Facts & Factoids-07/Tel

ఫేక్ట్స్ & ఫేక్టోయిడ్స్ – 07

01. పేగు అడ్డంకి అంటే ఏమిటి?

What is Intestinal Obstruction?

ప్రేగు ద్వారా మలం లేదా కైమ్ అంటే సరిగ్గా జీర్ణం కాని ఆహారం యొక్క ప్రయాణ మార్గంలో ఏర్పడే ఆటంకం.

సాధారణ లక్షణాలు:

తిమ్మిరి, వాంతులు, వికారం, గ్యాస్ మరియు మల విసర్జనలో వైఫల్యం.

ఎఫెక్టడ్ భాగాలు:

ఎనభై ఐదు శాతం అడ్డంకులు చిన్న ప్రేగులలో సంభవిస్తాయి.

మిగిలిన పదహేను శాతం పెద్ద ప్రేగులలో వస్తాయి.

ఇవి రెండు రకాలు:

 • 1. మెకానికల్ అవరోధం.
 • 2. నాన్ మెకానికల్ అడ్డంకి.

మెకానికల్ అవరోధం:

చాలా అడ్డంకులు మెకానికల్ టైప్ కి చెందినవి.

కారణాలు:

ప్రేగు యొక్క హెర్నియాలు, లేదా ప్రేగును మూసివేసే ట్విస్ట్‌లు.

పేగు కణితులు, లేదా సంశ్లేషణలు (ఎడిహేసన్స్), లేదా ప్రేగులో అడ్డుపడ్డ వస్తువులు అయి వుంటాయి.

నాన్ మెకానికల్ అడ్డంకులు:

కారణాలు:

పెరిస్టాల్సిస్‌, (పేగుల కదలిక) ఆగిపోవడం. ఇది తరచుగా గాయం లేదా ఏదైనా శస్త్రచికిత్స సంబంధిత పరిస్థితి ద్వారా ఏర్పడే నిరోధం.

02. మానవ హక్కులు అంటే ఏమిటి? What Are Human Rights?

మానవ హక్కులు అంటే న్యాయం పొందే హక్కు, సమానత్వం పొందే హక్కు, తగిన ఆహారం పొందే హక్కు వంటి ప్రాథమిక హక్కులు.

మానవ హక్కులు మనం ఒకరినొకరు గౌరవించుకోవడానికి మరియు ఒకరితో ఒకరు జీవించడానికి వీలు కల్పిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మానవ హక్కుల గురించి ఆందోళన చెందుతున్నారు. మానవ హక్కులు అనేక శతాబ్దాలుగా అభివృద్ధి చెందుతూవచ్చాయి.

అవి 20వ శతాబ్దంలో విస్తృతంగా గుర్తించబడ్డాయి, ఆమోదించబడ్డాయి మరియు విస్తరించబడ్డాయి. పిల్లలు, మహిళలు మరియు పురుషులందరికీ మానవ హక్కులు ఉన్నాయి. మనుషులందరూ గౌరవంగా, నిజమైన విలువతో లేదా ఆత్మగౌరవంతో జీవించడానికి అర్హులు.

03. దయ్యం డబ్బు (స్పిరిట్ మనీ లేదా గోస్ట్ మనీ). వింత ఆచారాలు.

What is Spirit Money (Ghost Money?

స్పిరిట్ మనీ లేదా గోస్ట్ మనీ అంటే ఆత్మలను ప్రసన్నం చేసుకోవటానికి లేదా వాటితో కమ్యూనికేట్ చేయటానికి ఉపయోగించే మనీ.  

ఇది చైనీస్ ఆధ్యాత్మిక సంప్రదాయాలలో వుండే ఒక ఆచారం.

ఈ స్పిరిట్ మనీ అనేది మనీ రిసీట్ లను పోలి ఉంటుంది.

ఆత్మల రూపాలతో కూడిన కొన్ని చిత్రాలు కూడా వుంటాయి.

ఇది సాంప్రదాయ ఆసియా ఖాతాదారు షాపులలో, లేదా స్క్రాప్‌బుకింగ్ షాపులలో, లేదా చైనాటౌన్‌లో అందుబాటులో వుంటాయి.

ఈ స్పిరిట్ మనీని కాల్చడం ద్వారా ప్రేతాత్మలు వుండే లోకానికి మన సందేశాలు పంపవచ్చని చైనీయులు నమ్ముతారు.

జాస్, ఫు, పేపర్ పై వుండే గుర్రాల బొమ్మలు వంటి ఇతర రకాల ఆధ్యాత్మిక కాగితాలు కూడా స్పిరిట్ మనీ లాగా ఉపయోగించబడతాయి.

04. ఉభయ చరాలు – వాటి ఆర్డర్లు.  

Amphibians & their orders.

ఉభయచరాలు, కోల్డ్-బ్లడెడ్ సకశేరుకాలు, అంటే వెన్నెముక గల ప్రాణులు.              

అవి భూమిపైన మరియు నీటిలోను జీవించగలవు. కానీ సంతానోత్పత్తి మాత్రం నీటిలోనే చేస్తాయి.

