Heart Disease/CAD/Tel

గుండె జబ్బులు / CAD/ ప్రధాన కారణాలు

హార్ట్ అటాక్ – CAD

ప్రమాద కారకాలు (The Risking Factors):

హార్ట్ డిసీజ్ (CAD)  అంటే ఏమిటి? అది ఎలా ప్రాణాంతకమవుతుంది?

CAD పూర్తి పేరు – కరోనరీ ఆర్టరీ డిసీజ్, లేదా కరోనరీ హార్ట్ డిసీజ్ (CHD), లేదా సింపుల్ గా హార్ట్ డిసీజ్ అని పిలుస్తారు.

ఈ వ్యాధికి సంబంధించిన వైద్య పదాలు:

మయోకార్డియల్ ఇస్కీమియా (MI) లేదా ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ (IHD) లేదా గుండె జబ్బు (హార్ట్ ఎటాక్).

ఈ వ్యాధికి మూల కారణం:

గుండెకు రక్త ప్రసరణ తగ్గడం.

గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే ధమనుల లోపల ప్లేక్ (కొవ్వు ఫలకలు) పేరుకు పోయినప్పుడు ఇది సంభవిస్తుంది.

కరోనరీ ధమనులు అంటే ఏమిటి?

కొరోనరీ ధమనులు అంటే గుండె కండరాలకు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలు.

అవి కుడి మరియు ఎడమ కరోనరీ ధమనులు అని పిలువబడే రెండు ప్రధాన ధమనులు.

ఇవి మొత్తం గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి.

ప్లేక్ మరియు అథెరోస్క్లెరోసిస్ లు అంటే ఏమిటి?

ఫ్లేక్:

ప్లేక్ (కొవ్వు ఫలకలు): సింపుల్ గా చెప్పాలంటే యివి రక్తంలో ఏర్పడే కొవ్వు తదితర కొలెస్ట్రాల్ వంటి పదార్థాలతో ఏర్పడే కొవ్వు ఫలకలు.

అథెరోస్క్లెరోసిస్:

కొరోనరీ ధమనులలో కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఫలకలు (ప్లేక్) ఏర్పడే ఈ పరిస్థితిని అథెరోస్క్లెరోసిస్ అంటారు.

అథెరోస్క్లెరోసిస్ వల్ల రక్తం గుండె యొక్క అవసరమైన ప్రాంతాలకు చేరుకోవడం కష్టం అవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా CAD కారణంగా ఏటా 17.8 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని అంచనా. యునైటెడ్ స్టేట్స్లో ప్రతి నలుగురిలో ఒకరు దీని వల్ల మరణిస్తున్నారు. నేషనల్ హార్ట్, లంగ్ మరియు బ్లడ్ ఇన్స్టిట్యూట్ (NHLBI) ప్రకారం USలో ప్రతి సంవత్సరం దాదాపు 6,00,000 మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు.

CAD (గుండె పోటు)కి దోహదపడే ముఖ్యమైన కారణాలు:

ముఖ్యంగా క్రింద యివ్వబడిన ఎనిమిది కారణాలు గుండెపోటు రావటానికి దోహద పడతాయి.

Eight factors (given below), in particular, contribute to heart attacks.

1. అధిక బరువు లేదా ఊబకాయం (Overweight or obesity):

అదనపు శరీర బరువు (ఊబకాయం) / అదనపు శరీర కొవ్వు / అధిక బరువు).  

శరీరంలో అధిక మొత్తంలో పేరుకున్న కొవ్వు మరియు అదనపు ఎముకల బరువు, యింకా చెప్పాలంటే ఎక్కువగా చేరిన నీరు; మొదలైనవి ప్రధాన కారణాలు.

2. అనారోగ్య కొలెస్ట్రాల్ స్థాయిలు (Unhealthy cholesterol levels):

ధమనులలో పేరుకు పోక ముందే హై-డెన్సిటీ లిపోప్రొటీన్ (HDL) కొలెస్ట్రాల్‌ను రక్తం కాలేయాని (liver) కి తీసుకువెళుతుంది.

తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) కొలెస్ట్రాల్ మాత్రం ధమనులకు అంటుకుని రక్త ప్రవాహాన్ని తగ్గించే ఫలకల (ప్లేక్స్) ను ఏర్పరుస్తుంది.

మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు 240 mg/dl మరియు అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు CAD వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

గుండె లేదా రక్తనాళాల వ్యాధి ఉన్నవారికి LDL కొలెస్ట్రాల్ 70 mg/dl కంటే తక్కువగా ఉండాలి.

3. అధిక రక్త పోటు (High blood pressure):

బ్లడ్ ప్రేస్సర్ (రక్తపోటు) 140/90 mmHg వద్ద లేదా అంతకంటే ఎక్కువ గానీ నిలకడగా వున్నట్లయితే అది గుండె పోటుకి దారితీసే ప్రమాదకారిగా మారుతుంది.

ఈ హై బ్లడ్ ప్రేస్సర్ కి తగిన మెడికల్ ట్రీట్ మెంట్ తీసుకోవాలి.

4. ధూమపానం (Smoking):

ధూమపానం వల్ల ముఖ్యంగా రక్తనాళాలు దెబ్బతినడం, బిగుతుగా మారటం వంటి అనేక విపరిణామాలు సంభవిస్తాయి.

ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. శరీరంలోని కొన్ని కణజాలాలకు ఆక్సిజన్ చేరకుండా నిరోధిస్తుంది.

5. మధుమేహం (diabetes):

రక్తంలో ఏర్పడే అధిక సుగర్ లెవెల్స్ గుండె పోటు (CAD) ప్రమాదాన్ని పెంచుతాయి.

ఎందుకంటే, ఈ మధుమేహం వల్ల  అధిక కొలెస్ట్రాల్, LDL మరియు ట్రైగ్లిజరైడ్స్, తక్కువ HDL; మరియు అధిక రక్తపోటు వంటి ప్రమాద కారకాలు పెరుగే అవకాశం ఎక్కువ.

ఈ సందర్భంలో శరీర హార్మోన్ ఇన్సులిన్ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు అంటే తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయబడదు.

6. ఎప్పుడూ కూర్చుని వుండే జీవనశైలి (sedentary lifestyle):

శారీరక శ్రమ లేకపోవడం, ఎప్పుడూ కూర్చుని వుండటం లాంటి జీవన విధానం వల్ల గుండెపోటుకి దోహదపడే ప్రమాద కారకాలైన ఊబకాయం మరియు అధిక బరువు వంటివి ఎక్కువయ్యే ప్రమాదం వుంది. తగినంత వ్యాయామం అవసరం.

7. పెద్ద వయసు (వృద్దాప్యం) (Age Factor):

వయసు పెరగటం (వృద్దాప్యం) అనేది కూడా గుండెపోటు (CAD) ప్రమాదానికి దోహదడే ఒక అంశం కావచ్చు.

స్త్రీ పురుషులలో ప్రమాద కారక వయస్సులు ఏమిటంటే:

పురుషులకు – 45 సం.ల సంవత్సరాల తర్వాత; స్త్రీలకు – 55 తర్వాత గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువవుతుంది.

వయసు ఫేక్టర్ అనేది జన్యు మరియు జీవనశైలి మొదలగు యితర అంశాలపై కూడా ఆధారపడి వుంటుంది.

8. జన్యుపర కారణాలు (Genetic risk factors):

గుండెపోటుకి కుటుంబ చరిత్ర కూడా కారణం కావచ్చు, అంటే కుటుంబంలో పూర్వికులు ఎవరయినా ఈ వ్యాధికి గురయి వుంటే ఆ కుటుంబంలో వారికి యిది వచ్చే అవకాశం వుంది. ఖచ్చితమయితే కాదు.  

Presented by:

Leave a Reply