.

8. చలి కాలంలో మన ‘శరీర వేడి’ ఏ భాగం ద్వారా బయటకు ఎక్కువగా పోతుంది, అది ఎంత శాతం?

 • చలికాలంలో 40% నుండి 50% వరకూ శరీర వేడి మన తల ద్వారా బయటకు పోతుంది.

అందుకే చలికాలం లేదా చలి ప్రాంతాల్లో ప్రజలు టోపీలు ధరిస్తారు. ఈ టోపీలు వల్ల శరీరం లోని వేడి తల ద్వారా బయటకు పోకుండా చేసి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.

సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత 98.60F (370C) వద్ద స్థిరంగా ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే మనుషులు సాధారణంగా వ్యాయామం చేసేటప్పుడు లేదా ఎక్కువగా కష్ట పడి నప్పుడు వారి శరీరం వేడెక్కుతుంది.

నిజానికి, మన శరీర ఉష్ణోగ్రత హైపోథాలమస్ గ్రంథి (hypothalamus gland) చే నియంత్రించబడుతుంది. ఇది మెదడు యొక్క బేస్ (వెనుక క్రింది భాగం) వద్ద ఉంటుంది.

దట్టమైన చలికాలంలో లేదా చలి దేశాల్లో ప్రజలు టోపీలు/మంకీ కేప్ లు ధరించడానికి ఇది ఒక కారణం.

9. అత్యంత ఎత్తులో నివసించే వ్యక్తులు సాధారణ ఎత్తులో నివసించే వ్యక్తుల కంటే ఎర్ర రక్త కణాలను ఎక్కువ కలిగి ఉంటారు – ఎందుకు? ఎంత?

 • అత్యంత ఎత్తులో నివసించే వ్యక్తులు సాధారణ ఎత్తులో నివసించే వ్యక్తుల కంటే దాదాపు 50% ఎక్కువ ఎర్ర రక్త కణాలను కలిగి ఉంటారు.

ఎందుకంటే మన శరీరంలోని రక్త కణాల సంఖ్య మనం నివసించే ప్రదేశాల ఎత్తుకు అనులోమానుపాతం (directly proportional) లో వుంటుంది.

అంటే పర్వత ప్రాంతాలలో నివసించే వారు మైదాన ప్రాంతాలలో నివసించే వారి కంటే కుడా ఎక్కువ ఎర్ర రక్త కణాలను కలిగి ఉంటారన్న మాట.

రోజుకు దాదాపు 175 బిలియన్ల ఎర్ర కణాలు ఎముక మజ్జ (red bone marrow) లో తయారవుతాయి. అవి శరీర అవసరాలకు అనుగుణంగా విడుదలవుతాయి. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలకు వుండే ఎరుపు రంగును అందించే రసాయన సమ్మేళనం.

10. మన శరీరంలో ఎంత శాతం నీరు ఉంటుంది?

 • మన శరీరంలో దాదాపు 60 నుండి 70% నీరు ఉంటుందని అంచనా.

మనం తీసుకునే నీరు మన శరీరంలో మూడు ప్రధాన పాత్రలను పోషిస్తుంది, అవేంటంటే:

 • Solvent (ద్రావకం):

పోషకాలు మరియు ఇతర ముఖ్యమైన భాగాలు వంటి అనేక పదార్థాలు నీటిలో కరిగిపోయి శరీరం అంతటా త్వరగా సరఫరా చేయబడతాయి. అందువలన ఇది కణజాలాలకు ద్రవ రూపంలో వున్న శక్తిని (గ్లూకోజ్ ని) అందించి దానికి ప్రతిగా వ్యర్థాలను సేకరించి బయటకు విసర్జించే ప్రక్రియకి తోడ్పడుతుంది.

 • Lubricant (కందెన):

కందెన (Lubricant ) లాగా ఇది ఎముకలు మరియు రక్త నాళాలు వంటి శరీరంలోని వివిధ ఉపరితలాల మధ్య సంభవించే ఘర్షణ (friction) ను నిరోధిస్తుంది.

 • Temperature regulator (ఉష్ణోగ్రత నియంత్రకం):

నీటి ఉష్ణోగ్రత త్వరగా మారదు (change కాదు) కాబట్టి అది మన శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేలా  చూస్తుంది.

Presented by:

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply