Aromatic & Spicy & Healthy…. Leaves…

ఆరోమేటిక్ (సుగంధ) – స్పైసీ (సుమధుర) – హేల్దీ (ఆరోగ్య) వరం ఈ కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు.

ఆకుల రూపంలో ఆరోగ్యం

Good for Taste…. Good for Health

రుచికి రుచి – ఆరోగ్యానికి అరోగ్యం.

లేటెస్ట్ గా సశాస్త్రీయంగా తెలిందేవిటంటే, మధుమేహం నియంత్రణకు, క్యాన్సర్ చికిత్సకు… ఈ కరివేపాకు ప్రత్యామ్నాయ వైద్యంగా చక్కగా పనిచేస్తుందని.

వంటలకు చక్కని రుచిని చేర్చటమే కాదు, ఈ ఆకులు ఎన్నో వైద్య విలువలను కూడా కలిగి వున్నాయి.

కరివేపాకు చెట్టును సాంకేతికంగా ముర్రాయా కోయినిగి లేదా బెర్గెరా కోనిగి అని పిలుస్తారు. ఇది భారత ఉపఖండానికి చెందినది. ఈ కరివేపాకు మొక్కలను పురాతన మూలికల జాతికి చెందినదిగా పేర్కొనవచ్చు. దీనిని తీపి వేప (sweet neem) అని కూడా పిలుస్తారు.

ఈ కరివేపాకులను భారతదేశంలోని మరియు దూర ప్రాచ్య ఆసియా (Far-East Asia) లోని స్థానిక ప్రజలు శతాబ్దాలుగా వంటకాలను తయారు చేయడంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.

ఈ మొక్కలు సాధారణంగా 4-6 మీటర్ల (13-20 అడుగులు) ఎత్తు వరకు పెరుగుతాయి. ఈక లాంటి ఆకులు 11-21 చిరు పత్రాల (చిన్న చిన్న ఆకుల)ను కలిగి ఉంటాయి. ఈ మొక్కలు బెర్రీ ఆకారపు విత్తనాలను కలిగి ఉన్న స్వీయ-పరాగ సంపర్క (self-pollinated) తెల్లని పువ్వులను ఉత్పత్తి చేస్తాయి.

భారతదేశంలో ఈ కరివేపాకును కూరలు, అన్నం, స్నాక్స్, సూప్‌లు, చట్నీలు, స్త్యూ కూరలు (stews) మరియు పప్పు వంటకాలను తయారు చేయడంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. వాటి రుచి ఆకలిని మరింత పెంఛి వంటకాలకు అద్భుతమైన సుగందాన్నిస్తుందని భోజన ప్రియులు అంటారు.

కరివేపాకు పొడి దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని అన్నంతో పాటు తీసుకుంటారు. ఆయుర్వేదం ఈ ఆకులలో వికారం మరియు మార్నింగ్ సిక్ నెస్ నుండి ఉపశమనానికి మరియు జీర్ణ స్రావాలను(digestive secretions) పెంచడానికి అనేక వైద్య గుణాలు ఉన్నాయని చెబుతుంది. శరీరంలోని ఆక్సీకరణ నష్టం(oxidative damage) వల్ల ఎక్కువగా సంభవించే ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో ఇది సహాయపడుతుంది.

మరోవైపు, 2004లో లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన పరిశోధకులు దీనిని శాస్త్రీయంగా నిరూపించారు. ఫార్మసీ విభాగానికి చెందిన ఈ బృందం ప్రత్యామ్నాయ ఔషధాల ఉపయోగం కోసం కరివేపాకులు దివ్యంగా పని చేస్తాయని  తమ పరిశోధనల ద్వారా తెలియజేసింది.

ఈ కరివేపాకు ఆకులలో మధుమేహం ఉన్నవారిలో స్టార్చ్-టు-గ్లూకోజ్ విచ్ఛిన్నం రేటును తగ్గించే హీలింగ్ ఏజెంట్లు వున్నాయి.

రక్తంలోకి చేరే గ్లూకోజ్ మొత్తాన్ని సమర్ధవంతంగా నియంత్రించటంలో ఈ ఆకుల్లోని హెర్బల్ ఏజెంట్లు బాగా పనిచేస్తాయని హెర్బలిస్టులు చెబుతున్నారు. ఇది అజీర్ణం, మలబద్దకాల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

సాంప్రదాయ భారతదేశం, థాయ్ మరియు చైనాలలో ఉపయోగించే మూలికా మొక్కలు క్యాన్సర్ పోరాట లక్షణాలను కలిగి ఉన్నాయని పరిశోధన బృందం అధిపతి అయిన ప్రొఫెసర్ పీటర్ హౌటన్ పేర్కొన్నారు.

మొక్కల పదార్ద సారాల ఆధారంగా కొత్త ఔషధాలను కనుగొనడంలో ఇది మొదటి అడుగు. అయితే సరైన వైద్య మార్గదర్శకత్వం లేకుండా నేరుగా మొక్క యొక్క సారాలను ఔషధంగా తీసుకోవటాన్ని ఆయన హెచ్చరించారు.  ఈ ఆకులలో చాలా ఔషధ విలువలు ఉన్నప్పటికీ, మధుమేహం లేదా క్యాన్సర్‌కు ఔషధంగా తీసుకునే ముందు బాధితులు ముందుగా వైద్యుడిని సంప్రదించాలని ఆయన సూచించారు.

భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ప్రజలు సాంప్రదాయకంగా కరివేపాకులను నేరుగా నమలడం ద్వారా లేదా సిరప్‌లు, పౌడర్, పేస్ట్ మొదలైన అనేక ఇతర మార్గాల్లో స్వీకరిస్తారు.

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply