Deadly Pandemics/Telugu/

భయంకర మహామ్మారులు

Watch the Complete Video

మానవ జాతి చరిత్రలో అనేక ప్రాణాంతక వైరస్ దాడులను చూసింది.

కలరా, బుబోనిక్ ప్లేగు, మశూచి మరియు ఇన్ఫ్లుఎంజా మానవ చరిత్రలో అత్యంత క్రూరమైన మహామ్మారులు.

ఈ ఘోరమైన మహమ్మారులు అంతర్జాతీయ సరిహద్దులను దాటి వ్యాప్తి చెంది చాలా మందిని బలి తీసుకున్నాయి.

మశూచి యొక్క ఉనికి చరిత్రలో 12,000 సంవత్సరాలుగా ఉంది. ఇది ఒక్కటే 300 నుండి 500 మిలియన్ల మందిని చంపింది.

ఈ ప్రాణాంతక వైరస్‌ల పైశాచిక నృత్యానికి కాలం మాత్రమే సజీవ సాక్షి.

వాటి విస్తృతమైన వేట, మారణ హోమం యొక్క లిస్ట్ చాలా పెద్దది.

చరిత్రలో భయంకర మహమ్మారులుగా రికార్డులలో నమోదు కాబడిన వాటిని ఈ బ్లాగ్ లో క్లుప్తంగా చర్చిద్దాం.

ఈ పురాతన మహమ్మారి, దాదాపు, 5 మిలియన్ల మందిని, చంపింది.

దీనిని, ప్లేగు ఆఫ్ గాలెన్, అని కూడా, పిలుస్తారు.

దీని వ్యాప్తికి గల,  నిజమైన కారణం, తెలియదు.

కానీ, మశూచి, లేదా, మీజిల్స్ గా, భావిస్తారు.

దీని  ప్రభావిత ప్రాంతాలు.  ఆసియా మైనర్, ఈజిప్ట్, గ్రీస్, మరియు ఇటలీ.

క్రీ.శ 165 లో, మెసొపొటేమియా నుండి, తిరిగి వచ్చిన, రోమన్ సైనికుల ద్వారా  ఇది మెల్లగా అందరికీ వ్యాపించిందని చెపుతారు.

ఇది క్రీ.శ. 541 నుండి 542 ల మధ్య వ్యాపించింది. అప్పటి యూరోప్ జనాభా సగం మంది అంటే 25 మిలియన్ల మందిని ఇది పొట్టన పెట్టుకొంది.

ఇది బ్యుబోనిక్ ప్లేగ్. బ్యుబోనిక్ ప్లేగ్ అంటే శోషరస కణుపులు అంటే లింఫ్ నోడ్స్ ను ప్రభావితం చేసే వ్యాధి.

ఇది బైజాంటైన్ సామ్రాజ్యం మరియు మధ్యధరా ఓడరేవు నగరాలను ప్రభావితం చేసింది. అంతేకాకుండా కాన్ స్టాంటిన్ నోపుల్ నగరాన్ని పూర్తిగా నాశనం చేసింది.

ప్రతీ రోజూ గరిష్టంగా 5,000 మంది చనిపోయే వారని చెపుతారు.

ఇది 1346 మరియు 1353 ల మధ్య వ్యాపించింది.

ఇది కూడా బుబోనిక్ ప్లేగు.

సుమారు  75 – 200 మిలియన్ల మంది దీని బారిన పడి చనిపోయారు.

ఇది 1346 నుండి 1353 వరకు యూరప్, ఆఫ్రికా మరియు ఆసియాలను నాశనం చేసింది.

ఇది ఆసియాలో పుట్టిందని చెపుతారు.

ఇది చాలావరకు వ్యాపార  నౌకల్లో నివసించే ఎలుకలపై మూగే  ఈగల ద్వారా ఇతర ఖండాలకు పాకింది.

ఆ రోజుల్లో నౌకాశ్రయాలు ఎలుకలు మరియు ఈగలకు సంతానోత్పత్తి ప్రదేశాలు గా ఉండేవి.

తద్వారా ఈ బాక్టీరియా వృద్ధి చెందింది.

దాని నేపథ్యంలో ఈ మహమ్మారి మూడు ఖండాలను నాశనం చేసింది.

