Facts & Factoids/03/Telugu

ఫేక్ట్స్ & ఫేక్టోయిడ్స్ / పార్ట్-03

తెలుగులో ఫేక్ట్స్ & ఫెక్టోయిడ్స్

  1. ఒక మామూలు వ్యక్తి సగటున తన జీవితకాలంలో దాదాపు 1,15,000 మైళ్లు (అనగా సుమారు 1,85,075 కి.మీ.) నడుస్తాడు. ఇది భూమధ్యరేఖ చుట్టూ నాలుగు కంటే ఎక్కువ సార్లు నడచి రావటంతో సమానం.

(The average person will walk about 115,000 miles during a lifetime; that accounts for more than four jaunts around the equator on foot).

భూమధ్యరేఖ వద్ద మన భూమి యొక్క చుట్టుకొలత దాదాపు 24,850 మైళ్ళు (40,000 కిమీ).

20-30 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి యొక్క సగటు నడక వేగం గంటకు 3 మైళ్లు (4.4 కిమీ/గం) ఉంటుందని చెప్పవచ్చు.

అంటే మనం సెకనుకు సుమారుగా 1.4 మీటర్లు నడుస్తామన్న మాట.

2. సగటు వ్యక్తి రోజుకు 6 నుండి 8 సార్లు మూత్ర విసర్జన (urination) చేస్తాడు.

  • (The average person urinates about 6 to 8 times a day).

అయితే ఎవరైనా దీని కంటే ఎక్కువ లేదా తక్కువ మూత్ర విసర్జన చేస్తే వెంటనే కంగారు పడాల్సిన అవసరం లేదు.

నీరు లేదా ద్రవ ఆహారాన్ని (కెఫిన్ ను) కనుక ఎక్కువ తీసుకుంటుంటే రోజుకు 8 సార్లు కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయడం సర్వసాధారణం.

BP రోగులు తీసుకునే కొన్ని మందులు (diuretics = ఎక్కువ మూత్రవిసర్జనకు దోహద పడే మందులు) పైన పేర్కొన్న సాధారణం కంటే ఎక్కువ మూత్రవిసర్జనకు కారణమవుతుంటాయి. కనుక BP మందులు వేసుకునే వారు సాధారణం కంటే  ఎక్కువ మూత్ర విసర్జన చేస్తారు.

అలాగే డయాబెటిక్ పేషంట్స్ కూడా ఎక్కువ మూత్రవిసర్జన చేస్తారు.

3. శరీరంలోని మొత్తం రక్త పరిమాణంలో దాదాపు 25% రక్తం ప్రతి నిమిషానికి మూత్రపిండాల ద్వారా పంప్ చేయబడుతుంది.

  • (About 25% of the total volume of blood in the body is pumped through the kidneys every minute).

70 కిలోల బరువున్న సగటు మగ వారిలో ఇది నిమిషానికి దాదాపు 1.2 నుండి 1.3 లీటర్లుగా ఉంటుంది.

దీనర్థం మూత్రపిండాలు ప్రతిరోజూ పెద్దవారిలో సగటున 189 లీటర్ల ద్రవాన్ని ఫిల్టర్ చేస్తాయి.

మన శరీరంలో రెండు మూత్రపిండాలు వుంటాయి. ఇవి శరీరం నుండి వ్యర్థాలను మరియు అదనపు ద్రవాన్ని తొలగిస్తాయి.

ఈ కిడ్నీలు మన శరీరంలోని నీరు, లవణాలు (salts), మరియు సోడియం, కాల్షియం, భాస్వరం (phosphorus), పొటాషియం వంటి ఖనిజాల మధ్య వుండాల్సిన ఆరోగ్యకరమైన సమతుల్యతకి సహాయపడతాయి.

4. మనం రోజుకు 5,000 కంటే ఎక్కువ సార్లు  ఊపిరి పీల్చుకుంటుంటాము. మనం జీవితకాలంలో పీల్చుకునే గాలితో 10 మిలియన్ బెలూన్ల (ఒక కోటి బెలూన్ల) ను నింపడానికి తగినంత గాలిని తీసుకుంటుంటాము.

  • (We breathe over 5,000 times a day, taking in enough air throughout a lifetime to fill 10 million balloons).

అంటే సగటున ఆరోగ్యవంతమైన మనిషి నిమిషానికి 12 నుండి 16 సార్లు శ్వాస తీసుకుంటాడు.

శ్వాసకోశ రేటును మన మెదడులోని శ్వాసకోశ కేంద్రం నియంత్రిస్తుంది. ఈ శ్వాసకోశ కేంద్రం మెడుల్లా ఆబ్లాంగటాకు పాన్స్ (pons) కు మధ్య మెదడు దిగువ భాగంలో ఉంటుంది.

జ్వరం, అనారోగ్యం లేదా ఇతర వ్యాధిగ్రస్త పరిస్థితులతో మనం బాధపడుతున్నప్పుడు శ్వాసక్రియ రేటు మామూలు కంటే పెరుగుతుంది.

శిశువులలో శ్వాసకోశ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు పెద్దయ్యే కొలదీ అది సాధారణ స్థితికి వస్తుంది.

5. మన కుడి ఊపిరితిత్తు ఎడమ దాని కంటే కొంచెం పెద్దగా వుంటుంది.

  • (The right lung is slightly larger than the left).

ఎందుకంటే ఎడమ వైపు వున్న మన గుండెకు చోటు కల్పించటం కోసమై ఎడమ ఊపిరితిత్తులు కుడి వైపుతో పోలిస్తే కొంచెం చిన్నవిగా వుంటాయి.

ఊపిరితిత్తులు మరియు గుండె మన పక్కటెముకల రక్షణా కవచంలో ఉంటాయి.

సాధారణంగా పెద్దలలో ఊపిరితిత్తుల సగటు బరువు 1000 గ్రాములు (1 కిలో) ఉంటుంది.

పుట్టినప్పుడు ఊపిరితిత్తుల సగటు పరిమాణం 250 ml మరియు పెద్దవారిలో 6000 ml గా వుంటుంది.

సాధారణంగా పెద్ద వారిలో ఊపిరితిత్తుల ఎత్తు సగటున 24 నుండి 27 సెం.మీ (9.5 అంగుళాల నుండి 10.6 అంగుళాలు) వరకు ఉంటుంది.

6. మన శరీరంలో దాదాపు 630 నుండి 650 వరకూ అస్థిపంజర కండరాలు ఉంటాయి.

50 ఏళ్ల వయసు పైబడిన వారు ప్రతి పది సంవత్సరాలకు (=ఒక దశాబ్దం) 10 శాతం కండరాల ఫైబర్‌ (muscle fiber) లను కోల్పోతూ వుంటారు.

  • (The body contains roughly 630-650 skeletal muscles. After age 50, people lose about 10 percent of their muscle fibers per decade).

అస్థిపంజర కండరాలనే మనం కండరాలు అని పిలుస్తాము.

కండరాల యొక్క ఖచ్చితమైన సంఖ్యను చెప్పడం కష్టం.

అవి ఎముకలతో అనుసంధానించబడి ఉంటాయి. మన శరీర విస్తృత శ్రేణి కదలికలు మరియు విధుల (a wide range of movements and functions) ను నిర్వహించడానికి అవి మనకు సహాయపడు తుంటాయి.

ఈ కండరాలను స్వచ్ఛంద కండరాలు అంటే వాలంటరీ మసిల్స్ అంటారు. అంటే మన ఇష్టానికి అనుగుణంగా ఈ కండరాలను నియంత్రించవచ్చు.

ఈ కండరాలు మన శరీరంలో ఇరు వైపులా ఒకే విధంగా అమరి ఉంటాయి.

7. మన శరీరానికి (అస్థిపంజర వ్యవస్థ = skeletal system కి) అయ్యే గాయాల కోసం ప్రతి సంవత్సరం సుమారు 6.8 మిలియన్ల (68 లక్షల) మంది వైద్య సహాయం తీసుకుంటున్నారు.

  • (About 6.8 million people seek medical attention each year for injuries involving the skeletal system).

అస్థిపంజర వ్యవస్థకు సాధారణంగా సంభవించే గాయాలు:

కీళ్ళు తొలగుట (dislocation of joints), పగుళ్లు (fractures), గాయపడ్డ ఎముకలు (bruised bones) మొదలైనవి.

మనకు తరచుగా కాలర్ ఎముకలు (collar bones), చీలమండ (ankle), ముంజేయి (forearm), తుంటి (hip), మొదలైన ఎముకలు విరుగుతుంటాయి.

కీళ్ళు తొలగిన లేదా విరిగిన ఎముకలకు తక్షణం వైద్య సహాయం అవసరం.

8. తల్లి కడుపులో వున్న శిశువులు కూడా కలలు కంటారు. ఇది మెదడు అభివృద్ధికి దోహదం చేస్తుంది, అంటే గర్భంలోని బేబీ మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతోందనటానికి సూచన.

  • (Babies in the womb dream, which contributes to brain development).

మనం కలలు కనేటప్పుడు సంభవించే ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ ను (REM) వంటి జీవ ప్రక్రియను 1992 లో మొదటి సారిగా జపాన్ శాస్త్రవేత్తలు గర్భంలోని శిశువులలో గమనించారు.

REM స్లీప్ అనేది నిద్రలో మానవులు కలలు కనే ఒక దశ.

ఈ శాస్త్రవేత్తలు 28 మరియు 30 వారాల మధ్య గర్భస్థ శిశువులో REM కదలికలను గుర్తించారు. ప్రెగ్నెన్సీ పెరిగిన కొద్దీ REM స్లీప్ పీరియడ్ పెరిగిందని కూడా వారు గుర్తించారు.

మెమొరీ కన్సాలిడేషన్‌ (memory consolidation) కు REM స్లీప్ మంచిదని; ఇది మెదడును పునరుద్ధరించడానికి (restoration of brain కి) సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

9. మశూచిని నిరోధించడానికి టీకాలు వేయడం పురాతన చైనీస్ నాగరికత కాలం నుండి వాడుకలో ఉంది.

  • (Vaccinations against smallpox have been in use since the time of the ancient Chinese civilizations).

మశూచి అనేది జ్వరం, బలహీనత, చర్మం విస్ఫోటనం (పస్టిల్స్) వంటి లక్షణాలు గల తీవ్ర వైరల్ వ్యాధి. ఇది అంటువ్యాధి కూడా.

చైనాలో లభించిన ఆధారాల ప్రకారం, 11వ శతాబ్దంలో ఒక చైనీస్ సన్యాసి మశూచిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని పెంచడానికి వేరియోలేషన్ లాంటి పద్ధతిని ప్రవేశపెట్టాడని తెలుస్తోంది.

అతను ఈ వ్యాధిని నయం చేయడానికి తను తయారు చేసిన ఒక మందు పదార్థాన్ని ఒక గొట్టం ద్వారా రోగుల ముక్కు రంధ్రాలలోకి ఊది చికిత్స చేసేవాడు.

వేరియోలేషన్ అనే పద్దతి ఈ నాడు ఉపయోగంలో లేదు. ఈ వేరియోలేషన్ (variolation) పద్దతిలో సాధారనంగా మశూచి రోగికి అదే వ్యాధితో బాధపడుతున్న మరొక రోగి యొక్క వెసికిల్ (పొక్కు/బొబ్బ)  నుండి తీసిన రసి పదార్థాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా చికిత్స చేసేవారు.

ఈ వైరస్ ఇప్పుడు లేదనే చెప్పాలి (నిర్మూలించ బడింది).

1980 నాటికి, సహజంగా సంభవించే స్మాల్ పాక్స్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించబడింది.

10. పెద్దవాళ్ళ మెదడు యొక్క సగటు బరువు 2.8 నుండి 3.1 పౌండ్ల (1300 నుండి 1400 గ్రాములు) మధ్య ఉంటుంది.

  • (The average weight of an adult human brain is between 2.8 and 3.1 pounds (1,300 and 1,400 grams).

పెద్దవారిలో మానవ మెదడు పరిమాణం మరియు బరువు మారుతూ ఉంటుంది.

సాధారణంగా పురుషులు ఆడవారి కంటే పెద్ద మెదడును కలిగివుంటారు.

నవజాత శిశువు (new-born baby) యొక్క మెదడు బరువు దాదాపు 350 నుండి 400 గ్రాములు (పౌండ్‌లో 3/4వ వంతు) ఉంటుంది.

పెద్దవారి మెదడు యొక్క సగటు పొడవు సుమారు 15 సెం.మీ (5.9 అంగుళాలు) వరకూ వుంటుంది.

మెదడు యొక్క ఎడమ భాగం మన శరీరం యొక్క కుడి భాగాన్ని నియంత్రిస్తుంది. అదే విధంగా దాని కుడి భాగం శరీర ఎడమ భాగాన్ని నియంత్రిస్తుంది.

Click Here for other Telugu Posts

ఇతర తెలుగు పోస్టుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Presented By:

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply