Action of Bones & Joints (Tel)

యాక్షన్ ఆఫ్ బోన్స్ & జాయింట్స్

ఎముకలు మరియు కీళ్ల యొక్క యాక్షన్స్ (కదలికలు)

సంభందిత వైద్య పదజాలం / Medical Vocabulary

ఇది కీళ్లను వంచడం ద్వారా వాటి మధ్య గల కోణాన్ని తగ్గించడం.

(It involves bending or decreasing the angle at the joints).

ఉదాహరణ:

  • కాలి మడమ భాగాన్ని తొడ వైపుగా వంచినప్పుడు లేదా మోకాలు తొడ వైపుగా వంచి నపుడు ఇది జరుగుతుంది.
  • బాడీబిల్డర్ తన కండరాలను వంచినప్పుడు, అతను కీళ్ల వద్ద తన ఎముకల కోణాన్ని మారుస్తాడు.

ఇది ఫ్లెక్షన్ కు వ్యతిరేక చర్య. ఎముకలు 180-డిగ్రీల కోణానికి అనగా ఒక సరళ రేఖలా నిఠారుగా సాగే చర్య.

(It is the opposite of flexion, with bones straightened to a 180- degree angle—a straight line).

ఇది ఏదైనా శరీర భాగాన్ని దాని ఏక్సిస్ (అక్షం) ఆధారంగా చుట్టూ తిప్పడం.

(It involves turning a body part on an axis. Just as the earth turns, the entire body may turn).

భూమి తిరిగినట్లే శరీరం లేదా శరీర భాగం తన చుట్టూ తాను తిరగటం.

కానీ విషయం ఏంటంటే, ఒక శరీర భాగం (చేయి లేదా కాలు వంటివి) 360 డిగ్రీల పూర్తి వృత్తంలో తిరగట మనేది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అలా చేయడం వలన రక్త నాళాలు మరియు నరాలు వంటి కణజాలాలు చిట్లిపోతాయి.

మెడికల్ పరిభాషలో ఇది ఒక శరీర భాగం శరీర మధ్యస్త రేఖ (midline of the body) నుండి దూరంగా వెళ్ళటం/జరగటం.

(It involves drawing away from the midline of the body).

ఉదాహరణ:

భుజం కీలు (shoulder joint) వద్ద చేయి నిటారుగా పైకి ఎత్తడం లేదా బయటకి చాచటం. అలా చేసి నప్పుడు ఆ చేయి మన శరీర మిడ్ లైన్ నుండి దూరంగా కదులుతుంది.

మెడికల్ లాంగ్వేజ్ లో దీనర్థం ఒక శరీర భాగం శరీరం యొక్క మిడ్ లైన్ అంటే మొండెం వైపుగా కదలటం లేదా జరగటం. అంటే అబ్డక్షన్ కి వ్యతిరేక చర్య అని చెప్పవచ్చు.

(It involves moving toward the midline or trunk).

ఉదాహరణ:

నిటారుగా ప్రక్కకి ఎత్తిన (పైకెత్తిన) చేయిని  తిరిగి శరీరం వైపుగా కదల్చటం (తీసుకు రావటం).

ఒక అవయవాన్ని (కళ్ళు లేదా మెడను / eyes or neck) వృత్తాకారంలో కదల్చటం లేదా తిప్పటం.

(A circular movement of a limb or eye).

అరచేతి భాగాన్ని క్రిందికి (నేల వైపుకి) తిప్పడం.

(Turning the palm of the hand up).

అరచేతిని పైకి (పై వైపుకు) తిప్పడం.

(Turning the palm of the hand down towards the ground).

పాదం పైకి లేపడం లేదా ఎత్తడం.

(Lifting or elevating the foot).

పాదాన్ని క్రింది వైపుగా వంచటం.

Lowering the foot, such as when pointing one’s toes.

ఇంగ్లిష్ పోస్ట్ కోసం క్లిక్ చేయండి / Click Here English Version

Presented By:

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply