Disaster Management-01

విపత్తుల నిర్వహణ – 01

తుఫానులు & వరదలు

తుఫాను:

తుఫాను అనేది ప్రచండ వేగంతో వీచే సుడి గాలి వాన. అల్ప పీడన కేంద్రం వైపుగా గాలి ప్రవాహాలు వేగంగా ప్రసరించినప్పుడు ఇది సంభవిస్తుంది. ఇవి ఉత్తర అర్ధగోళంలో అపసవ్య దిశలో మరియు దక్షిణాన సవ్యదిశలో తిరుగుతాయి.

వరద:

నదులలో సంభవించే అసాధారణ నీటి ప్రవాహ ఉధృతి వల్ల వరదలు సంభవిస్తాయి.

తుఫానులు & వరదలను సమర్థంగా ఎలా ఎదుర్కోవాలి?

కార్య ప్రణాళిక (Action Plan):

సాధారణంగా సముద్ర తీరాలు మరియు నదీ తీరాలకు సమీపంలో నివసించే ప్రజలు ఈ విపత్తులను ఎలా ఎదుర్కోవాలో క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి.

ఈ కాలానుగుణ ప్రకృతి ప్రకోపాన్ని ఎవరూ నిరోధించలేరు. కానీ ఇప్పుడు మనం ఆధునిక సాంకేతిక పురోగతి సహాయంతో తుఫానులు మరియు వరదలు రావడాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు.

ప్రభావిత ప్రాంతాలలో మరియు సమీపంలో నివసించే ప్రజలు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలతో తమను తాము సంసిద్ధం చేసుకోవాలి.

తుఫాను లేదా వరద ప్రభావిత ప్రాంతాలలో నివసించే వారు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు:  

అవసరమైన చోట ఇంటి గోడలు, రూఫింగ్, తలుపులు మరియు కిటికీలను బలోపేతం చేయండి.

విపత్తు సమయంలో వాతావరణ నివేదికలను వినండి.

మీకు తుఫాను హెచ్చరిక వచ్చినప్పుడు, తగినన్ని తాగునీరు మరియు ఆహార ధాన్యాలను వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లలో నిల్వ చేయండి.

ఇంట్లో అవసరమైన ఆహారం, డబ్బు, ముఖ్యమైన వస్తువులు, టెలిఫోన్ నంబర్లతో కూడిన ఎమర్జెన్సీ కిట్‌ను సిద్ధంగా ఉంచుకోండి.

తలుపులు మరియు కిటికీలు మూసివేసి లోపల ఉండండి.

బయటకు – ముఖ్యంగా సముద్రంలోకి వెళ్లవద్దు.

విపత్తు సందర్భంలో ఆశ్రయం కోసం సమీపంలోని సురక్షితమైన మరియు బలమైన ప్రదేశాన్ని ముందుగానే ఎంచుకోండి.  

తుఫాన్ ఉధృతి తగ్గిన వెంటనే బయటకు వెళ్లవద్దు. తుఫాను ముప్పు తప్పిందన్న పూర్తి స్పష్టమైన ప్రకటన అధికారికంగా వెలువడే వరకు వేచి ఉండండి.

తాజా వాతావరణ సమాచారాన్ని వినండి.  

‘ఆల్ క్లియర్’ పరిస్థితి ప్రకటించిన తర్వాత కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. పాక్షికంగా నేలకొరిగిన చెట్లు లేదా స్తంభాలు ప్రమాద భరితం కావచ్చు.

వరద నీటిలోకి వెళ్ళే ప్రయత్నం చేయవద్దు. గుంతలు లోతుగా ఉండి ప్రాణాపాయం కావచ్చు.

డ్రెయిన్ రంధ్రాల నుండి పాములు బయటకు రావచ్చు.

మీరు వాహనంలో ప్రయాణించే సమయంలో తుఫాను తాకితే ఏమి చేయాలి?

  • వెంటనే వాహనాన్ని ఆపండి.
  • మీ వాహనాన్ని సముద్ర తీరం, చెట్లు, విద్యుత్ స్తంభాలు మరియు ఈదురుగాలుల సమయంలో నేలకొరిగే స్తంభాలు, పోల్స్ లకు దూరంగా ఉంచండి.
  • ఆల్ క్లియర్ సంకేతం తర్వాత కూడా పాక్షికంగా దెబ్బతిన్న చెట్లు, స్తంభాల వల్ల ఒక్కొక్కసారి ప్రమాదాలు సంభవించవచ్చు. కనుక జాగ్రత్త అవసరం.

వరదల సమయంలో ఏం చేయాలి?

మీ ఆహారాన్ని కప్పి (మూతపెట్టి) ఉంచండి.

ఎక్కువగా తినవద్దు.

పిల్లలను ఖాళీ కడుపుతో ఉండనివ్వవద్దు.

వరద నీటిలో ఆహారం తడిస్తే తినకూడదు.

కాచిన నీటిని త్రాగడానికి ప్రయత్నించండి.

అతిసారం (విరేచనాల) బారిన పడితే బ్లేక్ టీ, జావ, లేత కొబ్బరి నీరు మొదలైనవి తీసుకోండి.

బ్లీచింగ్ పౌడర్ మరియు సున్నం ఉపయోగించి పరిసరాలలో క్రిమి కీటకాదులు లేకుండా చేయండి.

వరద నీటిలోకి ప్రవేశించకుండా ఉండటానికి ప్రయత్నించండి.

బయటకి వెళ్ళవలసి వస్తే మీ పాదాలకు సరైన రక్షణను ధరించండి.

ఒక కర్ర సాయంతో లోతు మరియు ప్రవాహాన్ని తనిఖీ చేయండి.

మోకాళ్ల లోతు నీటికి దూరంగా ఉండండి.

హాలోజన్ మాత్రలు ఉపయోగించడం వంటి కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా త్రాగడానికి ముందు నీటిని శుద్ధి చేయడానికి ప్రయత్నించండి.

వరదల సమయంలో పాముకాటు సర్వసాధారణం. కాబట్టి వాటి బారిన పడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి.

ప్రమాద సమయంలో ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చినప్పుడు ఏమి చేయాలి?

  • అవసరమైన మందులు, దుస్తులు, విలువైన వస్తువులు, అత్యవసర, వ్యక్తిగత వస్తువులు వంటి వాటిని వాటర్ ప్రూఫ్ బ్యాగ్‌లలో ప్యాక్ చేయండి.
  • ఫర్నిచర్, దుస్తులు, ఉపకరణాలు బెడ్‌లు లేదా టేబుల్లపై ఎలక్ట్రికల్ పరికరాలను ఎత్తులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.
  • పవర్ (ఎలక్ట్రిసిటి) ను ఆఫ్ చేయండి.
  • టాయిలెట్ల మురుగు నీరు బెక్ ఫ్లో కాకుండా టాయిలెట్ బేసిన్ లలో ఇసుక సంచులను ఉంచండి. మీరు ఖాళీ చేసినా చేయకున్నా కాలువ రంధ్రాలన్నింటినీ మూసి వుంచండి.
  • మీ ఇంటిని లాక్ చేయండి. మీ ప్రాంతం నుండి రేఫ్యూజే కేంపులకి సురక్షితంగా చేరుకొనే మీకు బాగా పరిచయమున్న మార్గాలలో వెళ్ళండి.
  • లోతు మరియు ప్రవ్వాహ ఉధృతి తెలియని నీటిలోకి ప్రవేశించవద్దు.

ప్రతి ఒక్కరూ ఈ విపత్తుల సమయంలో వారి సామర్థ్యం మరియు పరిస్థితికి తగ్గట్టుగా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.

ఈ విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తల గురించి తెలియని వారికి అవగాహన కల్పించండం మనందరి బాద్యత.

Presented by:

Leave a Reply