GK-04/Tel

జనరల్ నాలెడ్జ్ – 04

General Knowledge-04

01. ఓడ తుఫాను లాంటి ప్రమాదాలలో చిక్కుకొన్నప్పుడు ఆ ఓడ యొక్క బరువు తగ్గించడానికి సముద్రంలోకి విసిరేసే వస్తువులకు గల పేరు ఏమిటి?

                What name is given to goods thrown overboard to lighten a ship in distress?

జెట్ సమ్ (Jetsam).

ప్రమాదంలో ఉన్న ఓడను తేలికపరచడానికి ఒడ్డుకు విసిరిన వస్తువులను (సరుకు/ఓడ భాగాలు/పరికరాలు) జెట్సం అంటారు.

బరువైన జెట్సామ్ వస్తువులు మునిగి నీటి అడుగుకు చేరతాయి.

సాధారణంగా ఓడల ప్రమాదాల ద్వారా సముద్రంలో విసర్జించబడే వస్తువులను నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు.

1. ఫ్లోట్సామ్ (Flotsam): ఇవి ధ్వంసమైన ఓడ నుండి వచ్చి నీటిపై తేలియాడే వస్తువులు.

2. లాగన్ (Lagan): ఇది మునిగిపోయిన కార్గో, దానిని తర్వాత తిరిగి పొందడం వాటికి అటాచ్ చేసిన నీటిపై తెలుతుండే గుర్తులాంటి వస్తువు (buoy) తో ఉద్దేశపూర్వకంగా ఓడ నుండి విసిరివేయబడుతుంది.

3. డెరలిక్ట్ (Derelict): సముద్రాలలో వదిలివేయబడిన ఓడలు.

4. జెట్ సమ్ (Jetsam): పైన వివరించబడినది.

02. విపరీతమైన చలికి గురికావడం వల్ల దెబ్బతినే శరీర కణజాలం యొక్క పేరు ఏమిటి?

          What name is given to tissue damage caused by exposure to extreme cold?

  • ఫ్రాస్ట్‌బైట్ (Frostbite).

ఇది చర్మం చల్లటి ఉష్ణోగ్రతలు లేదా చల్లటి నీటికి (ఎక్కువ కాలం) గురికాబడినప్పుడు చర్మం మరియు అంతర్లీన కణజాలం గడ్డకట్టడం వల్ల కలిగే గాయం. ఐస్ ప్యాక్‌లు లేదా అలాంటి (మెటల్ లేదా నాన్-మెటల్) వస్తువుల ప్రభావానికి నేరుగా చర్మం గురికాబడినప్పుడు కూడా ఇలా జరుగుతుంది.

సాధారణంగా ఫ్రాస్ట్‌బైట్స్ మూడు రకాలు.

1. ఫ్రాస్ట్‌నిప్ (Frostnip): ఇది చర్మం కొద్ది పాటిగా గడ్డకట్టే మొదటి దశ.

2. ఉపరితల ఫ్రాస్ట్‌బైట్ (Superficial Frostbite): ఇది రెండో దశ. చర్మం యొక్క రంగు కొద్దిగా మారుతుంది.

3. తీవ్రమైన (డీప్) ఫ్రాస్ట్‌బైట్: ఈ స్థితిలో చర్మం/కణజాలం యొక్క అన్ని పొరలు ప్రభావితమవుతాయి.

03. ఒలింపిక్ ప్రారంభ వేడుకలో ఎల్లప్పుడూ ఆయా టీంల ఊరేగింపుకు నాయకత్వం వహించే దేశం ఏది?

         Which country always leads the Olympic procession at the opening ceremony?

  • గ్రీకు దేశం (గ్రీస్/Greece).

ఒలింపిక్ క్రీడల సృష్టికర్త అయిన దేశంగా గ్రీస్ కి ఇచ్చిన గౌరవంగా, ప్రతి ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవంలో గ్రీస్ జట్టు ఎల్లప్పుడూ అన్ని జట్లకి ముందు వుండి ఊరేగింపును లీడ్ చేస్తుంది.

ఒలింపిక్ క్రీడలకు దాదాపు 3000 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. ఈ ఆటలు ఒలింపియా నగరంలో జరిగేవి కాబట్టి, ఒలింపిక్ క్రీడలు అనే పేరు వచ్చింది.

ఈ ఆటలు క్రీ.పూ. 776 లో ప్రారంభమై ప్రతి నాలుగు సంవత్సరాలకు ఆగస్టు మరియు సెప్టెంబర్‌లో నిర్వహించబడతాయి. అందుకే ఒలింపిక్ క్రీడల ఆధునిక పునరుద్ధరణను ఒలింపియాడ్ అని పిలుస్తారు.

గ్రీకు భాషలో ఒలింపియాడ్ అంటే నాలుగు సంవత్సరాల కాలవ్యవధి అని అర్థం.

04. నారింజ మనిషి లేదా తెలివైన అడవి మనిషి అని ఏ జీవిని పిలుస్తారు?

          Which creature is known as orange man, or wise man of the forest?

  • ఒరెంగుటాన్ (Orangutan).

మలయ్ భాషలో ఒరెంగుటాన్ అనే పదానికి అర్థం “(తెలివైన) అడవి మనిషి”. వాటి శరీరంలో ఎక్కువ భాగం ఎర్రటి బొచ్చుతో కప్పబడి ఉన్నందున వాటిని ఆరెంజ్ మ్యాన్ (orange man) అని కూడా పిలుస్తారు.

అవి చాలా తెలివైనవి. వాటి జన్యువులలో 96% మనతో సమానంగా పోలి ఉంటాయి. అవి అతిపెద్ద ఆర్బోరియల్ క్షీరదాలు (arboreal mammals) అంటే చెట్లలో నివసించే క్షీరదాలు. క్షీరదాలంటే మన వలె పాలిచ్చి సంతానాన్ని పెంచే జంతువులు అన్న మాట).

ఈ పెద్ద జాతి కోతులు ఇండోనేషియా మరియు మలేషియా వర్షారణ్యాలలో ఉన్నాయి. అవి గొరిల్లాలు మరియు చింపాంజీల వలె చేతి వ్రేళ్ళ పిడికిల్లపై నడిచే (knuckle-walkers) కాదు. ఇవి ప్రధానంగా పండ్లను తింటాయి. అంతేకాక ఆకులు, బెరడ్లు, కీటకాలు, తేనె మరియు పక్షి గుడ్లను కూడా తింటాయి.

05. సంవర్గమానాలను కనుగొన్న స్కాటిష్ గణిత శాస్త్రజ్ఞుడు ఎవరు?

          Which Scottish mathematician invented logarithms?

  • జాన్ నేపియర్ (John Napier).

జాన్ నేపియర్ (1550-1617) స్కాటిష్ గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త మరియు భౌతిక శాస్త్రవేత్త.

అయన 1614లో 90 పేజీల పట్టికలను (త్రికోణమితి ఫంక్షన్ల సహజ సంవర్గమానాలు) కలిగి ఉన్న లాగరిథమ్‌లను కనుగొన్నాడు.

అతను తను సృష్టించిన అనేక రచనలకు ప్రసిద్ధి చెందాడు.

1. నేపియర్స్ బోన్స్ (Napier’s bones): మాన్యువల్‌గా పనిచేసే కాలిక్యులేటర్.

2. దశాంశ సంజ్ఞామానం (Decimal notation): సంఖ్య యొక్క భిన్న భాగం నుండి పూర్ణాంకం భాగాన్ని వేరు చేసే చిహ్నం.

3. గోళాకార త్రికోణమితి (Spherical trigonometry): గోళాకార బహుభుజి (polygon) ల భుజాలు (sides), కోణాలు (angles) తో కూడిన గణిత శాస్త్ర త్రికోణమితి (Trigonometry).

06. ఒకే ఒక ముక్క/పావు (piece) లేకుండా చెస్ గేమ్ (చదరంగం) ఆడలేము – అది ఏమిటి?

          Which is the only chess piece that cannot be taken?

  • రాజు (The king).

చదరంగంలో రాజు అత్యంత ముఖ్యమైన పావు ఎందుకంటే రాజును కోల్పోవడం అంటే ఆటలో ఓడిపోవడం.

చెస్ ఆట యొక్క అంతిమ లక్ష్యం ప్రత్యర్థి రాజును పట్టుకోవడం అదే సమయంలో సొంత రాజును సురక్షిత స్థితిలో ఉంచడం.

క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ‘చదరంగం’ ఆట మొదట్లో భారతదేశంలో ‘చత్రంగ్’ లేదా ‘చతురంగ’ అని అని పిలువబడింది. ఇది నలుగురు ఆటగాళ్ళు ఆడే ప్రసిద్ధ యుద్ధ గేమ్. ఇది ఇతర దేశాలకు పాకి ఆయా ముక్కల/పావుల పేర్లు మరియు వాటి రూపురేఖలు మారాయి ప్రస్తుతం నేడు వున్న గేమ్ గా అవతరించింది.

07. అంతరిక్షంలో కనిపించే ధూళి మరియు వాయు మేఘానికి గల పేరు ఏమిటి?

          What name is given to a visible cloud of dust and gas in space?

  • నిహారిక/నెబ్యులా (Nebula).

ఇది నక్షత్రాల మధ్య గల ఖాళీలలో ఆవహించి వుంటుంది. అంతేకాక ఇది కొత్త నక్షత్రాల పుట్టుకకి నర్సరీగా పనిచేస్తుంది. ఇది ప్రాథమికంగా హైడ్రోజన్ మరియు ఇతర అయోడైజ్డ్ వాయువులను కలిగి ఉంటుంది.

పర్షియన్ ఖగోళ శాస్త్రవేత్త అయిన అబ్ద్ అల్-రహ్మాన్ అల్-సూఫీ క్రీస్తు శకం 964 లో తన ఫిక్సెడ్ స్టార్స్ (Fixed Stars) పుస్తకంలో మొదటి నిజమైన నెబ్యులా (స్టార్ క్లస్టర్ అని పిలుస్తారు) గురించి రాశాడని చెప్పబడింది.

అతను ఆండ్రోమెడ గెలాక్సీ (Andromeda Galaxy) కి సమీపంలో ఉన్న ఒక చిన్న మేఘం గురించి కూడా చెప్పాడు. ఇది పాలపుంతకు సమీపంలో వున్న పెద్ద స్పైరల్ గెలాక్సీ.

08. పెంగ్విన్‌లను తినే ఏకైక సీల్ ఏది?

          Which is the only seal that feeds on penguins?

  • లెపర్డ్ సీల్ (Leopard seal).

ఇవి అంటార్కిటిక్‌లోని రెండవ అతిపెద్ద సీల్ జాతులు.

పెంగ్విన్‌లను వేటాడేందుకు అది మంచు అంచుల వెనుక దాక్కుని ఈత కొడుతున్న పెంగ్విన్ పాదాలను పట్టుకుంటుంది. ఇది పెంగ్విన్‌ను నీటి ఉపరితలంపై పదే పదే కొట్టడం ద్వారా చంపి దానిని తింటుంది.

లెపర్డ్ సీల్స్ వేటాడే సహజ మాంసాహారులు కిల్లర్ తిమింగలాలు మాత్రమే. లెపర్డ్ సీల్స్ ఆస్ట్రేలియా తదితర ప్రాంతాలలో వచ్చే వసంత (స్ప్రింగ్) మరియు వేసవి కాలాలలో గొప్ప స్వర ధ్వనులను ఉత్పత్తి చేస్తూ నీటి అడుగున ఎక్కువ సమయం గడుపుతాయి.

09. ఆహారానికి రుచిని యిచ్చి మరియు త్వరగా పాడవ కుండా ప్రిజర్వేటివ్ (preservative) గా ఉపయోగించే ఎసిటిక్ ఆమ్లం యొక్క పలుచని ద్రావణానికి గల పేరు ఏమిటి?

          What name is given to a dilute solution of acetic acid used to flavour food and as a preservative?

  • వెనిగర్ (Vinegar).

ఇది పులుపు రుచి కలిగిన పలుచని (diluted) ఎసిటిక్ యాసిడ్. ఇది రుచి కారి (condiment) గాను, షెల్ఫ్ లైఫ్ ను పెంచడానికి ఉపయోగించబడుతుంది.

ఇది సాధారణంగా చక్కెర మరియు నీటి ద్రావణాల కిణ్వ ప్రక్రియ (fermentation) నుండి తయారవుతుంది. ఇది గృహాలలో మరియు పరిశ్రమలలో సంరక్షణకారి (preservative) గా ఉపయోగించబడుతుంది. ముందు చెప్పినట్లుగా ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా అవశేష సూక్ష్మజీవులు (residual microorganisms) ను చంపడం ద్వారా కూరగాయలు మరియు ఊరగాయలు చెడిపోకుండా కాపాడుతుంది.

ఇందులోని ఎసిటిక్ యాసిడ్ ఆహార పదార్థాల ఆమ్లతను పెంచుతుంది కాబట్టి అవి బాగా సంరక్షించబడతాయి. వెనిగర్ 5 నుండి 6 నెలల వరకు ఊరగాయ మరియు కూరగాయల షెల్ఫ్ జీవితాన్ని ఉంచుతుంది.

10. రోమ్ సామ్రాజ్య చివరి రాజు ఎవరు?

          Who was the last king of Rome?

  • టార్కిన్ ది ప్రౌడ్ (Tarquin the Proud).

అతని పూర్తి పేరు లూసియస్ టార్క్వినియస్ సూపర్‌బస్. క్రీ.పూ. 534 నుండి 509 వరకు 25 సంవత్సరాల పాటు రోమ్‌ను పాలించాడు. అతను రోమ్ ను చివరిగా పాలించిన ఎట్రూరియా అనే ప్రాచీన జాతికి చెందిన ఏడవ చివరి రాజు.

అతని నిరంకుశ పాలన రోమన్ రిపబ్లిక్ స్థాపనకు దారితీసింది. అతన్ని రాజుగా తొలగించ బడిన తర్వాత ప్రజా ప్రాతినిధ్యం ద్వారా నడిచే రిపబ్లిక్ రోమ్ అవతరించింది. అతను ఇటలీలోని మొదటి ప్రాచీన గ్రీకు కాలనీ అయిన క్యూమేలో క్రీ.పూ. 495 లో మరణించాడు.

ఎట్రూరియా జాతి/దేశానికి చెందిన రోములస్ రోమ్ యొక్క మొదటి రాజు. ఆయన దీనిని క్రీ.పూ. 753 లో స్థాపించాడు. రాజరికపు రోమ్ రాజ్యంలో రాజే రాజ్యానికి ప్రధాన న్యాయధికారి (chief magistrate).

Presented by:

All Blogs & Vlogs from mamlabs.net

Telugu Edition

Leave a Reply