Vedas/Telugu

Watch the Video

వేదము అంటే “జ్ఞానం” లేదా “వివేకం”.

ఈ వేదములు “శాశ్వతమైన మార్గం”, లేదా “శాశ్వతమైన క్రమం” అంటే (సంస్కృత భాష లో సనాతన ధర్మం) గా ప్రసిద్ధి చెందిన, హిందూమతం యొక్క అత్యంత పురాతన పవిత్ర గ్రంథాలు.

అవి సుమారుగా క్రీస్తు పూర్వం రెండు వేల నాటి ప్రాచీన సంస్కృతంలో కూర్చబడ్డాయి.

హిందువులు, వేదాలను పవిత్ర గ్రంథాలుగా మరియు మహా ఋషులు తమ తపస్సులో విన్న విలువైన  శ్లోకాలుగా భావిస్తారు.

సంఖ్యా పరంగా ఇవి నాలుగు.

ఒకటి ఋగ్వేదం. రెండు యజుర్వేదం. మూడు సామవేదం. నాలుగు అథర్వవేదం.

ప్రతి వేదం మళ్లీ నాలుగు రకాలుగా వర్గీకరించబడ్డాయి.

అవేంటనగా.

సంహితలు.

ఇవి మంత్రాలు మరియు ఆశీర్వాదాలు.

అరణ్యకులు.

అవి నవజాత శిశువులు అంటే పుట్టిన బిడ్డలు, వయస్సు, వివాహం, పదవీ విరమణ మరియు దహన సంస్కారాలకు సంబంధించిన ఆచారాలు మరియు వేడుకలు వంటి వాటికి చెందిన గ్రంథాలు.

బ్రాహ్మణములు.

ఇవి ఆచారాలు, వేడుకలు మరియు త్యాగాలకు సంబంధించిన వ్యాఖ్యానాలు.

ఉపనిషత్తులు.

అవి ధ్యానం, తత్వశాస్త్రం మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు.

కొంతమంది పండితులు “ఉపాసనల” ను ఐదవ రకంగా భావిస్తారు.

ఉపాసనలు.

ప్రాథమికంగా ఇవి చిన్న చిన్న ఆచారములు ఆరాధనలకు సంబంధించిన భాగాలు.

ఇప్పుడు ఈ నాలుగు వేదాలంటే ఏవిటో చెప్పుకుందాం.

ఋగ్వేదం.

ఇది వేద కాలం యొక్క ప్రారంభ దశకు చెందినది.

భాషా సంబంధ శాస్త్రీయ ఆధారాల ప్రకారం, ఇవి  సుమారుగా క్రీస్తు పూర్వం పదిహేను వందలు మరియు వేయి సంవత్సరాల మధ్య కాలానికి, చెందినవని అంటారు.

ఈ ఋగ్వేదం, ఆనాటి కాలానికి చెందిన, పది  మండలాలు అంటే పుస్తకాలుగా కూర్చబడిన, పది వేల ఐదు వందల ఏభై  రెండు శ్లోకాలను కలిగి ఉంది.

ఈ శ్లోకాలు, వేద సంస్కృతంలో అనేక కవితా రీతులతో వల్లించబడి, వివిధ ఆచారాల కోసం ఉద్దేశించబడ్డాయి.

సామవేదం.

ఇందులో దాదాపు ఋగ్వేదం నుండి తీసుకోబడిన, పదిహేను వందల నలభై తొమ్మిది చరణాలు ఉన్నాయి.

సామవేదం రెండు ప్రధాన భాగాలుగా విభజించ బడింది.

ఒకటి గానం. రెండు ఆర్చికలు అంటే పుస్తకాలకి సంబంధించినవి.

ప్రస్తుతం ఉన్న చరణాలు ఋగ్వేదం అనంతర కాలం అంటే, సుమారు క్రీస్తు పూర్వం పన్నెండు వందల నుండి వేయి సంవత్సరాల మధ్య కాలం నాటివి.

యజుర్వేదం.

ఇది పూజారులు చెప్పిన, ఆచార సమర్పణ సూత్రాలకు సంబంధించిన గద్య మంత్రాలను కలిగి ఉంది.

ఇది క్రీస్తు పూర్వం పన్నెండు వందల నుండి ఎనిమిది వందల కాలానికి తర్వాత, కురు రాజ్య సమయంలో ప్రారంభమైన, భారతీయ ఇనుప యుగానికి అంటే ఇండియన్ ఐరన్ ఏజ్కి చెందినదని చెప్తుంటారు.

ఇది ఋగ్వేద శ్లోకాలపై నిర్మించబడిన, పద్దెనిమిది వందల డెబ్బై అయిదు శ్లోకాలను కలిగి ఉంది.

దీనిలో రెండు ప్రధాన పర్వాలు ఉన్నాయి.

అవేంటంటే.

ఒకటి నలుపు అంటే కృష్ణ పర్వం.

ఇవి అప సవ్య క్రమంలో వున్న మిశ్రమ శ్లోకాల సేకరణ.

రెండవది తెలుపు అంటే శుక్ల పర్వం. 

అవి కృష్ణ పర్వానికి భిన్నంగా చక్కగా అమర్చబడిన శ్లోకాలు.

ఇక ఆఖరిదైన అథర్వవేదం.

దీనిని కొంతమంది పండితులు, మాయా సూత్రాల వేదం అని కూడా పిలుస్తారు.

ఇందులో దాదాపు ఏడు వందల అరవై కీర్తనలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఋగ్వేదం నుండి తీసుకోబడ్డాయి. ఇది బహుశా క్రీస్తు పూర్వం తొమ్మిది వందల కాలంలో సంకలనం చేయబడింది.

దానిలోని అనేక పుస్తకాలు, తత్వశాస్త్రం మరియు థియోసఫీకి చెందినవి.

ఈ శ్లోకాలు, వైదిక జీవితంలోని ఆచారాలు మరియు నమ్మకాలతో సంబంధం కలిగి వుండటమే కాకుండా, రాజులు వారి పరిపాలనా విధానాన్ని కూడా వివరిస్తాయి.

అథర్వవేదంలో రెండు వేర్వేరు వెర్షన్లు ఉన్నాయి.

మొదటది పైప్పలాడ. రెండవది సౌనకియా.

కొన్ని పురాణాలను ఐదవ వేదంగా కొంతమంది పండితులు పరిగణిస్తారు.

అవేంటంటే, మహాభారతం, నాట్యశాస్త్రం యింకా మరికొన్ని పురాణాలు అన్నమాట. ఇదీ క్లుప్తంగా వేదాలు, వాటి విశిష్టత.

Presented by:

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply