Meat/T

మాంసం, చేపలు, గుడ్లు:

మాంసం:

ప్రజలు సాధారణంగా మేకలు (మేక మాంసాన్ని చెవోన్ అని పిలుస్తారు), పందులు (పంది మాంసం), పశువులు (beef), గొర్రెలు (మటన్), దూడలు (దూడ మాంసం), పక్షులు మరియు కోడి (పౌల్ట్రీ), జింక (వెనిసన్) మొదలైన జంతువుల మాంసాన్ని తింటారు.

మాంసాన్ని పచ్చిగా లేదా వండి తినవచ్చు. ప్రజలు సాధారణంగా వండిన మాంసాన్ని తినడానికి ఇష్టపడతారు. దీనిలో ప్రధానంగా నీరు, ప్రోటీన్ మరియు కొవ్వులు వుంటాయి.

మాంసంలో ముఖ్యంగా అమైనో ఆమ్లాలు, జింక్, విటమిన్ B12, సెలీనియం, ఫాస్పరస్, నియాసిన్, విటమిన్ B6, కోలిన్, రిబోఫ్లేవిన్ మరియు ఐరన్లు ఉంటాయి. వండినప్పుడు మాంసంలోని కొవ్వు జ్యుసిగా మారి ఆ ఆహారానికి కేలరీల విలువలను అందిస్తుంది. మాంసం ఉత్పత్తుల వినియోగం 1960 నుండి పెరిగింది. దీనిని ఎక్కువగా భుజిస్తే మన శరీరంలో కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ల యొక్క గణనీయమైన అసమతుల్యతకు కూడా దారితీస్తుంది.

మాంసాన్ని దాని యొక్క రుచి మరియు రంగులను కోల్పోకుండా చేయడానికి ఉప్పు, స్వీటెనర్లు, సువాసనలు, ఆమ్లీకరణాలు మొదలైన సంకలితాలతో ప్రాసెస్ చేస్టారు. ప్రాసెసింగ్ వల్ల మాంసం యొక్క రస దనం (juiciness), సున్నితత్వం (tenderness), పొందికత్వం (cohesiveness ) లు మెరుగు పడతాయి.

చేపలు:

చేపలు ప్రోటీన్లు, కొవ్వులు, కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా కలిగి వుంటాయి.

ఇవి మానవులకు ముఖ్యమైన ఆహార వనరు. ప్రపంచంలోని ప్రోటీన్‌లో ఆరవ వంతు చేపల ద్వారా లభిస్తుందని అంచనా. నేడు చేపలు ప్రధానంగా ఆక్వా పరిశ్రమతో సంబంధం కలిగి ఉన్నాయి. అంతేకాక ఆహారం, ఫీడ్, ఫార్మా మరియు సేవా పరిశ్రమల వంటి ఇతర రంగాలతో కూడా అనుసంధానించ బడ్డాయి.

  • చేపలలో వున్న కొన్ని ప్రసిద్ధ జాతులు:

హెర్రింగ్, కాడ్, ఆంకోవీ, ట్యూనా, ఫ్లౌండర్ మరియు సాల్మన్లు.

ప్రసిద్ద షెల్ ఫిష్‌లైన మొలస్క్‌లు మరియు క్రస్టేసియన్‌లను కూడా ఆహారంగా ఉపయోగిస్తారు.

చేపల ఆహారంలో ప్రోటీన్లు మరియు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. పైగా కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం మొదలైన అనేక విటమిన్లు మరియు ఖనిజాలు వుంటాయి.

చేపలు యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 చేప నూనెలు మరియు ఇతర ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి. అవసరమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను పొందడానికి వారానికి కనీసం రెండు సార్లు చేపలను తినాలని WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) సిఫార్సు చేసింది.

గుడ్లు:

గుడ్లు ఎక్కువగా వంటలలో అనేక రకాలుగా ఉపయోగించబడతాయి.

కోళ్లు, బాతులు, పెద్దబాతులు, ఉష్ట్రపక్షి మరియు ఇతర పక్షుల గుడ్లను మనం సాధారణంగా తింటాము. కోడి గుడ్లు ఇప్పుడు భారీ స్థాయిలో ఉత్పత్తి చేయబడుతున్నాయి.

గుడ్లు బహుళ ప్రోటీన్లను కలిగి ఉంటాయి.

కోడి గుడ్లు సాధారణంగా 50 గ్రాములకు 70 కిలో కేలరీలు మరియు 6 గ్రాముల ప్రోటీన్లు, అంతేకాక పచ్చసొనలో 5 గ్రాముల కొవ్వును కలిగి ఉంటాయి. ఉడికించిన గుడ్లు సాధారణంగా విటమిన్ ఎ, రిబోఫ్లావిన్, పాంతోతేనిక్ యాసిడ్, విటమిన్ బి12, కోలిన్, ఫాస్పరస్, జింక్ మరియు విటమిన్ డిలను అందిస్తాయి.

  • గుడ్డులోని తెల్లసొనలో వుండే పోషకాలు:

నీరు – 90%

ప్రోటీన్లు – 10%. అల్బుమిన్లు, గ్లోబులిన్లు మరియు ఇతర ప్రోటీన్లు కరిగిన స్థితిలో వుంటాయి. ఇందులో కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లు (కొలెస్ట్రాల్) ఉండవు.

పచ్చి గుడ్లలో ప్రోటీన్లు 51% వుంటాయి. వాటిని వండినప్పుడు అవి 91%కి వృద్ది చెందుతాయి. గుడ్డులోని తెల్లసొనను ఇన్‌ఫ్లుఎంజా వంటి వ్యాక్సిన్‌లను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

ప్రపంచ ప్రజలు ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాలు

Presented By:

Leave a Reply