కప్పలు, టోడ్స్, న్యూట్స్ మరియు సాలమండర్లు ఈ జాతికి చెందినవి.

శాస్త్రీయంగా వాటిని మూడు క్రమాలుగా వర్గీకరించారు.

మొదటి ఆర్డర్:

 1. అనురా.

ఉదాహరణ:

కప్పలు మరియు తెర కప్పలు.

రెండవ ఆర్డర్:

2. ఉరోడెలా.

ఉదాహరణ:

న్యూట్స్ మరియు సాలమండర్లు.

మూడో క్రమానికి చెందినది:

3. అపోడా.

ఉదాహరణ:

సిసిలియన్. సిసిలియన్లకు కాళ్లు లేవు. వీటిని దాదాపు గుడ్డివనే చెప్పాలి.

05. రెండు వేల సం.ల నుండి మానవజాతిని పీడిస్తున్న భయంకర మహామ్మారులు:

What are the Deadly Pandemics Attacked Humans Since 2000 years?

మానవ జాతి అనేక ప్రాణాంతక వైరస్ దాడులను ఎదుర్కొని మనుగడ సాగిస్తోంది.

కలరా, బ్యుబోనిక్ ప్లేగు, మశూచి మరియు ఇన్ఫ్లుఎంజా లాంటివి మానవ చరిత్రలో అత్యంత క్రూరమైన మహమ్మారులు.

మశూచి ఉనికి చరిత్రలో 12,000 సంవత్సరాలుగా ఉంది. ఇది ఒక్కటే సుమారు 300 మిలియన్ల నుండి 500 మిలియన్ల మందిని చంపింది.

ఈ ప్రాణాంతక వైరస్‌ల పైశాచిక నృత్యానికి కాలం మాత్రమే సాక్షిగా నిలిచింది.

ఈ నాటి మహమ్మారి కోవిడ్-19 నేపథ్యంలో గతంలో సంభవించిన అనేక మహమ్మారుల గురించి ఒకసారి క్లుప్తంగా పరిశీలిద్దాం.

 • Antonine Plague (ఆంటోనిన్ ప్లేగ్) (165 AD).
 • Plague of Justinian (ప్లేగ్ ఆఫ్ జస్టీనియన్) (541-542).
 • The Black Death (ద బ్లేక్ డెత్) (1346-1353).
 • Third Cholera Pandemic (థర్డ్ కలరా పేండమిక్) 1852-1860).
 • Flu Pandemic (ఫ్లూ పేండమిక్) (1889-1890).
 • Sixth Cholera Pandemic (ఆరవ కలరా పేండమిక్) (1910-1911).
 • Flu Pandemic (ఫ్లూ పేండమిక్) (1918).
 • Asian Flu (ఏషియన్ ఫ్లూ) (1956-1958).
 • 1968 Flu Pandemic (1968 ఫ్లూ పేండమిక్).
 • HIV/AIDS Pandemic (HIV/AIDS పేండమిక్) (1976-నేటికీ కొనసాగుతోంది).
 • Covid-19 (కోవిడ్-19) (2019- నేటికీ కొనసాగుతోంది).

06. “ద ఫాదర్ ఆఫ్ యానిమేషన్” అని ఎవరిని పిలుస్తారు?

Who is the Father of the Animation?

ఈ ప్రశ్నకి సమాధానం “జెనాస్ విన్సర్ మెకెయ్” అని చెప్పవచ్చు.

ప్రారంభంలో ఆయన డైమ్ మ్యూజియంల కోసం పనిచేశాడు.

1903లో ఆయన న్యూయార్క్ హెరాల్డ్‌ పత్రికలో చేరాడు.

ఆయన మొదటి యానిమేషన్ చిత్రమైన “లిటిల్ నెమో” 1911 ఏప్రిల్ 8న థియేటర్‌లలో విడుదలైంది.

దీనిని 4000 డ్రాయింగ్‌లతో బ్లేక్ అండ్ వైట్ సినిమాగా ఆయన రూపొందించారు.

ఆయన 1912లో తన రెండవ యానిమేషన్ చిత్రం “హౌ ఎ మస్కిటో ఆపరేట్స్”ని విడుదల చేశారు.

ఆయన నెక్స్ట్ యానిమేషన్ చిత్రం “గెర్టీ ద డైనోసార్”.

ఆయన యానిమేషన్ టెక్నిక్స్ ఆ తర్వాత వాల్ట్ డిస్నీ యొక్క యానిమేషన్ చిత్రాలలో అనుసరించబడ్డాయి.

మెక్కే యొక్క టెక్నిక్‌లను వాల్ట్ డిస్నీ 1955లో తన బేనర్ లో  నిర్మిచిన “ది స్టోరీ ఆఫ్ యానిమేటెడ్ డ్రాయింగ్” అనే ఎపిసోడ్‌లో ఎంతో కీర్తించారు.

Click For English Post – Facts & Factoids-07

Presented by:

MAM Labs

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply