3000 Languages are going to be dead/T

2099 నాటికి దాదాపు 3000 భాషలు అంతరించి పోతాయా?

భాష అంటే ఏమిటి?

ఒక సమూహం లేదా ఒక సంస్కృతిలో జీవిస్తున్న వ్యక్తులు పరస్పరం సాంప్రదాయికంగా తమ అభిప్రాయాలు లేదా ఆలోచనలను మాటలు లేదా వ్రాతపూర్వక చిహ్నాల ద్వారా పంచుకునేటువంటి వ్యవస్థ. వారు ఒకరితో ఒకరు సంభాషించుకోవడానికి భాష ఉపయోగపడుతుంది.

భాషలు ఎలా విభిన్నంగా గుర్తించ బడుతుంటాయి?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలు వాటి రచనా శైలులను బట్టి విభిన్నంగా ఉంటాయి. ఈ భాషలన్నీ ఒక కుటుంబం యొక్క వంశ వృక్షం వలె శాఖలుగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి.

వీటిని అనేక రూపాల్లో వర్గీకరించవచ్చు. కొన్ని పాప్యులర్ వర్గీకరణలు క్రింద ఇవ్వబడ్డాయి:

1. ఫొనెటిక్ భాషలు (Phonetic Languages):

అవి ప్రత్యేకంగా ప్రసంగ శబ్దాలకు సంబంధించినవి.

ఉదాహరణ: ఇంగ్లీష్.

2. ఐడియోగ్రాఫిక్ భాషలు (Ideographic Languages):

ఈ భాషలందు పదం లేదా ధ్వనికి బదులుగా ఆలోచన లేదా వస్తువును సూచించే అక్షరం లేదా గుర్తుకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.

ఉదాహరణ: చైనీస్.  

3. డెమోటిక్ (వ్యావహారిక) భాషలు (Demotic (Colloquial) Languages):

ఇవి సాహిత్య రూపానికి విరుద్ధంగా భాషల యొక్క వ్యావహారిక లేదా సాధారణ సందర్భాలలో మాట్లాడే భాషలు.

ఉదాహరణ: ఆధునిక గ్రీకు యొక్క ప్రసిద్ధ వ్రాత (written) లేదా మాట్లాడే రూపం (spoken style).

4. హైరోగ్లిఫ్స్ (చిత్రలిపి) (Hieroglyphs):

ఇప్పుడు అది డెడ్ లాంగ్వేజ్.

ఇది పురాతన ఈజిప్షియన్లు ఉపయోగించే పవిత్రమైన రచనా విధానం.

హైరోగ్లిఫ్స్ వ్రాతపూర్వక చిహ్నాలు. అవి పిక్టోగ్రాఫ్‌లు మరియు చిత్రాలను పోలి ఉంటాయి. ఈ వ్యవస్థ ఇప్పుడు ఉనికిలో లేదు. హైరోగ్లిఫ్స్ తొలి సారిగా క్రీ.పూ. సుమారు 8000 లో ఉపయోగించబడిందని చెప్తారు.

ఇది సుమారు క్రీ.శ. 500 లో ఈజిప్టు నుండి కనుమరుగైంది. దీనిని యిక్కడ మన సంస్కృతం వలె పురాతన ఈజిప్షియన్ పూజారులు (priests) ఎక్కువగా ఉపయోగించెవారు.

వాడుక (Usage) ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషలను ఈ క్రింది విధంగా కూడా వర్గీకరించవచ్చు:

1. ఫార్మల్ లేదా స్టాండర్డ్ (Formal or Standard) లాంగ్వేజ్:

ఈ భాషలను ఎక్కువగా రచనలు మరియు అధికారిక లేదా మర్యాదపూర్వక పరిస్థితుల్లో ఉపయోగిస్తారు.

2. క్రియోల్ (Creole):

ఇది వెస్టిండీస్‌లోని బానిసలు మాట్లాడే ఆఫ్రికన్ భాషల వంటివి. ఇవి ఎదో ఒక యూరోపియన్ భాష యొక్క రూపం నుండి ఏర్పడిన మాతృభాషలు.

3. లింగ్వా ఫ్రాంకా (Lingua Franca):

ఇది వివిధ భాషలు మాట్లాడేవారి మధ్య ఉమ్మడి భాషగా వ్యవహరించబడుతుంది.

4. వ్యావహారిక లేదా డెమోటిక్ (Colloquial or Demotic):

ఇవి సాహిత్య రూపానికి విరుద్ధంగా భాషల యొక్క వ్యావహారిక లేదా మాట్లాడే మామూలు రూపం.

5. పిడ్జిన్ (Pidgin):

ఒక సాధారణ వ్యాపార వ్యవహారాలు నిర్వహించు కోవటానికై స్థానికంగా ఉపయోగంలో వున్న భాష.

6. లింగో (Lingo) / జార్గన్ (Jargon) (పరిభాష):

ఇది ఒక వృత్తి భాష. ఆ వృత్తి వారు తప్ప ఇతరులు అర్థం చేసుకోవడం కష్టం. ఇంకా చెప్పాలంటే దీనిని ఏదైనా వృత్తిలో ఉపయోగించే ప్రత్యేక పదాల భాష అనవచ్చు.

7. గ్రామ్య భాష (Slang/Informal language):

ఇది పూర్తి అనధికారిక భాష. ముఖ్యంగా మాటలలో ఉపయోగించబడుతుంది. నిర్దిష్ట సంభాషణ సందర్భాలు లేదా కొందరు వ్యక్తుల సమూహానికి మాత్రమే పరిమిత భాష. యింకా చెప్పాలంటే ఒక్కొక్కసారి అసభ్య పదాలతో నిండిన భాష అని చెప్పవచ్చు.

8. ప్రాంతీయ భాష (Vernacular):

ఇది ఒక ప్రాంతం లేదా ఒక దేశంలో సామాన్యులు ఉపయోగించే/మాట్లాడే (మాతృ) భాషా రూపం.

ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి?

దాదాపు 7,000 భాషలు ఇప్పుడు ఉనికిలో ఉన్నాయి.

మానవ చరిత్రలో భాషలు ఎప్పుడు పరిణామం చెందాయి?

భాషలు మొదటగా ఎప్పుడు పుట్టాయో చెప్పడం చాలా కష్టం. వాటి పుట్టిన సమయాన్ని సరిగ్గా అంచనా వేయడానికి ఎలాంటి జాడగానీ లేదా చారిత్రక శిలాజం గానీ అందుబాటులో లేదు.

చరిత్రకారుల అంచనా ప్రకారం దాదాపు 100,000 సంవత్సరాల క్రితం – “మానవ జాతి వికసిస్తున్న కాలంలో” – ఈ భాషా వ్యవస్థ మొదట గా ఉద్భవించిందని అంటున్నారు.

వ్రాత వ్యవస్థ (The writing system):

సుమారు 5,000 సంవత్సరాల క్రితం రచనా విధానం (written style) అభివృద్ధి చెందిందని అంటారు.

మానవ మెదడులోని మేధస్సు చాలా వేగంగా వికసించడానికి భాషలు ఎలా తోడ్పడ్డాయి?

భాష పుట్టుక దాని యొక్క ఉపయోగం వల్ల మానవ మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. భాషలు మన మెదడులో ఎక్కువ భాగాన్ని ఆక్రమించి మనల్ని మన ఆలోచనలను ఒకదానికొకటి సమర్థవంతంగా అనుసంధానించ బడేలా చేస్తాయి.

భాష మరియు సంస్కృతుల యొక్క విడదీయరాని బంధం:

మానవ సంస్కృతులు మరియు భాషల మధ్య ఆదిమ కాలం నుండి దృడమైన బంధం ఉంది. ఇలా విడదీయరాని బంధంతో ఒక ప్రాంతం లేదా దేశం యొక్క ప్రత్యేక సంస్కృతులు, ప్రత్యేక భాషలు రూపుదిద్దుకున్నాయి.

ప్రపంచంలో ఏ భాషలను ఎక్కువమంది మాట్లాడుతున్నారు?

2022 – “ఎథ్నోలాగ్” (2022 Ethnologue) (Annual Publication of World’s Languages)) (ప్రపంచ భాషల వార్షిక ప్రచురణ) ఆధారంగా ఈ దిగువ మూడు జాబితాలు ఇవ్వబడ్డాయి, ఇందులో ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే మొదటి పది భాషలు మూడు విధాలుగా వర్గీకరించి యివ్వ బడ్డాయి.

  • మొదటి జాబితాలో మొదటి భాష (Mother Tongue) గా మాట్లాడే టాప్ 10 భాషలు ఉన్నాయి.
  • రెండవ జాబితాలో రెండవ భాషగా మాట్లాడే టాప్ 10 భాషలు ఉన్నాయి.
  • మూడవ జాబితా – మొదటి మరియు రెండవ భాషలను కలిపి మాట్లాడే టాప్ 10 భాషలతో రూపొందించబడింది.

“ఫస్ట్-లాంగ్వేజ్”గా మాట్లాడే టాప్ 10 భాషలు:

1. మాండరిన్ చైనీస్: (ఇతర రకాల చైనీస్ భాషలను మినహాయించి)

ప్రపంచవ్యాప్తంగా 929 మిలియన్ల మంది మొదటి భాషగా మాండరిన్ చైనీస్ మాట్లాడతారు.

2. స్పానిష్:

ప్రపంచవ్యాప్తంగా 474.7 మిలియన్ల మంది మొదటి భాషగా స్పానిష్ మాట్లాడతారు.

3. ఇంగ్లీష్:

ప్రపంచవ్యాప్తంగా 372.9 మిలియన్ల మంది ఇంగ్లీష్ మాట్లాడతారు.

4. హిందీ: (ఉర్దూ మరియు ఇతర భాషలు మినహా)

ప్రపంచవ్యాప్తంగా 343.9 మిలియన్ల మంది హిందీ మొదటి భాషగా మాట్లాడతారు.

5. బెంగాలీ:

ప్రపంచవ్యాప్తంగా 233.7 మిలియన్ల మంది బెంగాలీ మాట్లాడతారు.

6. పోర్చుగీస్:

ప్రపంచవ్యాప్తంగా 232.4 మిలియన్ల మంది పోర్చుగీస్ మాట్లాడతారు.

7. రష్యన్:

ప్రపంచవ్యాప్తంగా 154 మిలియన్ల మంది రష్యన్ మాట్లాడతారు.

8. జపనీస్:

ప్రపంచవ్యాప్తంగా 125.3 మిలియన్ల మంది జపనీస్ మొదటి భాషగా మాట్లాడతారు.

9. యు చైనీస్ (Yue Chinese):

85.2 మిలియన్ల మంది యు చైనీస్ మాట్లాడతారు. ఇది దక్షిణ చైనాలో, ప్రధానంగా లియాంగ్‌గువాంగ్‌లో మాట్లాడతారు.

10. వియత్నామీస్:

84.6 మిలియన్ల మంది ప్రజలు మొదటి భాషగా వియత్నామీస్ మొదటి భాషగా మాట్లాడతారు.

“సెకండ్-లాంగ్వేజ్”గా మాట్లాడే టాప్ 10 భాషలు:

1. ఇంగ్లీష్:

ప్రపంచవ్యాప్తంగా 1.080 బిలియన్ల మంది ప్రజలు ఇంగ్లీషును ద్వితీయ భాషగా మాట్లాడుతున్నారు.

2. ఆధునిక ప్రామాణిక అరబిక్ (Modern Standard Arabic) (మాండలికాలు మినహా):

274 మిలియన్ల మంది ప్రజలు ఆధునిక ప్రామాణిక అరబిక్‌ను ఆధునిక ప్రామాణిక అరబిక్‌గా మాట్లాడతారు.

3. హిందీ: (ఉర్దూ మరియు ఇతర భాషలు మినహా)

ప్రపంచవ్యాప్తంగా 258.3 మిలియన్ల మంది హిందీని ద్వితీయ భాషగా మాట్లాడుతున్నారు.

4. మాండరిన్ చైనీస్: (ఇతర రకాలను మినహాయించి)

198.7 మిలియన్ల మంది ప్రజలు మాండరిన్ చైనీస్‌ని ద్వితీయ భాషగా మాట్లాడతారు.

5. ఫ్రెంచ్:

ప్రపంచవ్యాప్తంగా 194.2 మిలియన్ల మంది ప్రజలు ఫ్రెంచ్ ద్వితీయ భాషగా మాట్లాడతారు.

6. ఉర్దూ: (హిందీ మినహా)

ప్రపంచవ్యాప్తంగా 161 మిలియన్ల మంది ప్రజలు ఉర్దూను ద్వితీయ భాషగా మాట్లాడుతున్నారు.

7. ఇండోనేషియన్: (మలయ్ మినహా)

ప్రపంచవ్యాప్తంగా 155.4 మిలియన్ల మంది ప్రజలు ఇండోనేషియాను ద్వితీయ భాషగా మాట్లాడుతున్నారు.

8. నైజీరియన్ పిడ్జిన్ (Nigerian Pidgin): (ఒక కృత్రిమ వ్యాపార భాష)

ప్రపంచవ్యాప్తంగా 116 మిలియన్ల మంది ప్రజలు నైజీరియన్ పిడ్జిన్‌ని ద్వితీయ భాషగా మాట్లాడుతున్నారు.

9. రష్యన్:

104.1 మిలియన్ల మంది ప్రజలు రష్యన్ భాషను ద్వితీయ భాషగా మాట్లాడతారు.

10. స్పానిష్:

73.6 మిలియన్ల మంది ప్రజలు రెండవ భాషగా స్పానిష్ మాట్లాడతారు.

“మొదటి మరియు రెండవ భాషలు” కల గలపి మాట్లాడబడే టాప్ 10 భాషలు:

1. ఇంగ్లీష్:

ప్రపంచవ్యాప్తంగా 1.452 బిలియన్ల ప్రజలు మొదటి మరియు రెండవ భాషగా ఇంగ్లీషు మాట్లాడతారు.

2. మాండరిన్ చైనీస్ (స్టాండర్డ్ చైనీస్) (మాండలికాలు మినహా):

1.118 బిలియన్ల మంది మాండరిన్ చైనీస్ మాట్లాడతారు.

3. హిందీ: (ఉర్దూ మరియు ఇతర భాషలు మినహా)

602.2 మిలియన్ల మంది హిందీ మాట్లాడతారు.

4. స్పానిష్:

548.3 మిలియన్ల మంది స్పానిష్ మాట్లాడతారు.

5. ఫ్రెంచ్:

274.1 మిలియన్ల మంది ప్రజలు ఫ్రెంచ్ మాట్లాడతారు.

6. ఆధునిక ప్రామాణిక అరబిక్ (Modern Standard Arabic): (మాండలికాలు మినహా)

274 మిలియన్ల మంది ప్రజలు ఆధునిక ప్రామాణిక అరబిక్ మాట్లాడతారు.

7. బెంగాలీ:

272.7 మిలియన్ల మంది బెంగాలీ మాట్లాడతారు.

8. రష్యన్:

258.2 మిలియన్ల మంది రష్యన్ మాట్లాడతారు.

9. పోర్చుగీస్:

257.7 మిలియన్ల మంది పోర్చుగీస్ మాట్లాడతారు.

10. ఉర్దూ (హిందీ మినహా):

231.3 మిలియన్ల మంది ప్రజలు ఉర్దూ మాట్లాడతారు.

ప్రజల మధ్య భాషల పంపిణీ వ్యవహారంలో కనిపించే విచిత్రాలు:

2010లో అంచనా వేసిన గణాంకాల ప్రకారం, ప్రపంచంలోని 80% మంది ప్రజలు కేవలం 83 భాషలు మాత్రమే ఉపయోగిస్తున్నారు.

  • అప్పటికి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడబడుతున్న మొత్తం భాషలు దాదాపు 7,000గా అంచనా వేయబడింది.

ప్రపంచ జనాభాలో 1% కంటే తక్కువ మంది మాత్రమె మొత్తం 7000 భాషలలో 3000 కంటే ఎక్కువ భాషలు మాట్లాడుతున్నారు.

2099 నాటికి 3000 భాషలకు పైగా అంతరించిపోతాయా?

2099 చివరి నాటికి దాదాపు 3000 భాషలు చాలా వేగంగా అదృశ్య మవబోతున్నాయనేది భాషా శాస్త్రవేత్తలు చెప్తున్నమాట.

అలా అంతరించిపోతున్న భాషలలో మొదటివి:

1. ఓక్లహోమాలోని యుచి భాష:

కేవలం 5 మంది మాత్రమే తమ పూర్వీకుల మాతృభాష అయిన ఈ యుచి ఇండియన్ భాషలో మాట్లాడుతూ (మిగిలి) ఉన్నారు.

2. సైబీరియాలో టోఫా భాష:

ఇప్పుడు 25 మంది కంటే తక్కువ మంది మాత్రమె ఈ భాష మాట్లాడుతున్నారు.

3. కెనడాలోని హల్కోమెలెం:

200 మంది స్పీకర్స్ మాత్రమే ఈ భాషను ఉపయోగిస్తున్నారు.

4. అమెజాన్‌లో యురారినా:

దీనిని 3,000 కంటే తక్కువ మంది మాత్రమే మాట్లాడుతున్నారు.

భాషలు ఎందుకు అంతరించి పోతున్నాయి?

దీనికి ప్రబలమైన అనేక భిన్న కారణాలు ఉన్నాయి.

కనుమరుగవుతున్న చాలా భాషలలో ఒక సాధారణ దృగ్విషయం కనిపిస్తూన్నది.

అదేమిటంటే – వాటిని ఆయా ప్రాంతాల స్థానిక ప్రజలు ఉపయోగించడం మానేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక స్థానిక భాషలు మాతృభాషగా ఉపయోగించే వారిలో చాలా మంది ఇంగ్లిష్ వంటి ప్రపంచ ఆధిపత్య భాషల (globally dominant languages) వైపు ఆకర్షితులవుతున్నారు. అనివార్యమైన ప్రపంచీకరణ ధోరణి అనేక మాతృభాషలపై ఘోరమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నది.

ఒక భాష అంతరించిపొతే కలిగే దుష్పరిణామాలు ఏమిటి?

ఏదైనా భాష అంతరించిపొతే దానికి సంభందించిన జ్ఞానం, సంప్రదాయాలు, జీవన శైలి, సంస్కృతి, కవిత్వం, పురాణ సాహిత్యం మరియు సంస్కృతుల యొక్క అమూల్యమైన నిధి (Treasure) చేజారి పోతుంది.

  • ఇంకా చెప్పాలంటే అనేక సంవత్సరాలుగా ఆ భాష ద్వారా  ప్రాథమికంగా వృద్ది చెందిన మానవ మెదడు యొక్క పని, దీర్ఘకాలంగా సంపాదించిన జ్ఞానం – అకస్మాత్తుగా కనుమరుగవుతాయి.

Presented by:

Leave a Reply