ఫేక్ట్స్ & ఫేక్టోయిడ్స్ – 06
Simple But Significant…
1. చంద్రుడు సంవత్సరానికి ఒక అంగుళం (2.5 సెం.మీ) చొప్పున నెమ్మదిగా భూమి నుండి దూరంగా జరుగుతున్నాడు.
The Moon is moving slowly away from the Earth at the rate of an inch (2.5cm) per year.
చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి పై వున్న మహాసముద్రాలలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడేలా చేస్తుంది. కారణం ఏమిటంటే, అది భూమిపై తనకు బాగా దగ్గరగా వున్న భాగాలను మరింత బలంగా తన వైపుకి లాక్కొనే ప్రయత్నం చేస్తుంది.
భూమి చంద్రుడి కంటే చాలా వేగంగా తిరుగుతున్నందున ఈ టైడల్ (అలల) ఆకర్షణ చంద్రుడి ఆగమనానికి కొంచెం ముందుగానే సంభవిస్తుంది.
దీని ప్రతి చర్య – భూమి చుట్టూ ఉన్న ఎత్తైన కక్ష్యలోకి చంద్రుడిని నెట్టడం జరుగుతుంది. ఇంకా అనేక భౌతిక సూత్రాల కారణంగా ప్రతి సంవత్సరం చంద్రుని కక్ష్య పెద్దదవుతోంది.
మనకున్న ఏకైక సహజ ఉపగ్రహమైన చంద్రుడు ప్రతి సంవత్సరం కొంత కొంతగా మనకు దూరమవుతున్నాడన్నది నిజం. దీని ఫలితం ఏమిటనేది సైంటిస్ట్ లే చెప్పాలి.
2. తుమ్మేటప్పుడు మీ ముక్కును పట్టుకుని, మీ నోటిని గట్టిగా మూసి పట్టుకోకండి – ఎందుకంటే దాని ఫలితంగా మీ కనుగుడ్ల ఊడి పడతాయి.
Never hold your nose and cover your mouth when sneezing, as it can blow out your eyeballs.
తుమ్మేటప్పుడు ముక్కు మరియు నోరు గట్టిగా కప్పబడితే, తుమ్ము కారణంగా ఉద్భవించిన బలమైన బేక్ ఫోర్స్ (backforce) వలన అనేక తీవ్ర పరిణామాలు సంభవించె అవకాశం వుంది.
రెండు ఊపిరితిత్తుల మధ్య ఛాతీలో గాలి చిక్కుకుపోవచ్చు, దీనిని సూడో మెడియాస్టినమ్ (pseudo mediastinum) అంటారు. ఇది ఒక్కొక్క సారి చాలా ప్రమాదానికి దారి తీస్తుంది.
కర్ణ భేరి (చెవిలోని సున్నితమైన టిమ్పానిక్ పొరలు = tympanic membranes) చిల్లులు పడవచ్చు.
మెదడులోని రక్తనాళాలు బెలూన్ల వలె ఉబ్బి పగిలిపోవచ్చు (దీనిని సెరిబ్రల్ అనూరిజం అని పిలుస్తారు).
కళ్లు మరియు చెవుల్లోని రక్తనాళాలు పేలిపోవచ్చు.
కనుక తుమ్మేటపుడు లేదా దగ్గేటపుడు ఈ సూచనలు పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు:
అంటే – మెత్తని గుడ్డ లేదా టిష్యూ పేపర్‌తో మన నోరు మరియు ముక్కును తేలికగా కవర్ చేయాలి. ఉపయోగించిన తర్వాత వాటిని పారవేయాలి. అలాంటివి లేనప్పుడు మీ అర చేతులకి బదులు మోచేయితో ముక్కు లేదా నోటిని కప్పుకోండి. దీని వలన ఎటువంటి బాక్టీరియా మీ నుండి గాలి లోకి స్ప్రెడ్ అవదు.
3. ప్రపంచంలోనే అతి పెద్ద సైకిళ్ల తయారీ సంస్థ – హీరో సైకిల్స్ లిమిటెడ్.
The largest bicycles manufacturer in the world – The Hero Cycles Ltd.
ఇది పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో ఉన్న భారతీయ కంపెనీ.
రోజుకు 25 సైకిళ్ల సామర్థ్యంతో ఈ కంపెనీని మొదట్లో ప్రారంభించారు. నేడు ఇది రెండు యూనిట్లలో రోజుకు 19,500 సైకిళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
- నేడు డిస్క్ బ్రేక్‌తో హీరో సైకిల్స్ నుండి తయారవుతున్న టాప్ మోడల్స్:
హీరో RX2 స్ప్రింట్:
21- షిమానో గేర్ సైకిల్, డబుల్ సస్పెన్షన్‌తో (ముందు మరియు వెనుక) తయారవడం వల్ల రైడింగ్ చాలా సౌకర్యంగా ఉంటుంది.
హీరో ఆక్టేన్ ఎండీవర్ (స్ప్రింట్ ప్రో):
21 షిమానో గేర్, ఫ్రంట్ సస్పెన్షన్, తక్కువ మెయింటెనెన్స్ మరియు రైడ్ చేయడానికి చాలా సౌకర్యంగా నిర్మించబడింది.
హీరో ఆక్టేన్ DTB ప్లస్:
21-షిమనో గేర్లు, డ్యూయల్ సస్పెన్షన్, రిమ్ బ్రేక్‌లు, రైడ్ చేయడం సులభం.
హీరో ఆక్టేన్ డ్యూడ్:
స్టీల్ ఫ్రేమ్, ఫ్రంట్-వీల్ సస్పెన్షన్, 21 – స్పీడ్ షిమనో గేర్, సులభమైన నిర్వహణ కోసం ఫ్రంట్ టైర్ ను ఈజీగా మార్చే పద్దతి.
హీరో స్ప్రింట్ నెక్స్ట్:
18-స్పీడ్ షిమనో గేర్లు, దృఢమైన స్టీల్ ఫ్రేమ్, మడ్-గార్డ్, సైడ్ స్టాండ్, ఫ్రంట్ మరియు బ్యాక్ రిఫ్లెక్టర్లు వంటి అనేక అదనపు ఉపకరణాలు, సౌకర్యవంతమైన రైడ్ కోసం డ్యూయల్ సస్పెన్షన్.
4. కప్పలలో కనిపించే ప్రత్యేకమైన లైంగిక పునరుత్పత్తి వ్యవస్థ.
Unique sexual reproduction system found in frogs.
మనిషితో సహా చాలా జంతువులలో ఆడ మగ సంభోగ కలయిక ద్వారా పునరుత్పత్తి (sexual reproduction) జరుగుతుంది.
కానీ, చాలా కప్పలు బాహ్య ఫలదీకరణాన్ని ఇష్టపడతాయి.
మొదటగా ఆడ కప్ప గుడ్లు పెడుతుంది. ఆ తర్వాత మగ కప్ప దానిని ఫలదీకరణం చేస్తుంది.
దాదాపు అన్ని కప్పలలోని గుడ్డు ఫలదీకరణం ఆడ కప్ప అండాశయంలో కాకుండా బయట జరుగుతుంది. ఆడ కప్ప తన గుడ్లను విడుదల చేస్తుంది ఆ సమయంలో మగ కప్ప తన స్పెర్మ్‌ను విడుదల చేస్తుంది.
ఉదాహరణకు, ఆడ కప్ప తన గుడ్లను నది లేదా జల ప్రవాహానికి సమీపంలో పెడుతుంది. అప్పుడు ఫలదీకరణం కోసం ఏదైనా అనుకూలమైన మగ కప్ప అక్కడికి వచ్చి ఆ గుడ్లపై తన స్పేర్మ్ విడుదల చేస్తుంది.
పునరుత్పత్తి వ్యవస్థలో భాగంగా మానవులు మరియు కప్పల మధ్య ఈ విధమైన చిత్రమైన భిన్నత్వం వున్నది.
5. జిమ్నాస్టిక్స్ అనే పదం గ్రీకు పదాలు ‘జిమ్నోస్’ లేదా ‘జిమ్నాసియం’ లేదా ‘జిమ్నాజీన్’ నుండి వచ్చింది, దీని అర్థం “నగ్నంగా వ్యాయామం చేయడం”. ప్రాచీన గ్రీస్‌లో మగ అథ్లెట్లు జిమ్నాసియంలో బట్టలు లేకుండా వ్యాయామం చేసేవారు.
The term gymnastics comes from the Greek words ‘Gymnos’ or ‘Gymnasium’ or ‘Gymnazein’ meaning “to exercise naked.” In ancient Greece male athletes exercised unclothed in a gymnasium.
జిమ్నాస్టిక్స్ దాదాపు 2500 సంవత్సరాల క్రితం ప్రాచీన గ్రీకు దేశంలో ప్రారంభమైందని చెబుతారు. దీని ప్రధాన లక్ష్యం – క్రీడా కార్యకలాపాలు లేదా యుద్ధానికి తగినట్లుగా శిక్షణ పొందడం.
విద్యార్థులందరూ ప్రాచీన గ్రీకులో జిమ్నాస్టిక్స్ సాధన చేయాల్సి వచ్చేది.
పురాతన గ్రీకులో, నగ్న విన్యాసాలు నేల వ్యాయామాలు, బరువులు ఎత్తడం మరియు రేసింగ్ చేయడం వంటివి చేసేవారు. వారు అప్పటి గ్రీకు మతాచార పద్దతిలో సాంప్రదాయక వ్యాయామ అభ్యాసాలను చేసేవారు.
రోప్ క్లైంబింగ్, రింగ్స్, టంబ్లింగ్, పామ్మెల్ హార్స్, రేసింగ్ మొదలైన టోర్నమెంట్లు గ్రీకు నగరమైన ఏథెన్స్లో జరిగేవి. ఈ ప్రదర్సనలన్నీ మొదటి గ్రీక్ ఒలింపిక్స్‌లో ప్రదర్శించబడి తదనంతరం ఆచారంగా కొనసాగాయి.
All Blogs & Vlogs from mamlabs.net