ఇది 1852 నుండి 1860 మధ్య కాలంలో వ్యాపించింది. ఈ కలరా వల్ల ఒక మిలియన్ అంటే పది లక్షల మంది వరకూ చనిపోయారు.

దీనిని చరిత్రలో సంభవించిన ఏడు కలరా మహామ్మారులలో అత్యంత ఘోరమైనదిగా పరిగణిస్తారు.

ఈ మూడవ కలరా మహమ్మారి 19 వ శతాబ్దం మధ్యలో అంటే 1852 లో మొదలయి 1860 వరకూ కొనసాగింది.

మొదటి మరియు రెండవ కలరా మహమ్మారుల మాదిరిగా మూడవ కలరా మహమ్మారి కూడా భారతదేశంలోనే ఉద్భవించింది.

ఇది గంగా నది డెల్టా నుండి ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా మరియు ఆఫ్రికా వరకూ వ్యాపించింది.

ఇది 1889 నుండి 1890 వరకూ కొనసాగింది.

ఇది బాక్టీరియాలజీ యుగంలో జనించిన ఇన్ఫ్లూఎంజా తరగతికి చెందిన మొట్టమొదటి అంటువ్యాధి.

సుమారు మిలియన్ మంది ప్రజలు దీని మూలంగా చనిపోయారు.

దీనిని మొదట్లో ఆసియా ఫ్లూ లేదా రష్యన్ ఫ్లూ అని పిలిచే వారు.

ఈ ఇన్ ఫ్లూ ఎంజా సబ్ టైప్ H2 N2 గా భావించబడింది.

కానీ ఇటీవలి రిసెర్చ్ లలో H3 N8 వైరస్ సబ్ టైప్ కారణ మని కనుగొన్నారు.

దీని యొక్క మొట్ట మొదటి కేసులను 1889 మే నెలలో మధ్య ఆసియాలోని బుఖారా (తుర్కెస్తాన్), వాయవ్య కెనడాలోని అథాబాస్కా, మరియు గ్రీన్ ల్యాండ్ లో సుదూరంగా వున్న మూడు వేర్వేరు ప్రాంతాలలో గుర్తించారు.

ఆ తర్వాత ఇది ప్రపంచానికి వ్యాపించింది.

ఇది 1910 నుండి 1911 వరకూ విస్తరించింది. ఈ ఆరవ కలరా మహమ్మారి దాని మునుపటి ఐదు కలరాల మాదిరిగా భారతదేశంలోనే పుట్టింది.

దీని బారిన పది సుమారు 8,00,000 మందికి పైగా మరణించారు.

ఇది మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్), ఉత్తర ఆఫ్రికా, తూర్పు ఐరోపా మరియు రష్యాలకు వ్యాపించింది.

1923 నాటికి కలరా కేసులు తగ్గించబడ్డాయి.

అయినప్పటికీ ఇది భారతదేశంలో యింకా వుందనే అంటారు.

1918 మరియు 1920 ల మధ్య కాలంలో ఈ ఇన్ఫ్లూ ఎంజా యొక్క ప్రాణాంతక వ్యాప్తి ప్రపంచ మంతా విజ్రుంభించింది.

ప్రపంచ జనాభాలో మూడవ వంతు మందికి ఇది సోకింది.

20 నుండి 50 మిలియన్ల ప్రజల జీవితాలను కాల రాచింది.

10% నుండి 20% వరకూ మరణాల రేటు సంభవించినట్లు అంచనా వెయ బడింది.

విచిత్రంగా ఇది బలంగాను, పూర్తీ ఆరోగ్యంగానూ వున్న యువకులకు కూడా సోకింది.

ఇది 1956 నుండి 1958 వరకూ కొనసాగింది.

ఏషియన్ ఫ్లూ అనేది H2 N2 సబ్ టైప్ కి చెందిన ఇన్ ఫ్లూఎంజా.

దీని బారిన పడి మరణించిన వారి సంఖ్య రెండు మిలియన్ల వరకూ వుంటుంది.

ఒక్క అమెరికా లోనే 69,800 మంది చనిపోయారు.

ఇది 1956 లో చైనాలోని గ్యూజో ప్రావిన్స్ లో మొదలై 1958 వరకూ కొనసాగింది.

ఇది సింగపూర్, హాంకాంగ్, మరియు యునైటెడ్ స్టేట్స్ లకు కూడా పాకింది.

దీనిని హాంకాంగ్ ఫ్లూ అని పిలుస్తారు.

ఇది H2 N2 సబ్ టైప్ వైరస్ యొక్క జన్యు శాఖ కు చెందిన H3 N2 జాతి వైరస్.

దీని కారణంగా ఒక మిలియన్ వరకూ చనిపోయారు.

ఇది మొదట 1968 జూలై 13 న హాంకాంగ్ లో గుర్తించ బడింది.

ఆ తర్వాత సింగపూర్ మరియు వియత్నాంలకు కేవలం 17 రోజుల్లో వ్యాపించింది. మూడు నెలల్లో యిది ఫిలిప్పీన్స్, ఇండియా, ఆస్ట్రేలియా, యూరప్, మరియు యునైటెడ్ స్టేట్స్ కు వ్యాపించింది.

ఇది నిజమైన ప్రపంచ మహమ్మారిగా అవతరించింది. 1981 నుండి 36 మిలియన్ల మందికి పైగా మరణించారు. దీనిని 1976 లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మొదటగా గుర్తించారు.

ప్రస్తుతం 31 నుండి 35 మిలియన్ల మంది HIV తో జీవితం గడుపుతున్నారు.

సబ్-సహారా ఆఫ్రికాలో ఎక్కువ మంది ఎయిడ్స్ పేషంట్స్ ఉన్నారు. అక్కడి జనాభాలో 5% శాతం మంది అనగా సుమారు 21 మిలియన్ల మంది ఎయిడ్స్ తో బాధ పడుతున్నారు.

ఇది 2005 నుండి 2012 వరకూ గరిష్ట స్థాయిలో వుంది. మెల్లగా మరణాలు 2.2 మిలియన్ల నుండి 1.6 మిలియన్లకు పడిపోయాయి.

HIV ప్రాణాంతక రూపం నుండి మేనేజబుల్ వ్యాధిగా మారింది. ఇది సోకిన వారిలో చాలా మంది నేడు సామాన్య జీవితాన్ని గడుపుతున్నారు.

దీనినే నావల్ కరోనా వైరస్-19 అని కూడా పిలుస్తున్నారు.

2019 డిసెంబర్ లో చైనాలోని వూహాన్ ప్రాంతంలోని ప్రజలలో ఈ వైరస్ ను మొదటగా గుర్తించారు.

అందుకే దీనికి కోవిడ్-19 అని పేరుపెట్టారు. అంటే 2019 లో పుట్టిన కరోనా అనే కొత్త వైరస్ అని అర్థం.

ఇది మొదట్లో అక్కడ అంటువ్యాధిగా కనిపించినప్పటికీ అతి కొద్ది నెలల్లోనే ప్రపంచ మంతా చాలా వేగంగా విస్తరించింది.

WHO దీనిని 2020 మార్చిలో మహమ్మారి (pandemic) గా ప్రకటించింది.

2020 డిసెంబర్ 15 నాటికి 210 దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా 72 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడి దాదాపు 1.6 మిలియన్ల మంది మరణించారు.

కొత్త వైరస్ కావటం వల్ల చాలా త్వరగా వ్యాప్తిలోకి వచ్చింది.

చేతులు శుభ్రంగా కడుక్కోవటం, సామాజిక దూరం పాటించటం ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఉత్తమ మైన పద్దతులు.

ప్రపంచ వ్యాప్తంగా యించు మించు అన్ని దేశాలు లాక్దౌన్ తదితర అనేక సురక్షిత పద్దతులు అమలు చేశాయి.

డజన్ల కొద్దీ కంపెనీలు యింకా ఎంతోమంది స్వతంత్ర పరిశోధకులు పరీక్షలు, చికిత్సలు, మరియు వ్యాక్సిన్లపై పనిచేయడం ప్రారంభించారు.

ఈ వైరస్ కారణంగా నేడు మానవ జాతి మనుగడ పట్ల, ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఆందోళన కలిగించింది.

Presented by:

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply