కార్ల తయారీ చరిత్రలో వోక్స్‌వ్యాగన్ వారి “బీటిల్” అత్యంత ప్రజాదరణ పొందిన కారు.
జర్మన్ పదం Volks (వోక్స్) అంటే “ప్రజలు”, Wagen (వేగన్) అంటే కారు, అందువలన Volkswagen “ప్రజల కారు” గా ప్రసిద్ధి కెక్కింది.
దీనిని మొదట KdF వేగన్ అని పిలిచేవారు. జర్మన్‌లో KDF అంటే క్రాఫ్ట్ డర్చ్ ఫ్రాయిడ్, అంటే “సంతోషమే బలం”.
వోక్స్‌వ్యాగన్ లోగో VW.
1930ల ప్రారంభంలో, కార్లు విలాసవంతమైన జీవితానికి సూచిక అని చెప్పవచ్చు. చాలా మంది జర్మన్లకి కార్లను కొనుగోలు చేసే శక్తి ఉండేది కాదు.
అప్పట్లో బ్రిటన్ లేదా ఫ్రాన్స్ దేశాలలో వున్న కార్ల సంఖ్య తో పోల్చుకుంటే జర్మనీ వద్ద సగం మాత్రమే ఉండేవి.
ప్రతి 50 మంది జనాభాలో ఒక జర్మన్‌కు మాత్రమే కారు ఉండేది.
ప్రముఖ కార్ డిజైనర్ అయిన ఫెర్డినాండ్ పోర్స్చే (Ferdinand Porsche) ఒక చిన్న కారును తయారు చేయాలని కలలు కన్నాడు.
అప్పటి కార్లకు భిన్నంగా బీటిల్ కారు, ఒక చిన్న కుటుంబానికి తగ్గట్లుగా ధర తక్కువగా ఉండేట్లు డిజైన్ చేశాడాయన.
అతను తన కలలను నెరవేర్చుకోవడానికి తగిన తయారీదారు (పెట్టుబడిదారు) కోసం చూస్తున్నాడు.
అప్పుడు అధికారంలో వున్న అడాల్ఫ్ హిట్లర్, ఈ ప్రాజెక్ట్‌లో పాలుపంచుకున్నాడు. వోక్స్‌వ్యాగన్ ను “ప్రజల కారు”గా అభివృద్ధి చేయడంలో వ్యక్తిగత ఆసక్తిని కనబరిచాడు.
కొత్త పరిశ్రమ, కొత్త ఉద్యోగాలు సృష్టించడమే కాకుండా కారును అతి చౌకగా సామాన్య జర్మన్లకి పొదుపు పథకం ద్వారా అందజేసేలా చేయడమే హిట్లర్ లక్ష్యం.
దీనికి అనుగుణంగా డాక్టర్ పోర్స్చే ప్రజల కారును చౌకగా రూపొందించారు.
ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ను కారు వెనుక భాగంలో అమర్చటం ద్వారా అనవసర యంత్ర భాగాల సంఖ్య తగ్గి తద్వారా బరువు తగ్గటమే కాకుండా మెయింట్ నెన్స్ కుడా ఈజీ అయ్యేలా ఫెర్డినాండ్ కారును డిజైన్ చేశాడు.
ఆ విధంగా 1937లో జర్మన్ లేబర్ ఫ్రంట్ ద్వారా వోక్స్‌వ్యాగన్ పేరుతో కార్ల ప్రపంచంలోకి ఒక క్రొత్త ఆటోమేకర్ రంగ ప్రవేశం చేసింది.
మొట్ట మొదటగా తయారైన కారు 1938 అక్టోబర్ లో మ్యూనిచ్ మరియు వియన్నాలో జరిగిన కార్ల ప్రదర్శనలో ప్రదర్శించ బడింది.
రెండవ కారు 1939 ఫిబ్రవరి 17న బెర్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ మోటార్ షో లో అడాల్ఫ్ హిట్లర్‌కు అంద చేయబడింది.
హిట్లర్ దానిని తన స్నేహితురాలైన ఎవా బ్రాన్ (Eva Braun) కి పుట్టినరోజు బహుమతిగా ఇచ్చాడు.
1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే నాటికి కొంతమంది పౌరులు మాత్రమే బీటిల్‌ను పొందగలిగారు.
యుద్ధం తర్వాత, బీటిల్ చాలా ప్రజాదరణ పొందింది. 20 మిలియన్లకు పైగా కార్లు అమ్ముడయ్యాయి.
నేడు, వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థగా రూపుదిద్దుకుంది.
ఇది 2016 మరియు 2017లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సేల్స్ చేసింది.
ఇది చైనాలో అతిపెద్ద మార్కెట్‌ను కలిగి ఉంది. చెప్పాలంటే ఇది 40% సేల్స్, లాభాలను ఒక్క చైనాలోనే సాధిస్తోంది.
ఇది ఐరోపా మరియు లాటిన్ అమెరికాలలో కూడా పెద్ద మార్కెట్లను కలిగి ఉంది.
యూరప్‌లో అతిపెద్ద ఆటోమేకర్‌గా ఇది అవతరించింది.
వోక్స్‌వ్యాగన్ బ్రాండ్ వివిధ మోడళ్లను ఉత్పత్తి చేస్తున్నది. ఇందులో ప్రపంచ స్థాయి ఉత్పత్తులు మరియు ప్రాంతీయ తరహా ఉత్పత్తులు కూడా వున్నాయి.
కంపెనీ యొక్క ప్రసిద్ధ బ్రాండ్లు ఆడి, సీట్, పోర్స్చే, లంబోర్గిని, బెంట్లీ, బుగట్టి, స్కానియా మరియు స్కోడా మొదలైనవి.
దీని ప్రపంచ ప్రధాన కార్యాలయం జర్మనీలోని వోల్ఫ్స్‌బర్గ్‌లో ఉంది.
ఇది 74000 మంది ఉద్యోగులను మరియు 7700 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లను కలిగి ఉంది.
చాలా కాలంగా, వోక్స్‌వ్యాగన్ కార్ల తయారీలో 20 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది.
జర్మనీలోని ప్లాంట్‌లతో పాటు, వోక్స్‌వ్యాగన్ స్థానిక మార్కెట్ అవసరాలకు తగ్గట్టు వ్యవహరించడానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాక్టరీలను కలిగి ఉంది.
ఇవి మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, స్లోవేకియా, చైనా, ఇండియా, రష్యా, మలేషియా, బ్రెజిల్, అర్జెంటీనా, పోర్చుగల్, స్పెయిన్, పోలాండ్, చెక్ రిపబ్లిక్, బోస్నియా మరియు హెర్జెగోవినా, కెన్యా మరియు దక్షిణాఫ్రికాలలో ఉన్నాయి.
2011లో ఫోర్బ్స్ గ్లోబల్ (Forbes Global) 2000 యొక్క ప్రపంచంలోని టాప్ 25 కంపెనీలలో ఒకటిగా వోక్స్‌వ్యాగన్ నిలిచింది.
ఈ సంస్థ వోల్ఫ్స్‌బర్గ్‌లో ఆటోమ్యూజియాన్ని నిర్మించి దానిని వోక్స్‌వ్యాగన్ చరిత్రకు అంకితం చేసింది.
2019లో వోక్స్‌వ్యాగన్ యొక్క వార్షిక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ టిగువాన్ (Tiguan) అని, ఆ తర్వాత స్థానాలలో Virtus, Vento, Ameo, Golf, Lavida, Kombi మొదలైనవి ఉన్నాయని ప్రకటించింది.
1978లో వోక్స్‌వ్యాగన్ ‘ప్యూర్ ఇథనాల్ ప్రోటోటైప్ కారు’ – “VW డో బ్రెజిల్”ను అభివృద్ధి చేసింది.
2003 VW గోల్ 1.6 టోటల్ ఫ్లెక్స్ బ్రెజిల్‌లో ప్రారంభించబడిన మొదటి పూర్తి సౌకర్యవంతమైన-ఇంధన వాహనం.
హైబ్రిడ్ కార్ల కోసం బ్యాటరీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు వోక్స్‌వ్యాగన్ మరియు సాన్యో (Sanyo) కలసి పనిచేస్తున్నాయి.
‘వోక్స్‌వ్యాగన్ జెట్టా హైబ్రిడ్‘ హైవేలో గ్యాలన్‌కు 48 US మైళ్లు, అంటే లీటరుకు 20.4 కిలోమీటర్లు యిస్తుంది.
వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTE అనేది ‘ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు’.
మే 2016 నాటికి, రిటైలర్ల కోసం తొమ్మిది ప్లగ్-ఇన్ ఎలక్ట్రిక్ కార్లు అందించబడ్డాయి.
‘వోక్స్‌వ్యాగన్ XL1‘ ప్రపంచంలోనే అత్యంత ఇంధన-సమర్థవంతమైన కారు. ఇది ఒక గ్యాలన్ (సుమారు 3.8 L) కు 261 మైళ్ల (సుమారు 420 km) వరకు మైలేజీ యిస్తుంది.
2009లో వోక్స్‌వ్యాగన్ యొక్క ‘జెట్టా డీజిల్ సెడాన్’ కారు ‘గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును పొందింది.
వోక్స్‌వ్యాగన్-అప్ (Volkswagen-up) ‘2012 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకుంది.
వోక్స్‌వ్యాగన్ పోర్షే టైప్ 64 రేసర్, ట్విన్-ఇంజిన్ రేసింగ్ బీటిల్, బోరా, రేస్ టౌరెగ్ 2 వంటి అనేక మోటార్‌స్పోర్ట్ కార్లను కుడా తయారు చేసింది.
All Blogs & Vlogs from mamlabs.net