“వరల్డ్ వైడ్ వెబ్” (అంతర్జాల) సృష్టికర్త:
తిమోతీ బెర్నర్స్-లీ, వరల్డ్ వైడ్ వెబ్ యొక్క ఆవిష్కర్త. ఆయన 1955 వ సంవత్సరం జూన్ 8 న ఇంగ్లాండ్‌లోని లండన్‌లో జన్మించారు.
ఆయన కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు MIT (మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) లో ప్రొఫెసర్.
అతని పూర్తి పేరు సర్ తిమోతీ జాన్ బెర్నర్స్-లీ. ఆయనను TimBL మరియు TBL గా పిలిచేవారు.
ఇంటర్నెట్‌ని ఉపయోగించి తను కొత్తగా అభివృద్ధి చేసిన సమాచార నిర్వహణ వ్యవస్థ ఆధారంగా ఆయన మొదటి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ (HTTP) క్లయింట్ మరియు సర్వర్‌ని 1989 మార్చి 12 న సృష్టించాడు.
దాని సహాయంతో, ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రజలు, అనేక సంస్థల మధ్య వున్న స్వయంచాలక సమాచార-భాగస్వామ్య (automated information-sharing) డిమాండ్‌ను తీర్చడానికి 1989లో వరల్డ్ వైడ్ వెబ్ (www) ని ఆయన మొట్ట మొదటగా సృష్టించారు.
HTML (హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్), వెబ్ కోసం (మార్కప్) ఫార్మాటింగ్ లాంగ్వేజ్, మరియు URI (యూనిఫాం రిసోర్స్ ఐడెంటిఫైయర్) వంటి వెబ్ బ్రౌజర్‌లో కనిపించే మూడు ప్రాథమిక సాంకేతికత (three fundamental technologies) లను 1990 అక్టోబర్ నాటికి ఆయన సృష్టించాడు.
ఆయన తండ్రి కాన్వే బెర్నర్స్-లీ, తల్లి మేరీ లీ వుడ్స్. వారు కుడా కంప్యూటర్ శాస్త్రవేత్తలే.
టిమ్ 1990లో నాన్సీ కార్ల్‌సన్‌ను వివాహం చేసుకున్నాడు. 2011లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.
తర్వాత 2014లో ఆయన రోజ్మేరీ లీత్ ను వివాహం చేసుకున్నాడు. అతనికి ఇద్దరు (సొంత) పిల్లలు, ముగ్గురు సవతి పిల్లలు (step-children) ఉన్నారు.
గూగుల్, ఫేస్‌బుక్, ఇంటెల్ మరియు మైక్రోసాఫ్ట్‌ల భాగస్వామ్యంతో 2013లో ప్రారంభించబడిన A4AI (అలయన్స్ ఫర్ ఏఫర్డబుల్ ఇంటర్నెట్) సంకీర్ణ సంస్థకి టిమ్ నాయకత్వం వహించాడు.
ఆయన W3C (వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం) కి డైరెక్టర్. ఇది వెబ్ యొక్క నిరంతర అభివృద్ధిని పర్యవేక్షించడానికి వరల్డ్ వైడ్ వెబ్ కోసం ఏర్పడిన ప్రధాన అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ.
అతను వరల్డ్ వైడ్ వెబ్ ఫౌండేషన్ యొక్క సహ వ్యవస్థాపకుడు.
MIT కంప్యూటర్ సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేబొరేటరీ (CSAIL) విభాగాలకు అవసరమైన 3Com (కంప్యూటర్ నెట్‌వర్క్ ఉత్పత్తుల తయారీ) లో బాగా ప్రసిద్ధి చెందాడు.
ఆయన WSRI (వెబ్ సైన్స్ రీసెర్చ్ ఇనిషియేటివ్) డైరెక్టర్‌గా పని చేశారు.
ఆయన MIT సెంటర్ ఫర్ కలెక్టివ్ ఇంటెలిజెన్స్ యొక్క సలహా బోర్డు సభ్యుడు.
ఆయన 2011లో ఫోర్డ్ ఫౌండేషన్ యొక్క ట్రస్టీల బోర్డు సభ్యులలో ఒకరు.
ఆయన 2012లో లండన్‌లో ఓపెన్ డేటా ఇన్‌స్టిట్యూట్ (OPI) అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌ని స్థాపించి, ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా డేటా రంగంలో వున్న వ్యక్తులను సమన్వయ పరఛి, వారిలో స్ఫూర్తిని నింపడానికి ఉద్దేశించబడ్డ సంస్థ.
ఆయన కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో వున్న గ్లోబల్ సోషల్ మీడియా మరియు నెట్‌వర్కింగ్ సర్వీస్ అయిన MeWe కి సలహాదారుగా వున్నారు.
ఆయన అనేక అవార్డులను అందుకున్నారు: అందులో ప్రధాన మైనవి:
- 1995లో ACM (అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ) అవార్డు (ఒక ముఖ్యమైన సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసినందుకు యిచ్చే అవార్డు) పొందారు,
- 2004లో తన సృజనాత్మక పనికి బహుమతిగా ఆయన ఎలిజబెత్ II ద్వారా నైట్‌హుడ్ అందుకున్నారు,
- 2004లో మిలీనియం టెక్నాలజీ ప్రైజ్ (పురోగతి ఆవిష్కరణలకు యిచ్చే ప్రైజ్) ను అందుకున్నారు,
- 2006 లో ప్రెసిడెంట్ మెడల్ ను స్వీకరించారు,
- 2007లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ (గుర్తింపు పొందిన మరియు విశిష్ట సేవల కోసం కామన్వెల్త్ రాజ్యాలచే ఇవ్వబడే అవార్డు) ను అందుకున్నారు,
- 2009లో ఫారిన్ అసోసియేట్ ఆఫ్ నేషనల్ అకాడమీ సైన్సెస్ అవార్డ్ ను (సైంటిస్టులకు యిచ్చె అవార్డ్) స్వీకరించారు,
- 2012లో కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే వారికి గౌరవార్థం యిచ్చే ఇంటర్నెట్ హాల్ ఆఫ్ ఫేమ్ ను పొందారు,
- 2013 లో ఇంజనీరింగ్ మరియు ఇన్నోవేషన్ కోసం కేటాయించబడ్డ క్వీన్ ఎలిజబెత్ ప్రైజ్ ను పొందారు,
- 2016 లో ట్యూరింగ్ అవార్డు (కంప్యూటర్ సైన్స్‌లో అత్యుత్తమ సేవలకు అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ (ACM) ద్వారా అందించబడే అవార్డ్) ను స్వీకరించారు.
ఇంగ్లీష్ పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి / Click Here for English Post
ఇతర తెలుగు పోస్ట్ లకై ఇక్కడ క్లిక్ చేయండి / Click Here for other Telugu Posts
All Blogs & Vlogs from mamlabs.net