Facts & Factoids-04/Tel

ఫేక్ట్స్ & ఫేక్టోయిడ్స్ / పార్ట్ – 04

1. అంతరిక్షంలో వున్నపుడు వ్యోమగాములకు త్రేన్పులు రావు – ఎందుకో తెలుసా?

Astronauts cannot burp/belch in space – Do you know why?

త్రేన్పులు రావట మనేది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తితో ముడిపడి వున్న అంశం.

అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు, కాబట్టి త్రేన్పులు రావు.

ఇది అర్థం కావాలంటే, ఆహారం తీసుకున్న తర్వాత మన కడుపులో జరిగే జీర్ణ ప్రక్రియ గురించి తెలుసుకోవలసి వుంది.

మన జీర్ణవ్యవస్థలో ఆహారం, ద్రవాలు అలాగే ఘనపదార్థాలు భూమి యొక్క గురుత్వాకర్షణ వల్ల కిందికి దిగుతాయి.

దీనివల్ల పొట్టలోని వాయువులు పైకి వస్తాయి. ఆ గెస్ ప్రేస్సర్ ఎక్కువయి నప్పుడు అది మన నోటి ద్వారా త్రేన్పు శబ్దంతో బయటకు వస్తుంది.

అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేనందు వల్ల అక్కడ ఇది సాధ్యం కాదు. అంతరిక్షంలో వున్నపుడు కడుపులోని గాలి, ఆహారం మరియు ద్రవాలు అన్నీ కలగలసి బుడగలాంటి ముద్దలుగా తేలుతూ ఉంటాయి.

2. జూపిటర్ (బృహస్పతి) సైజులో సౌర మండలం లోని మిగిలిన ఇతర గ్రహాల కంటే రెండు రెట్లు ఎక్కువ వుంటుంది.

Jupiter is twice the size of all the other planets put together in our solar system.

నిజానికి, బృహస్పతి ద్రవ్యరాశి అన్ని ఇతర గ్రహాల ద్రవ్యరాశి కంటే రెండున్నర రెట్లు ఎక్కువ.

దీనికి కారణం – బిలియన్ల సంవత్సరాల క్రితం సూర్యుడు ఏర్పడిన తర్వాత సౌర మండలంలో మిగిలి వున్న ద్రవ్యరాశిలో ఎక్కువ భాగం బృహస్పతి గ్రహించటం అయి వుండవచ్చని ఒక అంచనా.

ఈ కారణంగానే బృహస్పతిపై వజ్రాల వర్షం కురవటం జరుగుతోందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఆశ్చర్యకర మైన విషయ మేంటంటే, జూపిటర్ గ్రహం పై సంవత్సరానికి ఈ విధంగా 1000 టన్నుల వజ్రాలు తయారవుతున్నాయని  ఫలితాలు చూపిస్తున్నాయి.

నక్షత్రాలలో ఉండే హైడ్రోజన్ మరియు హీలియంతో జూపిటర్ నిండి వుంది కాబట్టి దీనిని విఫల నక్షత్రం (failed star) అంటారు.

3. కడుపులో వున్నపుడు లేదా పుట్టిన నవ జాత శిశువులలో పోషకాహార లోపం వల్ల మెదడు యొక్క పరిమాణం (సైజు) సాధారణ పిల్లల కంటే 60 శాతం చిన్నదిగా ఉండే అవకాశం వుంది.

The brain of a child malnourished in the womb and in infancy may be 60 percent smaller than that of a normal child.

మెదడు మరియు కేంద్ర నాడీ వ్యవస్థ అభివృద్ధిలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది.

పిండం మరియు నవజాత శిశువు (కొత్తగా జన్మించిన శిశువు) ఈ రెండింటిపై ఇది ప్రభావం చూపుతుంది.

వాస్తవం ఏమిటంటే ప్రినేటల్ (పుట్టుకకు ముందు) అంటే పిండ రూపంలో వున్న శిశువులపై  అనేకమైన పోషకాహార లోప ప్రభావాలు శాశ్వతంగా పడవచ్చు.

అభివృద్ధి చెందుతున్న పిండం యొక్క శరీర భాగ నిష్పత్తులు పెరుగుతున్న కొద్దీ నాటకీయంగా మారుతుంటాయి. పిండం ఎదుగుదలలో తొమ్మిదవ వారంలో తల యొక్క పరిమాణం దాని శరీరం యొక్క మొత్తం పొడవులో దాదాపు సగం వుంటుంది.

అదే పెరిగిన వ్యక్తిలో తల పొడవు మొత్తం పొడవులో ఎనిమిదో వంతుగా వుంటుంది.

4. వడగళ్ళ వాన వల్ల మనుషులు చనిపోతారా – నిజమా?

Can hailstones kill people?

ఎస్, వడగళ్ళ యొక్క పరిమాణం మరియు బరువు ఎక్కువగా ఉంటే, అవి ప్రాణాంతకంగా మారతాయి. ఆస్తి, పంట మొదలైన వాటి నష్టాలతో పాటు ప్రాణ నష్టాన్ని కూడా కలిగిస్తాయి.

1986 వ సంవత్సరం ఏప్రిల్ 14 వ తారీఖున బంగ్లాదేశ్‌లోని గోపాల్‌గంజ్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 1 కిలో బరువున్న వడగళ్ల వాన వల్ల 92 మంది మరణించినట్లు రిపోర్ట్ లున్నాయి.

1888 లో భారతదేశంలోని మొరాదాబాద్‌లో క్రికెట్ బంతులంత పరిమాణంలో ఉన్న వడగళ్లతో కూడిన భయంకరమైన వడగళ్ల తుఫాను సుమారు 246 మంది ప్రాణాలను బలిగొంది. చరిత్రలో ఇదే అత్యంత దారుణమైన వడగళ్ల వానగా చెప్పవచ్చు.

దాదాపు 20 సెం.మీ (8 అంగుళాలు) సైజు వున్న అతిపెద్ద వడగళ్ల పరిమాణంతో కూడిన వడగళ్ళ వాన USA లోని సౌత్ డకోటా యొక్క వివియన్ ప్రాంతంలో 2010 వ సంవత్సరం జూలై నెల లో కురిసినట్లు నమోదు కాబడింది.

5. ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ.

The largest library in the world.

యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ – మిలియన్ల కొద్దీ పుస్తకాలు, వార్తాపత్రికలు, మాన్యుస్క్రిప్ట్‌లు, ఛాయాచిత్రాలు, రికార్డింగ్‌లు యింకా అనేక ఇతర సేకరణలు వున్న ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ.

ఈ లైబ్రరీలో 86 మిలియన్ల కంటే ఎక్కువ ఐటమ్స్ వున్నాయి.

ఇది పురాతన ఫెడరల్ కల్చర్డ్ పరిశోధనా సంస్థ మరియు అమెరికా యొక్క వాస్తవిక జాతీయ గ్రంథాలయం.

యునైటెడ్ స్టేట్స్‌లో ముద్రించిన అన్ని కాపీరైట్ పుస్తకాలు తదితరాల యొక్క రెండు కాపీలు ఈ లైబ్రరీలో భద్రపరచ బడుతుంటాయి.

లైబ్రరీకి వాషింగ్టన్ D.C.లో మూడు భవనాలు ఉన్నాయి. ఇవి కాక వర్జీనియాలోని కల్పెపర్‌లో ఒక పరిరక్షణ కేంద్రం (conservation center) ఉంది.

Presented by:

ఇంగ్లీష్ లో పోస్ట్ కోసం క్లిక్ చేయండి / Click Here For English Post

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply