Aging/Accelerated Aging/T

వృద్ధాప్యం & అకాల వృద్ధాప్యం.

వృద్ధాప్యం అనేది మన జీవితంలో సంభవించే స్వ్వీయ నియంత్రణలో లేని సహజ దశ. మరో మాటలో చెప్పాలంటే వృద్ధాప్యాన్ని చర్మం (skin), రక్త నాళాలు (blood vessels) మరియు స్నాయువులు (tendons) తమ స్థితిస్థాపకత (elasticity) కోల్పోవడం అంటారు.

ఇది ఊపిరితిత్తులు (lungs), మూత్రపిండాలు (kidneys) మరియు కాలేయం (liver) వంటి అవయవాల పనితీరులో గణనీయ క్షీణతకి గురి అయ్యే దశ.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వృద్ధాప్యాన్ని ఈ విధంగా నిర్వచించింది:

ఇది జీవసంబంధమైన వాస్తవికత యొక్క దశ. ఇది గర్భస్థ దశ నుండి మొదలై మరణం సంభవించే వరకు సహజంగా కలిగే క్రమానుగత మార్పుల కూర్పు.

ఇతరులపై ఎక్కువగా ఆధారపడటం (డిపెండెన్సీ) మరియు శారీరక వైకల్యం వల్ల వృద్ధాప్యం వస్తుంది. సాధారణంగా పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు కాబట్టి దానిని వృద్ధాప్యానికి నాందిగా పరిగణించవచ్చు.

వయసు పెరిగే కొద్దీ చర్మంపై ఏ ప్రదేశంలోనైనా గోధుమ లేదా పసుపు రంగు మచ్చలు (కొద్దిగా పెరిగిన మచ్చలు) కనిపిస్తాయి. వీటిని సెబరీయిక్ కెరాటోసిస్ (seborrheic keratosis) అంటారు. వీటితో పాటు సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల వృద్ధులలో చేతుల వెనుక భాగంలో చిన్న పొలుసులు (సోలార్ కెరటోసిస్) మరియు మచ్చలు కనిపిస్తాయి. డి మోర్గాన్ మచ్చలు అని పిలువబడే ఎరుపు పిన్‌పాయింట్ మచ్చలు కూడా ట్రంక్‌ (మొండెము) పై కనిపిస్తాయి.

40 ఏళ్ల తర్వాత ఏమి జరుగుతుంది?

1. కణజాలం మరియు కాలేయం, మూత్రపిండాలు మరియు ఇతర అవయవాలు వంటి శరీర అవయవాలు 40 సంవత్సరాల వయస్సు తర్వాత కొన్ని కణాలను కోల్పోవడం ప్రారంభిస్తాయి. ఇది కండర ద్రవ్యరాశి (muscle mass decline) క్షీణతకు దారితీస్తుంది, ఇంతే కాకుండా బలహీనత, వైకల్యం మరియు అనారోగ్యాలకి కారణమవుతుంది.

2. ఎత్తు తగ్గుతుంది. 40 ఏళ్ల తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు మనం దాదాపు 1 సెం.మీ ఎత్తు కోల్పోతామని అధ్యయనం చేయబడింది. 70 ఏళ్లు దాటిన తర్వాత ఈ నష్టం మరింత వేగంగా సంభవిస్తుంది.

3. ఊబకాయాని (obesity) కి సంబంధించిన సమస్యలు 40 ఏళ్ల తర్వాత ఎక్కువగా కనిపిస్తాయి.

4. శారీరక సామర్థ్యం మరియు శ్రమలలో తగ్గుదల మొదలైనవి.

మన శరీరం త్వరగా వృద్ధాప్యానికి ఎలా గురవుతుంది?

వృద్ధాప్యం ముందుగా సంభావించడాన్ని అకాల వృద్ధాప్యం (accelerated aging) అంటారు.

దీన్ని తెలుసుకోవడానికి, అసలు అకాల వృద్ధాప్యం ((accelerated aging) అంటే ఏమిటో చూద్దాం.

అకాల వృద్ధాప్యం అనేది మన శరీరం ముందుగానే ముసలితనానికి గురవటం అని చెప్పవచ్చు.

వృద్ధాప్యం మరియు అకాల వృద్ధాప్యాల యొక్క ప్రాక్టికల్ ప్రభావాలు:

వృద్ధాప్యం దశలో మన శరీరంలోని అవయవాలు ప్రధానంగా రెండు ప్రభావాలకు లోనవుతాయి.

1. సహజ ప్రభావం.

2. వేగవంతమైన ప్రభావం.

అవయవాల వారీగా ఈ రెండు రకాల వృద్దాప్యాలు ఎలా సంభావిస్తాయో చూద్దాము:

చర్మం, కండరాలు, గుండె, రక్త ప్రసరణ, మెదడు మరియు నాడీ వ్యవస్థ, ఊపిరితిత్తులు, కీళ్ళు, కాలేయం, ఇంద్రియాలు మొదలైన అవయవాలు ఈ రెండు రకాల వృద్ధాప్యాలకు ఎలా సంభావితమవుతాయో చూద్దాం.

1. చర్మం

చర్మం యొక్క సహజ వృద్దాప్యం:

చర్మ కణజాలం తమ సాగే గుణాన్ని కోల్పోవడం వల్ల చర్మం కుంగిపోయి ముడతలు పడుతుంది. రక్త కేశనాళికలు బలహీనపడతాయి. దీని వల్ల చర్మం సులభంగా గాయాల బారిన పడుతుంది.

చర్మం యొక్క అకాల వృద్దాప్యం:

సూర్యరశ్మి, ధూమపానం మొదలైన వాటి వల్ల చర్మం త్వరగా వృద్ధాప్యానికి గురవుతుంది.

2. కండరాలు:

కండరాల యొక్క సహజ వృద్ధాప్యం:

కండరాలు తమ బలం మరియు పరిమాణాలను కోల్పోతుంది.

కండరాల యొక్క అకాల వృద్ధాప్యం:

వ్యాయామం చేయక పోవడం మరియు ఆకలి లేకపోవడం వంటివి కండరాల వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి.

3. గుండె (Heart):

గుండె యొక్క సహజ వృద్ధాప్యం:

గుండె యొక్క పంపింగ్ సామర్థ్యం క్షీణిస్తుంది. ఇది వ్యాయామ సామర్థ్యాన్ని తగ్గించటమే కాకుండా వ్యాయామం చేయలేని స్ధితికి దారి తీస్తుంది.

గుండె యొక్క అకాల వృద్ధాప్యం:

కొవ్వు పదార్ధాలు మరియు మద్యపానం మరియు అధిక ధూమపానం గుండె యొక్క వృద్ధాప్యాన్ని వేగవంతం చేసింది.

4. రక్త ప్రసరణ:

రక్త ప్రసరణ యొక్క సహజ వృద్ధాప్యం:

ధమనుల గట్టిపడటం జరుగుతుంది. ఇది అధిక రక్తపోటుకి దారితీసి రక్త ప్రసరణను బలహీనపరుస్తుంది.

రక్త ప్రసరణ యొక్క అకాల వృద్ధాప్యం:

సరైన ఆహారం స్వీకరించక పోవటం (poor diet), వ్యాయామం చేయక పోవడం మరియు ధూమపానం మొదలగునవి రక్త ప్రసరణ యొక్క వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి.

5. మెదడు మరియు నాడీ వ్యవస్థ:

మెదడు మరియు నాడీ వ్యవస్థ యొక్క సహజ వృద్ధాప్యం:

నరాలు తమ కణాలను కోల్పోవడం వల్ల జ్ఞాపకశక్తి మరియు అభ్యాస నైపుణ్యాలు తగ్గుతాయి. నరాల ప్రతిచర్య సమయం పెరిగేకొద్దీ ప్రతిస్పందనలు నెమ్మదిగా మారతాయి.

మెదడు పనితీరు కోల్పోవడం, చిత్తవైకల్యం, మరియు ఇతర న్యూరోడెజెనరేటివ్ పరిస్థితులకు ఇది దారితీస్తుంది.

వృద్ధాప్యం వల్ల వచ్చే డిమెన్షియా రెండు రకాలు.

1. అల్జీమర్స్ వ్యాధి; 2. పార్కిన్సన్స్ వ్యాధి.  

వృద్ధాప్యంలో సాధారణంగా స్ట్రోక్ సంభవించి ఆకస్మిక వినాశన కారణ మవుతుంది.

  • అల్జీమర్స్ వ్యాధి

అల్జీమర్స్ అనేది వృద్ధాప్యానికి సంబంధించిన అత్యంత సాధారణ వ్యాధి. మెదడులోని కార్టెక్స్ పొడి (dry) బారుతుంది.

 ఇది – ‘మొత్తం అసమతుల్యత, జ్ఞాపకశక్తి కోల్పోవడం, వ్యక్తిత్వంలో మార్పులు మరియు ప్రవర్తనా మాంద్యం, ఉదాసీనత, సామాజికంగా ఒంటరితనం (social withdrawal), మూడ్ స్వింగ్‌లు, ఇతరులపై అపనమ్మకం, చిరాకు మరియు దూకుడుకు’ – కారణమవుతుంది.

  • పార్కిన్సన్స్ వ్యాధి:

వణుకు మరియు బలహీనమైన కండరాలు వంటి కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క క్షీణించిన రుగ్మత.

మెదడు మరియు నాడీ వ్యవస్థ యొక్క అకాల వృద్ధాప్యం:

డ్రగ్స్ మరియు ఆల్కహాల్ యొక్క అధిక వినియోగం మెదడు మరియు నాడీ వ్యవస్థల వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది.

క్రీడలు మరియు బాక్సింగ్ వంటి ఆటల వల్ల తలకు సంభవించే గాయాల వల్ల కూడా అకాల వృద్ధాప్యానికి కారణ మవుతాయి.

6. ఊపిరితిత్తులు:

ఉపిరితిత్తుల యొక్క సహజ వృద్ధాప్యం:

వయసు పెరిగే కొద్దీ ఊపిరితిత్తులు తమ సాగే గుణాన్ని కోల్పోవడం వల్ల శ్వాస సమస్యలు మొదలవుతాయి.

ఉపిరితిత్తుల యొక్క అకాల వృద్ధాప్యం:

వాయు కాలుష్యం, ధూమపానం మరియు వ్యాయామం లేకపోవడం వల్ల ఊపిరితిత్తులు అకాల వృద్ధాప్యానికి గురవుతాయి.

7. కీళ్ళు:

కీళ్ళ యొక్క సహజ వృద్ధాప్యం:

ఇంటర్‌ వర్టీబ్రల్ డిస్క్‌ల (intervertebral discs) పై ఒత్తిడి కారణంగా ఎత్తు తగ్గడం జరుగుతుంది. హిప్ మరియు మోకాలి కీళ్ళు అరిగిపోయినందున చలన శీలత (మొబిలిటీ) కూడా తగ్గుతుంది.

కీళ్ళ యొక్క అకాల వృద్ధాప్యం:

ఊబకాయం మరియు కీళ్లకు గాయాలు (అథ్లెటిక్ గాయాలు) కీళ్ల వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి.

8. కాలేయం:

కాలేయం యొక్క సహజ వృద్ధాప్యం:

రక్తంలో విషపూరిత పదార్థాలను ప్రాసెస్ చేయడంలో కాలేయం యొక్క సామర్థ్యం పడిపోతుంది.

కాలేయం యొక్క అకాల వృద్ధాప్యం:

వైరస్ ఇన్ఫెక్షన్లు మరియు ఆల్కహాల్ వినియోగం కాలేయం యొక్క వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి.

9. ఇంద్రియాలు (Senses):

ఇంద్రియాల యొక్క సహజ వృద్ధాప్యం:

వృద్ధాప్యంలో నాడీ కణాల ఉత్పత్తి పడిపోతుంది. ఇది ప్రధానంగా చూపు, వినికిడి, రుచి, వంటి అన్ని ఇంద్రియాలలో ఏంతో కొంత చురుకుదనాన్ని, శక్తిని కోల్పోయేలా చేస్తుంది.

ఇంద్రియాల యొక్క అకాల వృద్ధాప్యం:

శబ్ద కాలుష్యం మరియు ధూమపానం ఇంద్రియాల యొక్క అకాల వృద్ధాప్యాన్ని పెంచుతాయి.

వృద్ధాప్యం మరియు వేగవంతమైన (అకాల) వృద్ధాప్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యలు:

వృద్ధులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి ఆరోగ్యం, మనస్తత్వశాస్త్రం, పోషకాహారం, మరియు సామాజిక శాస్త్రాల యొక్క వివిధ విభాగాల నుండి తగిన ఇన్‌పుట్‌లతో కూడిన బహుళ-శిక్షణా విధానం అవసరం.

జీవన శైలిలో ఆహారం, లైంగిక అలవాట్లు మరియు మద్యపానం వంటి వాటి విషయాలలో చేసుకునే మార్పులు చాలా వరకు జీవిత కాలాన్ని పెంచుతాయని పరిశోధనలు చెప్తున్నాయి.

Presented by:

Leave a Reply