దేని కోసం నీ వెదుకులాట?
పట్టపగలు ప్రకాశవంతమైన వెలుగులో, ఒక వృద్ధుడు తన చేతిలో వెలుగుతున్న లాంతరుతో బిజీగా ఉన్న మార్కెట్లో తిరుగుతున్నాడు. ఆ లాంతరు దీపపు కాంతిలో అందరి ముఖాలను పరిశీలించి చూస్తున్నాడు.
ఇది చూసిన అక్కడి వారికీ ఆసక్తి కలిగింది. అతని చేష్టలకు ఆశ్చర్యపోయి అందరి ముఖాలలో అతను ఏమి వెతుకుతున్నాడో తెలుసుకోవాలనుకున్నారు.
ఉత్సుకతతో కొందరు ఆయనను అనుసరించారు.
ఉండబట్ట లేక –
అని ఆ ముసలి వ్యక్తిని ప్రశ్నించారు.
అతను సమాధానం చెప్పలేదు. మౌనంగా తన దీపంతో ప్రజల ముఖాలను శోధించడంలో బిజీగా ఉన్నాడు.
ఇది వారిలో మరింత ఆసక్తిని పెంచింది. జనం బారులు తీరి అతన్ని అనుసరించటం ప్రారంభించారు.
అతను మార్కెట్ మొత్తం ఆ విధంగా తిరిగి మౌనంగా తను నివసించే టబ్‌కి తిరిగి వెళ్ళాడు.
కానీ అతని వెంట పడ్డ ప్రజలు అతన్ని వదల లేదు. సమాధానం కోసం అతన్ని నిలదీశారు.
చివరికి అతను నోరు తెరిచి, “నేను నిజాయితీపరుడి కోసం వెతుకుతున్నాను; కానీ ఈ నగరంలో అలాంటి ఒక్క వ్యక్తి కూడా దొరక లేదు” అని తన టబ్ లో కెళ్ళి పోయాడు.
ఆ వృద్ధుడు ఎవరో కాదు ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త మరియు సినిసిజం వ్యవస్థాపకులలో ఒకడు.
పేరు – “డయోజెనిస్”.
డయోజెనెస్ తెలివైన వ్యక్తి గానూ మరియు విపరీత పోకడలు గల వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అతను ఒక పాత టబ్‌లో నివసించడానికి ఇష్టపడతాడు (టబ్ అంటే “ఆ నాటి గ్రీకు మార్కెట్లలో పదార్ధాలు నిల్వ చేసేందుకు ఉపయోగించే పెద్ద సిరామిక్ కూజా”).
ఆయన సంపద మరియు భోగ జీవితాన్ని తృణీకరించాడు. తానే స్వయంగా పేదరికాన్ని కోరుకున్నాడు. బతుకుదెరువు కోసం యాచక వృత్తిని అవలంభించాడు.
డయోజెనెస్ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందినవాడు. ప్రస్తుతం ఆధునిక టర్కీలో భాగమైన సినోప్‌లో జన్మించాడు.
అతను ఒక మింట్ కార్మాగారంలో మింట్ మాస్టర్ గా పని చేసే వాడు. కావాలని నాణాల విలువను తగ్గించాడన్న ఆరోపణలపై సినోప్ నుండి బహిష్కరించబడ్డాడు.
అతను క్రీస్తు పూర్వం 323 లో మరణించే వరకు (89 సంవత్సరాల వయస్సులో) ఏథెన్స్లో నివసించాడు.