Health Notes:
మంచి ఆరోగ్యమే మంచి జీవితానికి ఆలంబన.
ఆరోగ్య వంతమైన జీవితం కోసం సాధారణంగా మనం ఫేస్ చేసే ఆరోగ్య సమస్యలు వాటి బేసిక్ సమాచారం, సమర్ధవంతంగా వాటిని ఎదుర్కోవటానికి అవసరమైన విలువైన సమాచార ఆర్టికల్స్ తో ఈ శీర్షికను ప్రారంభిస్తున్నాము.
ఏక్నీ అనేది చర్మంపై ఏర్పడే అసాధారణ గడ్డలు లేదా మచ్చలు (గాయాలు అని పిలుస్తారు).
ఈ గడ్డలనే మొటిమలు అంటారు.
ఇది ముఖ్యంగా ముఖం మరియు మెడ మీద ఏర్పడే మొటిమల ద్వారా వచ్చే చర్మ స్థితి. ఇది ఎక్కువగా యుక్తవయస్కులకు సంభవిస్తుంటుంది.
తీవ్రతను బట్టి సాధారణంగా రెండు రకాల మొటిమలు చర్మంపై ఏర్పడతాయి:
1. తేలికపాటి మొటిమలు (Mild Acne):
- ఇవి తీవ్రమైనవి కాదు. ఇవి చికిత్స తీసుకున్నా తీసుకోక పోయినా వస్తూ పోతూ వుంటాయి.
- వీటి వల్ల చర్మంపై మచ్చలు ఏర్పడటం లాంటి ఎటువంటి ప్రభావం వుండదు.
2. తీవ్రమైన మొటిమలు (Severe Acne):
- ఇవి తీవ్రమైన రకం. శరీర భాగంలో మచ్చలను కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా చర్మంపై గడ్డలు లేదా మచ్చలు వంటి పుండు రకం లక్షణాలు (lesion-type symptoms) కలిగి ఉంటాయి.
- ఈ తీవ్రమైన మొటిమలు అమ్మాయిల కంటే అబ్బాయిలలో ఎక్కువగా కనిపిస్తాయి.
మొటిమలు ఏర్పడడానికి ప్రధాన కారణం:
మొటిమలు శరీరం లోపల జరిగే సహజ మార్పులకు చర్మం యొక్క ప్రతిచర్య.
ముఖ్యంగా యుక్తవయస్సులో వున్న అబ్బాయిలకు లేదా బాలికలకు ఈ మొటిమలు ముఖం మీద ఏర్పడతాయి.
దీనికి ప్రధాన కారణం:
యుక్త వయసులో శరీరం ఎక్కువ హార్మోన్లను అంటే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.
ఈ హార్మోన్ల వేగవంతమైన పెరుగుదల వల్ల చర్మం నూనె (oil) ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది.
ఈ అదనపు ఆయిల్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ అంటే మృత చర్మ కణాలు, ఒకదానితో ఒకటి కలిసిపోయి చర్మంలో వుండే స్వేద రంధ్రాలను, చిన్న చిన్న ఖాళీలను అడ్డుకుంటాయి.
ఇలా మూసుకుపోయిన రంధ్రానికి దిగువన వున్న నూనె గ్రంధి, అంటే oily gland ఉత్పత్తి చేసే ఆయిలు వల్ల, మూసుకుపోయిన రంద్రం ఉబ్బి, మొటిమలగా ఏర్పడతాయి.
ఇది చాలా సహజమైన ప్రక్రియ. ఈ మొటిమలను పూర్తిగా నివారించడం అనేది ఒక విధంగా కష్టమనే చెప్పాలి.
మొటిమలకు చికిత్స:
ఇంటివద్ద తీసుకునే జాగ్రత్తలు:
మొటిమల వల్ల అధ్వాన్న స్తితి రాకుండా నిరోధించడానికి క్రింద ఇవ్వబడిన చర్యలు తీసుకోవటం మంచిది:
1. మొటిమలను శుభ్రపరచడం ఉత్తమ చికిత్స:
- ప్రభావిత చర్మాన్ని తేలికపాటి సబ్బుతో క్రమం తప్పకుండా కడగడం (ఎక్కువగా రోజుకు రెండుసార్లు) ఉపయోగకరంగా ఉంటుంది.
- ఇది మొటిమల వల్ల ఏర్పడే మూసుకుపోయిన ఆయిల్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.
2. తీవ్రమైన మొటిమల విషయంలో వైద్య సహాయం తీసుకోవడం:
- వైద్యులు సూచించిన ఔషధ లోషన్లు లేదా క్రీములను చర్మంపై అప్లై చేయటం.
- వీటికి సొంత చికేత్స చేయటం మంచిది కాదు.
- ముఖంమ్మీద శాశ్వత మైన పొక్కులు లేదా మచ్చలు ఏర్పడి ముఖం కళా విహీనంగా తయారయే ప్రమాదం వుంది.
All Blogs & Vlogs from mamlabs.net