అద్భుత వక్త – జంఝామారుతం
ఆయన ఒక అమోఘ వక్త…(The Great Orator).
భారతదేశం నుండి వీచిన జంఝామారుతం (తుఫానులా వచ్చిన సన్యాసి -The Cyclonic Monk from India).
ప్రపంచ మతాల మొదటి సంయుక్త సదస్సు (The First Parliament of World Religions) అనగానే టక్కున గుర్తుకొచ్చే పేరు స్వామి వివేకానంద.
ఆయన 1893 లో USA లోని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల మొదటి పార్లమెంటులో హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించారు.
ఆయన ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన హిందూ మత సన్యాసి మరియు తత్వవేత్త.
ఆయన ప్రాచీన భారతీయ మత సిద్దాంతం మరియు తత్వశాస్త్రం తరపున ప్రతినిధిగా వ్యవహరించారు.
అతను 19వ శతాబ్దపు భారతీయ యోగి, తన గురువు అయిన రామకృష్ణ పరమహంస అడుగు జాడలలో ప్రధాన శిష్యుడిగా తన జీవితాన్ని గడిపారు.
వివేకానందుడు భారతదేశంలోని హౌరా (పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్‌కతా తర్వాత రెండవ అతిపెద్ద నగరం)లో 1897 మే 1న రామకృష్ణ మఠాన్ని మరియు రామకృష్ణ మిషన్‌ను (బేలూర్ మఠం అని కూడా పిలుస్తారు) స్థాపించాడు. తద్వారా తన గురువు రామకృష్ణుని కలలను నెరవేర్చాడు.
భారతీయ దర్శనాలపై (వేదాంత మరియు యోగా యొక్క బోధనలు మరియు అభ్యాసాలు) ఆయన చేసిన ప్రసంగాలు పాశ్చాత్య ప్రపంచానికి హిందూమతం యొక్క అజరామర ఔన్నత్యంపై విస్తృత అవగాహనను కలిగించాయి.
19 వ శతాబ్దపు చివరికల్లా ఆయన హిందూ మతాన్ని ప్రధాన ప్రపంచ మత స్థాయికి తీసుకువచ్చారు.
అంతేకాక అందరిలో సర్వమత అవగాహనను పెంచడంలో ఆయన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యాయి.
సమకాలీన హిందూ సంస్కరణ ఉద్యమాలలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాక బ్రిటిష్ పాలనలో ఉన్న అప్పటి భారతదేశంలో జాతీయవాద భావనకు తన సేవలను అందించారు.
సెప్టెంబరు 11న, వివేకానందుడు చికాగోలో 1893 ప్రపంచ మతాల పార్లమెంటులో పాల్గొన్నవారిని ఉద్దేశించి తన గంభీర స్వరంతో “అమెరికా సోదర సోదరీమణులారా …” (“Sisters and brothers of America …”) అనే పదాలతో ప్రారంభించాడు.
ఆ మాటలు విన్నవెంటనే ప్రేక్షకులంతా లేచి నిలబడి ఆగకుండా రెండు నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
నేటికీ ప్రపంచం ఆయన పలికిన ఈ మాటలను, ఆయననూ స్మరిస్తుంటుంది.
సభలో నిశ్శబ్దం పునరుద్ధరించబడిన తరువాత, వివేకానందుడు తన ప్రసంగాన్ని కొనసాస్తూ, “ప్రపంచంలోని పురాతన సన్యాసుల క్రమం తరపున, సర్వ మతాల తల్లి తరపున, మరియు కోట్లాది హిందూ ప్రజల తరపున నేను మీకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసు కుంటున్నాను” అని అనర్ఘలంగా ఉపన్యసించాడు.
వివేకానందుని అద్భుత ప్రసంగానికి ముగ్ధుడైన, హార్వర్డ్ సైకాలజీ ప్రొఫెసర్ విలియం జేమ్స్ ఆయనను కొనియాడుతూ – “ఈ వ్యక్తి అమోఘ వక్తృత్వ శక్తికి ఒక నిదర్శనం. సర్వ మానవాళికి ఒక గొప్ప గౌరవం” అని అన్నారు.
అప్పటి ప్రపంచ మతాల పార్లమెంట్ అధ్యక్షుడైన జాన్ హెన్రీ బారోస్ మాట్లాడుతూ “అన్ని మతాలకు తల్లి లాంటి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించించిన కాషాయ సన్యాసి అయిన స్వామి వివేకానంద సదస్సుకు హాజరైన ఆహుతులపై అద్భుత ప్రభావాన్ని చూపించారు” అని కొనియాడారు.
అతని అనర్గళ ప్రసంగాలు విని, నాటి మీడియా దృష్టి వివేకానంద వైపు మళ్లింది. ఆయనను “భారతదేశం నుండి వచ్చిన జంఝామారుతం (తుఫానులా వీచిన సన్యాసి -The Cyclonic Monk from India) అనే బిరుదుతో ఎన్నో విధాల ప్రశంసించింది.
వివేకానంద పార్లమెంట్‌లో మత సహనాన్ని నొక్కి చెబుతూ సర్వ మత సార్వత్రికత గొప్పదనం గురించి మాట్లాడారు.
అంతేకాకుండా వివేకానందుడు “అందమైన తూర్పు దేశ వాసి” (Handsome Oriental) అనే టైటిల్‌తో ఘనత పొంది, ప్రపంచవ్యాప్తంగా వేనోళ్ళ ‘గొప్ప వక్త’గా మన్ననలు పొందాడు.
All Blogs & Vlogs from mamlabs.net