జనరల్ నాలెడ్జ్ / పార్ట్ – 02
The greatest enemy of knowledge is not ignorance. It is the illusion of knowledge.
జ్ఞానానికి అతి పెద్ద శత్రువు అజ్ఞానం కాదు. జ్ఞానం యొక్క భ్రాంతి మాత్రమే.
Daniel J. Boorstin (American historian)
ప్రతిరోజూ GK ఎందుకు ప్రాక్టీస్ చేయాలి:
- జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరచుకోవడానికి,
- మంచి స్కోర్‌తో పోటీ పరీక్షల్లో గెలవడానికి,
- స్పష్టమైన అంశాలపై కాన్ఫిడెంట్ గా ఉండటానికి,
- నిర్దేశించిన లక్ష్యాన్ని సుళువుగా సాధించడానికి,
- ఇతరుల మధ్య ప్రత్యెక గుర్తింపు సంపాదించడానికి, etc.
అన్ని ప్రశ్నలు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం సెట్ చేయబడ్డాయి.
సమాధానాలు ఇలస్ట్రేటెడ్ నోట్స్‌తో వివరంగా ఇవ్వబడ్డాయి.
దీనివల్ల సంభందిత సబ్జెక్ట్ పై సమగ్ర అవగాహన సాధించవచ్చు.
1. నాణేల తయారీ కోసం రాగి మరియు నికెల్ కలగలసిన ఏ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు?
Which alloy of copper and nickel is used for coins?
- క్యుప్రొనికెల్ / కుప్రోనికెల్ (Cupronickel).
కుప్రోనికెల్ లేదా కాపర్-నికెల్ (CuNi) అనేది నికెల్ మరియు ఇనుము మరియు మాంగనీస్ వంటి బలవర్ధకమైన మూలకాలను (strengthening elements) కలిగి ఉండే రాగి మిశ్రమం.
రాగి మరియు నికెల్ యొక్క 60/40 మిశ్రమం. (A 60/40 alloy of copper and nickel).
కుప్రొనికెల్ ఉప్పు నీటి (salt water) ద్వారా తుప్పు పట్టకుండా అధిక నిరోధకతను కలిగి ఉంటుంది. అందువల్ల సముద్రపు నీటి వ్యవస్థల (seawater systems) లో పైపింగ్, హీట్ ఎక్స్ చేంజర్స్, కండెన్సర్‌లు, అలాగే సముద్రపు హార్డ్‌వేర్స్ కోసం ఉపయోగిస్తారు. కొన్నిసార్లు ప్రొపెల్లర్లు, ప్రొపెల్లర్ షాఫ్ట్‌లు మరియు అధిక-నాణ్యత గల బోట్ల ఉపరితల బయటి భాగాన్ని తాయారు చేయటం కోసం ఇది ఉపయోగించబడుతుంది.
2. న్యూ వరల్డ్ (ఉత్తర అమెరికా) లో మొదటి శాశ్వత కాలనీని ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు?
Who established the first permanent colony in New World (North America) and when?
- ద ఫిల్ గ్రిమ్ ఫాదర్స్ (The Pilgrim Fathers) అని పిలువబడే ఇంగ్లాండ్ నుండి వచ్చిన వలసవాదులు (colonists) 1620 లో స్థాపించారు.
యునైటెడ్ స్టేట్స్ చరిత్ర మరియు సంస్కృతిలో, పిల్ గ్రిమ్స్ లేదా పిల్ గ్రిమ్ ఫాదర్స్ అనే పదం చాలా ప్రముఖంగా వినిపిస్తుంది.
వారు ఆంగ్ల కుటుంబాల సమూహం. ఈ పిల్ గ్రిమ్ ఫాదర్స్ అనే వారు, జాన్ రాబిన్సన్, రిచర్డ్ క్లిఫ్టన్ మరియు జాన్ స్మిత్ నాయకత్వంలో మేఫ్లవర్ (Mayflower) అనే ఓడలో 1605లో ఉత్తర అమెరికాకు తమ ప్రయాణాన్ని కొనసాగించారు.
అక్కడ వారు మసాచుసెట్స్‌లోని ప్లైమౌత్ కాలనీ లేదా ప్లైమౌత్ (the Plymouth Colony or Plymouth) ను స్థాపించారు. ప్లైమౌత్ అనేది సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్ (South West England) లోని ఒకానొక ఓడరేవు నగరం.
3. ఊదారంగు (పర్పుల్) ను తయారు చేసే ప్రాథమిక రంగులు ఏమిటి?
What are the primary colors that make purple?
- ఎరుపు మరియు నీలం (Red and blue).
