Human Body / Organ System

మానవ శరీరం – అవయవ వ్యవస్థ

ఒక సంస్థను తీసుకోండి లేదా ఏదైనా మెషీన్ ను చూడండి, లేదా మనం నిత్యం ఉపయోగించే వాహనాన్ని పరిశీలించండి. అది సక్రమంగా పనిచేయడానికి దానిలోని అనేక భాగాలు, అనేక వ్యవస్థలు నిరంతరం తమ విధిని నిర్వహిస్తుంటాయి.

అలాగే మనం చూడటానికి ఒక శరీర ఆకృతిలో ఒక మనిషిలా చక్కగా పైకి కనిపిస్తుంటాం.

అలా కనిపించడానికి మనలోని అనేక అవయవాలు, వ్యవస్థలు శక్తివంచన లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తూనే వుంటాయి.

ఈ విషయం మనం సైన్స్ పుస్తకాలలో చదివే వుంటాం. కానీ అవన్నీ మన విధులను మనం సక్రమంగా చేయడానికి, యింకా చెప్పాలంటే మన వారసులను పుట్టించి మన మానవ జాతి మనుగడ సాగించడానికి, ఎలా సంఘటితంగాను, నిర్విరామంగాను పనిచేస్తున్నాయో ఒకసారి సంక్షిప్తంగా అవలోకింప జేసే ప్రయత్నమే ఈ బ్లాగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

మన శరీరంలోని అవయవ వ్యవస్థలు ఈ క్రింది విధంగా వర్గీకరించబడ్డాయి:

(Classification of Organs):

  1. ప్రసరణ వ్యవస్థ (Circulatory System),
  2. జీర్ణ వ్యవస్థ (Digestive System),
  3. ఎండోక్రైన్ వ్యవస్థ (అంతః స్రావీయ గ్రంది వ్యవస్థ) (Endocrine System),
  4. ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ (చర్మ సంభంద వ్యవస్థ) (Integumentary System),
  5. శోషరస వ్యవస్థ (Lymphatic System),
  6. కండరాల వ్యవస్థ (Muscular System),
  7. నాడీ వ్యవస్థ (Nervous System),
  8. పునరుత్పత్తి వ్యవస్థ (Reproductive System),
  9. శ్వాస కోశ వ్యవస్థ (Respiratory System),
  10. అస్థిపంజర వ్యవస్థ (Skeletal System),
  11. మూత్ర వ్యవస్థ (Urinary System).

అవయవాలు ఒక నిర్దిష్ట పనిని నిర్వహించే కణజాలాల (group of tissues) సమూహం.

పొట్ట (ఉదరం = stomach), గుండె (heart), ఊపిరితిత్తులు (lungs), మూత్రపిండాలు (kidneys) మొదలైనవి అన్న మాట.

అవయవ వ్యవస్థ మానవ శరీరం యొక్క సరైన పనితీరు (functioning of the human body) ను నిర్ధారిస్తుంది.

మన శరీరం లోని అవయవాలన్నీ సమిష్టిగా ఒక నిర్దిష్ట పనితీరు కోసం ఒక దాని కొకటి సహకరించు కుంటూ అనుగుణమైన పని తీరును కనబరుస్తాయి.

ఉదాహరణకు, కడుపులోని ఎపిథీలియల్ కణజాలం మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన జీర్ణ రసాల (digestive juices) ను ఉత్పత్తి చేస్తుంది (స్రవిస్తుంది).

ఉదరం (పొట్ట) యొక్క గోడ సంకోచించే కణజాలాన్ని కలిగి ఉంటుంది, ఇది గ్యాస్ట్రిక్ రసంతో ఆహారాన్ని కలపడానికి అనుమతిస్తుంది.

ఆ తరువాత, ఈ జీర్ణ సమ్మేళనం (digestive concoction) చిన్న ప్రేగులో (small intestine) కి కదులుతుంది.

దీనికి అనుగుణంగా, నరాల కణజాలం (Nerve tissues)  కడుపు యొక్క సంకోచాన్ని నియంత్రించే మార్గంలో ఒక ప్రేరణ (impulse) ను ప్రసారం చేస్తుంది.

ఇప్పుడు ఒక్కొక్క అవయవ వ్యవస్థ గురించి టూకీగా తెలుసుకుందాం.

మానవ శరీర అవయవాల క్రమబద్ధమైన పనితీరు:

The systematic functioning of the human body organs:

  • ఈ ప్రసరణ వ్యవస్థలో గుండె ప్రధాన భాగం.
  • వివిధ రసాయనాలతో కూడిన రక్తం శరీర మంతటా ప్రసరించేందుకు గుండె ఒక పంప్ వలె సహాయపడుతుంది.

  • జీర్ణవ్యవస్థలో ప్రధానమైన భాగాలు – కడుపు మరియు ప్రేగులు.
  • ఇవి శరీరం సమర్ధవంతంగా పని చేయడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

  • దీనిలో థైరాయిడ్ కీలకమైన అవయవం. ఇది అంతర్గత అవయవ తదితర పరిస్థితులను సక్రమంగా నిర్వహింప బడేలా చూస్తుంది.

  • చర్మం మరియు జుట్టు ఈ వ్యవస్థలో ప్రధాన భాగాలు. అవి మన శరీరాన్ని వ్యాధికారక క్రిములు మరియు రసాయనాల నుండి రక్షిస్తాయి.
  • ఈ వ్యవస్థ మన శరీరంలోవున్న నీరు అధికంగా నష్ట పోకుండా బేలెన్స్ చేస్తుంది.

  • ఈ వ్యవస్థలో ప్లీహము (Spleen) ప్రధాన అవయవం.
  • ఇది రోగనిరోధక శక్తి, రవాణా వ్యవస్థ మరియు ద్రవాలు తిరిగి పూర్వ స్థితికి రావడానికి బాగా సహాయపడుతుంది.

  • ఈ వ్యవస్థలో హృదయ కండరాలు (Cardiac Muscles), అస్థిపంజర కండరాలు (Skeletal Muscles) ప్రధానమైనవి.
  • ఇవి శరీరం యొక్క కదలిక (movement of the body), గుండె తన విధిని సక్రమంగా నిర్వహించేందుకు  తోడ్పడతాయి.

  • మెదడు (Brain) మరియు వెన్నుపాము (spinal cord) దీనిలోని ప్రధాన అవయవాలు.
  • ఇది ముఖ్యంగా అంతర్ముఖ ప్రేరణలను (incoming stimuli), శరీర కార్యాచరణ యొక్క సమన్వయాన్ని (coordination of activity ను) నిర్వహిస్తుంది.

  • ఈ వ్యవస్థలో ప్రధానమైనవి – వృషణాలు (Testes), అండాశయాలు (Ovaries).
  • దీని ముఖ్య ప్రయోజనం – సంతానం ఉత్పత్తి (production of offspring).

  • ఊపిరితిత్తులు (Lungs) ఈ వ్యవస్థ యొక్క ప్రధాన అవయవాలు.
  • ఊపిరితిత్తుల ద్వారా గ్యాస్ మార్పిడి (Gas exchange) జరుగుతుంది. అంటే ఆక్సిజన్ ను స్వీకరించి కార్బన్ డైయాక్సైడ్ ను బయటికి విసర్జించటం.

  • దీనిలో ఎముకలు (bones) మరియు స్నాయువులు (ligaments) ప్రధానమైనవి.
  • అవి శరీరానికి సపోర్ట్ ని (ఉతాన్ని) యిస్తాయి. అంతేకాకుండా  శరీరానికి అవసరమైన పోషకాలను నిల్వ చేస్తాయి.

  • మూత్రాశయం (bladder) మరియు మూత్రపిండాలు (kidneys) ప్రధాన అవయవాలు.
  • శరీరంలో పేరుకు పోయే వ్యర్థ ఉత్పత్తుల (పదార్థాల) తొలగింపు ఈ వ్యవస్థ యొక్క ప్రధాన విధి.

Presented By:

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply