The First full-pledged University

చరిత్రలో మొట్ట మొదటి పూర్తి స్థాయి విశ్వవిద్యాలయం

దాని వ్యవస్థాపకుడు

విశ్వవిద్యాలయం అనేది ఉన్నత విద్య అందించే అన్ని సౌకర్యాలు గల ఒక పెద్ద మరియు విభిన్న శాస్త్రీయ సాంకేతిక పరిశోధనాలయం అని మనందరికీ తెలుసు.

పురాతన ఈజిప్ట్ రాజైన మొదటి టోలెమీ, “ఫస్ట్ పూర్తి స్థాయి యూనివర్శిటీ” యొక్క స్థాపకుడు అని చెప్పవచ్చు.

అది ఇప్పటి ఆధునిక విశ్వవిద్యాలయానికి వుండే పూర్తి స్థాయి సౌకర్యాలు, గ్రాంట్లను కలిగి ఒక అటనామస్ సంస్థగా అలరారింది.

మొదటి టోలెమీ అంటే ఎవరు?

అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క చిన్ననాటి స్నేహితుడు మరియు మిలిటరీ జనరల్ ఈ మొదటి టోలెమీ. అలెగ్జాండర్ మరణానంతరం, టోలెమీ ఈజిప్టు దేశపు చార్జ్ తీసుకున్నాడు.  తర్వాత ఆ దేశపు రాజయ్యాడు. ఆ విధంగా అతను ఈజిప్టులో మాసిడోనియన్ రాజవంశాన్ని స్థాపించాడు.

తన చివరి రోజుల్లో అలెగ్జాండర్ రెండు వారాలపాటు జ్వరంతో కూడిన అనారోగ్యం (మలేరియా లేదా టైఫాయిడ్) తో బాధపడి క్రీ.పూ. 323 జూన్ 10 న మరణించాడు.

ఆ తర్వాత అలగ్జాండర్ స్తాపించిన సువిశాల సామ్రాజ్యం అతని యొక్క ముగ్గురు ప్రముఖ జనరల్స్ మధ్య విభాజిత మనది. పెర్డికాస్, సెల్యూకస్ మరియు స్టోలమీ I.

సామ్రాజ్యాదిపత్యానికై ఆ ముగ్గురి మధ్య పోరాటాలు జరిగాయని చెపుతారు.

మొదట్లో టోలెమీ ఒక సత్రాప్ అంటే పురాతన పర్షియాలోని ఒక ప్రావిన్స్ యొక్క గవర్నర్.  ఆటను అంతకు ముందు పాలించిన ఫర్షియా ఫారో కుమార్తె రెండవ నెక్టానెబో ని వివాహం చేసుకున్నాడని చెప్పబడింది.

పైన చెప్పినట్లుగా, ముగ్గురు జనరల్స్ మధ్య అధికార సంక్షోభం అనేక సంవత్సరాల యుద్ధానికి దారితీసింది. చివరకు టోలెమీ ఈజిప్టుపై నియంత్రణను సాదించి క్రీ.పూ. 305 లో రాజు అయ్యాడు.

అతని రాజవంశం రోమన్లు ఈజిప్టును స్వాధీనం చేసుకునే వరకు 300 సంవత్సరాల పాటు పాలించింది.

ఈజిప్టు రాజుగా టోలెమీ చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు:

అలెగ్జాండర్ ది గ్రేట్ వలె టోలెమీ కూడా గొప్ప జ్ఞాన అభ్యాసకుడు, సాహిత్య మరియు శాస్త్రీయ రచనలపై చాలా ఆసక్తిని కలిగి వున్న వ్యక్తి.

ప్రాచీన ఈజిప్తుకి ఆయన ఎన్నో మరచి పోలేని కట్టడాలు, సంస్థలను అందించాడు.

1. ప్రాచీన ఈజిప్టు రాజధాని నగరమైన అలెగ్జాండ్రియా అభివృద్ధి:

అలెగ్జాండర్ ది గ్రేట్ స్థాపించిన ఓడరేవు నగరం అలెగ్జాండ్రియాను అలెగ్జాండర్ ప్రణాళికల ప్రకారం కొత్త రాజధానిగా అభివృద్ధి చేశాడు.  

2. ఫారోస్: ది గ్రేట్ లైట్‌హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా.

టోలెమీ ఒక గొప్ప పరిపాలకుడు. యూక్లిడ్ (జామిట్రీలో నైపుణ్యం కలిగిన ఒక గ్రీకు మేధావి) ని గురువుగా తలచి తరచూ సంప్రదించేవాడు.

అతను తన కొడుకుకు విద్యను బోధించడానికి ప్రసిద్ధ తత్వవేత్త స్ట్రాబోను నియమించాడు.

ఫారోస్ అని పిలువబడే అలెగ్జాండ్రియా యొక్క గ్రేట్ లైట్‌హౌస్‌ను నిర్మించడానికి టోలెమీ యూక్లిడ్‌ను క్రమం తప్పకుండా సందర్శించేవాడు. ఇది ప్రాచీన ప్రపంచ వింతలలో ఒకటిగా నిలచింది.

3. ది గ్రేట్ లైబ్రరీ ఆఫ్ అలెగ్జాండ్రియా:

హెలెనిస్టిక్ (గ్రీకుల సాంస్కృతిక యుగం) యొక్క సాంప్రదాయక గ్రీకు నాగరికతకి టోలెమీ బాగా ప్రభావితుడయ్యాడు.

అతనికి పుస్తకాలన్నా, జ్ఞాన సముపార్జన అన్నా చాల ఇష్టం. అతను అలెగ్జాండ్రియాలో గొప్ప గ్రంథాలయాన్ని స్థాపించాడు. తరువాత ఇది శాస్త్రీయ ప్రపంచంలో ఒక కీర్తి కిరీటంగా నిలచింది.    

4. చరిత్రలో మొట్ట మొదటి విశ్వవిద్యాలయం:

అతను అలెగ్జాండ్రియాలో మ్యూజియం అని పిలువబడే గొప్ప సందర్శన శాలను కూడా స్థాపించాడు.

దానిని చరిత్రలో మొట్ట మొదటగా ప్రారంభించిన పూర్తి స్థాయి పరిశోధనా కేంద్రం అని చెప్పవచ్చు. ఎందుకంటే అనేక శాస్త్రీయ మరియు సాహిత్య రచనలకు అది ప్రసిద్ధి చెందింది. అది పెద్ద పెద్ద భవనాల సముదాయం. ఉపన్యాస మందిరాలతో ఉద్యానవనాలతో కూడిన గొప్ప కట్టడంగా భాసిల్లింది. రాజభవనానికి సమీపంలో నిర్మించబడింది. జీతాలు, ఇతర ఖర్చులన్నీ రాజు గారే భరించేవారు.

అన్ని పరిశోధన మరియు విద్యా సౌకర్యాలను కలిగి ఉన్నందున మరియు రాజు నుండి పుష్కలంగా గ్రాంట్లు కలిగి ఉన్నందున దానిని ప్రపంచంలోని మొట్ట మొదటి పూర్తి స్థాయి విశ్వవిద్యాలయంగా చాలామంది చరిత్ర కారులు పరిగణిస్తారు.

సుప్రసిద్ధ అలెగ్జాండ్రియన్ లైబ్రరీ విశ్వవిద్యాలయంలో ఒక భాగం. క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు విశ్వవిద్యాలయం కొనసాగినట్లు తెలుస్తోంది.

Presented by:

Leave a Reply