ఏనుగులకు ఎందుకు పెద్ద చెవులు ఉంటాయి?
To Watch the Videos in English and Telugu languages, Click the Links below.
భూమిపై ఇప్పుడున్న పెద్ద జంతువులలో ఏనుగే అతి పెద్ద జంతువు.
ఇవి ప్రోబోస్పిడియన్ల క్షీరద క్రమానికి (mammalian order కి) చెందినవి.
ప్రోబోస్పిడియన్స్ అంటే భారీ శాఖాహార జంతువులు.
ఇవి దంతాలు, పొడవైన తొండం (Trunk) వంటివి కలిగి వుంటాయి.
ఏనుగులలో ప్రస్తుతం రెండు జాతులు మిగిలి వున్నాయి.
ఒకటి ఆఫ్రికన్, రెండోది ఆసియన్.
ఆఫ్రికన్ ఏనుగులు ఆసియా ఏనుగుల కంటే పెద్దవిగా వుంటాయి. అంతేకాక మగ మరియు ఆడ ఏనుగుల మధ్య పరిమాణంలో వ్యత్యాసం కుడా వుంటుంది.
మగ ఏనుగులు ఆడ ఏనుగుల కంటే సాధారణంగా పెద్దవిగా వుంటాయి.
పూర్తిగా పెరిగిన మగ ఆఫ్రికన్ ఏనుగు యొక్క ఎత్తు (భుజాల వరకు తీసుకునే ఎత్తు) 4 మీటర్లు అనగా 13 అడుగుల వరకు వుంటుంది. బరువు సుమారు 7 టన్నుల వరకూ వుంటుంది.
పూర్తిగా పెరిగిన మగ ఆసియా ఏనుగు 3.3 మీటర్ల (11 అడుగులు) పొడవు వుంటుంది. బరువు 5.4 టన్నులు వుంటుంది.
ఇవి శాఖాహారులు. ప్రధానంగా గడ్డి మరియు ఇతర మొక్కలను తింటాయి.
అడవిలో వీటి సగటు జీవిత కాలం సుమారు 70 నుండి 80 సంవత్సరాల వరకూ వుంటుంది.
ఏనుగుల భౌతిక లక్షణాలలో ప్రధాన మైనవి – పొడవైన తొండం (Trunk), జత దంతాలు (Tusks), మందపాటి స్థంభం లాంటి కాళ్ళు, వెడల్పైన పాదాలు, పెద్ద పెద్ద చెవులు (వీటినే Ear Flappers అంటారు).
దీని యొక్క trunk ను ముక్కు యొక్క extension గా చెప్పవచ్చు.
ఇవి ముఖ్యంగా తొండాన్ని కొన్ని ప్రధాన పనులకు ఉపయోగిస్తుంది.
అవేంటంటే:
- మానిప్యులేటింగ్ (Manipulating),
- లిఫ్హ్టింగ్ & ఫీడింగ్ (Lifting & Feeding),
- నీరు త్రాగటం (Drinking),
- నీరు వెదజల్లటం (Spraying),
- వాసన చూడటం (Smelling),
- తాకడం (Touching),
- బాకా శబ్దాలకు (Trumpet Sounds) చేయడానికి తోన్దాన్ని ఉపయోగిస్తుంది.
ఇవి తమ దంతాలను రక్షణ కోసం మరియు చెట్లను క్రష్ (cursh) చేయడానికి ఉపయోగిస్తాయి.
దీని యొక్క మందపాటి స్తంభం లాంటి కాళ్ళు, విశాలమైన పాదాలు వీటి భారీ కాయానికి ఊతం (support) యిస్తాయి.
వీటి పెద్ద పెద్ద వెడల్పైన పాదాల సహాయంతో ఇవి భూమిలోని ప్రకంపనలను గుర్తిస్తాయి. ఆ సంకేతాల ద్వారా అవి సమీపంలో వున్న జంతువులను, దూరం నుండి దూసుకొస్తున్న జంతు మందలను (stampeding of animals) గుర్తించ గలుగుతాయి.
ఇక వీటి పెద్ద పెద్ద చెవుల విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇది వినటానికి చాలా ఆసక్తిగా వుంటుంది.
ఆఫ్రికన్ ఏనుగుల చెవులు ఆసియా ఏనుగుల చెవుల కన్నా పెద్దవిగా వుంటాయి. వాస్తవానికి వాటి చెవులు ఏ యితర జీవుల చెవుల కన్నా చాలా పెద్దవి.
డానికి కారణం – ఏనుగుల యొక్క పెద్ద పెద్ద చెవులు రేడియేటర్లుగా (Radiators) పనిచేస్తాయి.
ఈ విశాలమైన చెవులు వాటిని చల్లగా ఉంచడానికి తోడ్పడతాయి. దీనినే హీట్ డిస్సిపేషన్ ప్రాసస్ (Heat Dissipation Process) అంటారు.
వీటి పెద్ద పెద్ద చెవులలో వుండే అనేక రక్త నాళాల ద్వారా వీటి శరీర వేడి గాలి లోకి విసర్జింప బడుతుంది.
ఈ ప్రక్రియ కారు లేదా మరే యితర వాహనాలలో వుండే రేడియేటర్ యొక్క పనిని పోలి వుంటుంది.
మరో విషయ మేంటంటే అసియా ఏనుగుల చేపులు ఆఫ్రీకా ఏనుగుల చెవుల కన్నా చిన్నవిగా ఉండడానికి కారణం – అవి ఆసియా లోని చల్లని నీడ కలిగిన, తక్కువ ఉష్ణోగ్రతలు కలిగిన వర్సారణ్య ప్రాంతాలలో నివసించడమే. అదన్న మాట ఏనుగుల పెద్ద చెవుల వెనకున్న scientific మేటర్.
For the same post in English Language:
All Blogs & Vlogs from mamlabs.net