పర్పుల్ చేయడానికి అవసరమైన ప్రాథమిక రంగులు ఎరుపు మరియు నీలం.
ఊదా షేడ్స్ చేయడానికి ఇతర రంగులను కూడా కలపవచ్చు.
లేత ఊదా (lighter purple) రంగును సృష్టించడానికి, – తెలుపు, పసుపు లేదా బూడిద (white, yellow or grey) రంగును ఊదా రంగులో కలుపుతారు.
4. గ్రీకు వర్ణమాలలోని ఆరవ అక్షరం ఏది?
What is the sixth letter of Greek alphabet?
- జీటా (Zeta).
గ్రీకు అక్షరాలు (వర్ణమాల) పురాతన కాలం నుండి వున్న లిపి (ancient scripts) లలో ఒకటి. ఇవి యిప్పటికీ వాడుకలో ఉన్నాయి. దీని మూలం క్రీస్తు పూర్వం సుమారు 800 నాటిది. గ్రీకులో ఆల్ఫా నుండి ఒమేగా వరకు 24 అక్షరాలు వుంటాయి.
జీటా అనేది ఆరవ అక్షరం. న్యూమరాలజీలో ఇది ఏడు (7) విలువను కలిగి ఉంది.
5. ఇండోనేషియా రాజధాని ఏది?
What is the capital of Indonesia?
- నుసంతారా (కొత్త రాజధాని). జకార్తా (పాత రాజధాని).
- [Nusantara (new capital). Jakarta (old capital)].
1945లో డచ్ సామ్రాజ్యం నుండి స్వతంత్ర ఇండోనేషియా ఏర్పడినప్పటి నుండి 16 జనవరి 2022 వరకు జకార్తా ఇండోనేషియా రాజధానిగా ఉంది.
జకార్తా సముద్ర నీటిలో మునిగిపోవడం ప్రారంభించటం మరియు నగర కాలుష్యం కారణంగా, ఇండోనేషియా ప్రభుత్వం జకార్తా నుండి 2000 కి.మీ దూరంలో ఉన్న కొత్త నగరమైన నుసంతారాకు రాజధానిని మార్చినట్లు ప్రకటించింది. నుసంతర అంటే ద్వీపాల సమూహం అని అర్థం.
6. బ్రిటీష్ పార్లమెంటులో స్థానం సంపాదించిన మొట్ట మొదటి మహిళ ఎవరు?
Who was the first woman to hold a seat in the British parliament?
- లేడీ నాన్సీ ఆస్టర్ (అమెరికాలో జన్మించిన బ్రిటిష్ రాజకీయవేత్త).
- Lady Nancy Astor, an American-born British politician.
ఆమె డిసెంబర్ 1, 1919న బ్రిటీష్ పార్లమెంట్‌లో మొదటి మహిళా ఎంపీ గా ఎన్నికయ్యారు.
ఆమె 1879లో అమెరికాలోని వర్జీనియాలో జన్మించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే వరకు ఆమె బ్రిటిష్ పార్లమెంట్లో ఎంపీగా కొనసాగారు.
ఆమె తన జీవితంలో విద్యా విస్తరణకు మరియు పౌర సేవలో మహిళల పాత్ర యొక్క ఆవశ్యకత వంటి అంశాలపై పార్లమెంటులోనూ, పార్లమెంట్ వెలుపల కూడా మద్దతుగా నిలిచారు.
7. క్రిమియన్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
When did the Crimean War take place?
- క్రిమియన్ యుద్ధం అక్టోబర్ 5, 1853న ప్రారంభమై మార్చి 30, 1856న ముగిసింది.
- (The Crimean War broke out on October 5, 1853 and ended on March 30, 1856).
ఇది రష్యాకు మరియు ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఒట్టోమన్ సామ్రాజ్యం మరియు పీడ్‌మాంట్-సార్డినియా దేశాల కూటమికి మధ్య జరిగిన సైనిక సంఘర్షణ.
క్రిమియన్ పోరులో మూడు ప్రధాన యుద్ధ ఘట్టాలు (యుద్ధాలు) వున్నాయి.
- సెప్టెంబర్ 20, 1854 న అల్మా యుద్ధం (The battle of the Alma).
- అక్టోబర్ 24 న బాలక్లావా యుద్ధం (The battle of Balaclava).
- నవంబర్‌లో ఇంకర్‌మాన్ వద్ద రష్యా దాడి (Russian attack at the Inkerman).
క్రిమియన్ యుద్ధ సమయంలో, గాయపడిన సైనికులకు సేవ చేయడం ద్వారా ఫ్లోరెన్స్ నైటింగేల్ “ది లేడీ విత్ ది ల్యాంప్”గా గుర్తింపు పొందింది. రోగులకు సేవ చేయడంలో ఆమె అనుసరించిన కొత్త నర్సింగ్ పద్ధతులు ఆమెను ఆధునిక నర్సింగ్ స్థాపకురాలిగా (founder of the modern nursing గా) మార్చాయి.
చివరగా, పారిస్ లో జరిగిన (పారిస్) కాంగ్రెస్ యొక్క శాంతి చర్చల ఫలితంగా పారిస్ ఒప్పందం సంతకం చేయబడింది. తత్ఫలితంగా యుద్ధం మార్చి 30, 1856న ముగిసింది.
8. భూమిపై నివసించే అత్యంత పొడవైన క్షీరదం (జంతువు) ఏది?
What is the tallest living land mammal?
- జిరాఫీ (Giraffe).
నిలబడి వున్నప్పుడు, పూర్తిగా పెరిగిన జిరాఫీ యొక్క ఎత్తు 16-20 అడుగులు అంటే సుమారు 4.8 నుండి 6 మీటర్ల వరకూ ఉంటుంది.
జిరాఫీల యొక్క ముఖ్యమైన లక్షణం వాటి పొడవాటి మెడ. అది సుమారు 6 అడుగుల (1.8 మీటర్లు) వుంటుంది. వాటి పొడవాటి కాళ్ళు సాధారణంగా సగటు మానవుల ఎత్తు కంటే పొడవుగా ఉంటాయి.
వాటి బరువు 1590 కిలోల (3,500 పౌండ్లు) వరకు ఉంటుంది.
జిరాఫీ తర్వాత ఇతర ఎత్తైన భూ జంతువులు ఏవిటంటే – ఆఫ్రికన్ ఏనుగులు, ఉష్ట్రపక్షి (ostrich), గోధుమ ఎలుగుబంట్లు (brown bears), అలాస్కాన్ దుప్పి (Alaskan moose), అరేబియా ఒంటెలు (Arabian camels), షైర్ గుర్రాలు (Shire horses) మరియు అమెరికా ఎనుబోతు (American bison) వంటివి.
9. ‘స్టార్ వార్స్’ మరియు ‘ఇండియానా జోన్స్’ ఫిల్మ్ సిరీస్‌లను ఎవరు నిర్మించారు?
Who produced the ‘Star Wars’ and ‘Indiana Jones’ film series?
- జార్జ్ లూకాస్ (జార్జ్ వాల్టన్ లూకాస్).
- George Lucas (George Walton Lucas).
లూకాస్ నాలుగు అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యాడు. బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా ఈ సినిమాల ద్వారా చరిత్ర సృష్టించాడు. అతను చరిత్రలో అత్యంత విజయవంతమైన నిర్మాతలలో ఒకరిగా ప్రసిద్ధి చెందాడు.
ఆయన పేరెన్నిక గన్న అమెరికన్ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్ మరియు వ్యాపారవేత్త.
అతను లూకాస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై స్టార్ వార్స్ మరియు ఇండియానా జోన్స్ నిర్మించాడు.
వాల్ట్ డిస్నీ కంపెనీ దానిని టేకోవర్ చేసే వరకూ అతను ఆ కంపెనీకి కి ఛైర్మన్‌గా ఉన్నాడు.
10. ఇంద్రధనస్సు యొక్క మూడవ రంగు ఏది?
What is the third colour of the rainbow?
- పసుపు రంగు (Yellow కలర్).
ఎరుపు (Red), నారింజ (Orange), పసుపు (Yellow), ఆకుపచ్చ (Green), నీలం (Blue), నీలిమందు (Indigo) మరియు వైలెట్ (Violet) అనే ఏడు రంగులు ఇంద్రధనస్సులో ప్రాథమికంగా కనిపిస్తాయి.
అందువల్ల ఆయా రంగులను గుర్తుంచుకోవడానికి వీలుగా ఆ రంగుల యొక్క మొదటి ఆంగ్ల అక్షరాలను రివర్స్ లో VIBGYOR (విబ్ జియార్) అనే అక్రోనిమ్ (acronym = abbreviation of the first letters as a single word) గా సులభంగా గుర్తు పెట్టు కోవచ్చు.
రెయిన్‌బో ఆకాశంలో బహుళ వర్ణ వృత్తాకార ఆర్క్ (multi-colored circular arc) గా కనిపిస్తుంది. ఇది నీటి బిందువులలో కాంతి యొక్క ప్రతిబింబం, వక్రీభవనం (reflection) మరియు వ్యాప్తి (refraction and dispersion) వలన ఏర్పడే కాంతి యొక్క వర్ణపటం (light-spectrum).
Click Here for the English Version of GK-02
All Blogs & Vlogs from mamlabs.net