Facts & Factoids/01/Telugu/

ఫేక్ట్స్ & ఫేక్టోయిడ్స్ / పార్ట్ – 01

Simple but Significant…

1. మనం తీసుకునే ఆహారం యొక్క రుచి మనకు ఎలా మనకు తెలుస్తుంది?

  • (How do we know the taste of the food we eat?)

మనం తీసుకునే ఆహరం రుచి మన నోటిలోని లాలాజలంలో కరగక ముందు మనకు తెలియదు. ఆహారం లాలాజలంతో కరిగిన తరువాత మాత్రమె మనకు రుచి తెలుస్తుంది.

ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే, మన నోటిలో మన జీవితకాలంలో దాదాపు 10,000 గ్యాలన్ల (సుమారు 37,854 లీటర్ల) లాలాజలం ఊరుతుంది.

2. అసలు మనిషి జీవిత కాలమెంత? (How long is the actual span of human life?)

వాస్తవం ఏమిటంటే, మనిషి లాంటి క్షీరదాల (పాలిచ్చి బిడ్డలను పెంచే జంతువులు) యొక్క జీవిత కాలం వాటి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.

పరిమాణం మరియు శరీర వ్యవస్థల ప్రకారం మనిషి మేక మరియు గుర్రాల మధ్య వున్న జీవి.

ఆ విధంగా చుస్తే, మనిషి వాస్తవ జీవిత కాలం 10 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే సగటు జీవిత కాలం సుమారు 20 సంవత్సరాలు మాత్రమే ఉండాలి.

కానీ నేటి మానవుని సగటు ఆయుర్దాయం నాటకీయంగా సుమారు 70 సంవత్సరాల వరకూ వుంది.

ఇది  ఎలా సాధ్యమయ్యింది?

కారణం, బహుశా, మానవులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక ఆరోగ్య సూత్రాలను, అనేక వైద్య విధానాలను అభివృద్ధి చేసుకోవటం కావచ్చునని అంటారు.

లేదా నేటి సైన్స్ ఫిక్సన్ సినిమాలలో వలె మనం ఇతర జంతువులకి భిన్నంగా స్పెషల్ గా సృస్టించ బడ్డామా?

3. మన రక్త ప్రవాహ వేగం ఎంతో తెలుసా? (Do you know the speed of our blood flow?)

గుండె నుండి రక్తం ప్రయాణించే వేగం సెకనుకు 20 సెంటీమీటర్లు అంటే సెకనుకు 8 అంగుళాలు.

గుండె నుండి రక్తం (పడుకున్నా లేదా మేల్కొని వున్నా) మొత్తం శరీరానికి  ప్రవహించి తిరిగి గుండెకు ఒక నిమిషంలో చేరుకుంటుంది.

మనం వ్యాయామం చేసేటప్పుడు మాత్రం ఈ ప్రయాణ సమయం కేవలం 10 సెకన్లు మాత్రమే వుంటుంది.

సగటున, ప్రతి ఎర్ర రక్త కణం ‘గుండె – శరీరం – ఊపిరితిత్తుల’ సర్క్యూట్‌ను గంటకు 40 నుండి 50 సార్లు పూర్తి చేస్తుంది.

4. మన శరీరంలో ఎర్ర రక్త కణాలు ఎలా భర్తీ చేయబడతాయి?

  • (How are red blood cells replaced in our body?)

ఎర్ర రక్త కణాల (RBC ల) మరణం మరియు పుట్టుక:

సాధారణంగా పెద్దవారిలో ప్రతి సెకనుకి 10 మిలియన్ ఎర్ర రక్త కణాలు చనిపోతాయి. కానీ వాటి మొత్తం సంఖ్య మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది ఎందుకంటే చనిపోయిన ఎర్ర రక్త కణాల స్థానంలో వెంటనే కొత్త ఎర్ర రక్త కణాలు పుట్టి వాటి స్థానాన్ని భర్తీ చేసేస్తాయి.

5. సగటున పెద్ద వారిలో గుండె బరువు ఎంత వుంటుంది?

  • (What is the weight of the heart in an average adult?)

సగటున పెద్దవారిలో గుండె బరువు 310 గ్రాములు (11 ఔన్సులు) వరకూ వుంటుంది.

దాని పరిమాణం (size) సుమారుగా పిడికిలికి సమానంగా ఉంటుంది.

గుండె సగటున నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది.

మనిషి సగటు జీవిత కాలంలో, సుమారు 212 మిలియన్ లీటర్ల రక్తం గుండె ద్వారా పంప్ చేయబడుతుంది.

6. మితిమీరిన వ్యాయామం లేదా జిమ్నాస్టిక్స్ చేయడం వల్ల ఎందుకు గుండెపోటు వస్తుందో తెలుసా?

  • (Do you know why excessive gymnastics or exercising causes heart attack?)

విపరీతమైన, తీవ్రమైన వ్యాయామాలు చేసే సమయంలో గుండె సాధారణ తీరు కంటే 5 నుండి 6 రెట్లు ఎక్కువగా రక్తాన్ని పంప్ చేయాల్సి ఉంటుంది.

అందువల్లనే తగిన విశ్రాంతి లేని విపరీత వ్యాయామాల వల్ల హార్ట్ బీట్ తట్టుకోలేనంతగా పెరిగి గుండె పోటుకి దారి తీస్తుంది.

7. పుట్టినప్పటి నుండి పెరిగే క్రమంలో పిల్లల హార్ట్ బీట్ ఎలా మారుతుంది?

  • (How does a child’s heart beat change from birth to growth?)

పిల్లల పెరిగే సమయంలో హృదయ స్పందన రేటు గణనీయంగా మారుతుంది.

అప్పుడే పుట్టిన శిశువులో సాధారణ హృదయ స్పందన నిమిషానికి 130 బీట్స్ (బిపిఎమ్) వుంటుంది.  పిల్లలకి 3 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఇది 100 bpm కి, 8 సంవత్సరాల వయస్సులో 90 కి మరియు 12 సంవత్సరాల వయస్సులో 85 కి పడిపోతుంది.

ఇలా వయసు పెరిగే కొద్దీ హార్ట్ బీట్ తగ్గి పెద్దయిన తరువాత నార్మల్ స్థాయికి అంటే 72 (between 60-100) బీట్స్ కి వస్తుంది.

విశ్రాంతి సమయంలో హృదయ స్పందన రేటు 100 కంటే ఎక్కువగా ఉంటే, దానిని టాకికార్డియా (tachycardia) అంటారు.  60 కంటే తక్కువ వుంటే దానిని బ్రాడీకార్డియా bradycardia) అంటారు.

(If your resting heart rate is above 100, it’s called tachycardia; and below 60, it’s called bradycardia).

8. ఎత్తైన ప్రదేశాలలో నివసించే వ్యక్తులలో ఎర్ర రక్త కణాల సంఖ్యలో మార్పు ఉంటుందా?

  • (Is there a change in red blood cell count in people living at high altitudes?)

అవును, మనం నివసించే ప్రదేశాల ఎత్తును బట్టి ఎర్ర రక్త కణాల సంఖ్యలో మార్పు వుంటుంది.

ఎత్తైన ప్రదేశాలలో నివసించే వ్యక్తులలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.

విపరీతమైన ఎత్తులో నివసించే వ్యక్తులలో క్రింద పట్టికలో చూపిన సంఖ్య కంటే సుమారు 50 శాతం ఎక్కువ ఎర్ర రక్త కణాలు అధికంగా ఉంటాయి.

The lifespan of blood cells and platelets

NameLifespan
Red blood cells120-180 days
White blood cells (Leukocytes)Variable
Platelets4–10 days

Click Here for English Post

Click Here for All Telugu Posts

Presented by:

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply