The Secret Gold/T

రహస్య బంగారం ఎక్కడ ఉంది?

భవిష్యత్ అవసరాల కోసం ప్రపంచ దేశాలు బంగారాన్ని భద్రపరుస్తాయి. వాణిజ్యం నిమిత్తం లేదా అత్యవసర పరిస్థితులలో దేశాలు కూడా మనలాగే బంగారాన్ని కొనుగోలు చేయటం, అమ్మటం చేస్తాయి.

ఈ క్రమంలో బంగారాన్ని ఒక దేశం నుండి మరో దేశానికి తరలించటం జరుగదు. అది కేవలం బ్యాంకు చెస్ట్ ల మధ్య బంగారాన్ని తరలించటం ద్వారా మార్పిడి చేస్తారు. ప్రపంచ దేశాలు అనేక సందర్భాలలో బిలియన్ల డాలర్ల విలువైన బంగారాన్ని రహస్యంగా కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు.

దేశాలు తమ బంగారాన్ని రహస్యంగా ఎక్కడ భద్రపరుస్తాయి?

బంగారాన్ని భద్రపరచే ఒక ముఖ్య అంతర్జాతీయ ప్రదేశం – FRBNY.

ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ (FRBNY) బ్యాంక్ ను అనేది దేశాలు తమ తమ బంగారాన్ని నిల్వ చేయడానికి అత్యధికంగా ప్రాధాన్యతనిచ్చే బ్యాంక్. దాదాపు 122 దేశాలు FRBNYలో బంగారాన్ని దాచుకోవడానికి ఖాతాలను కలిగి ఉన్నాయి. ప్రపంచంలోని నాల్గవ వంతు బంగారం ఈ బ్యాంకులో స్టోర్ చేయబడింది. ఈ బంగారాన్ని నిల్వ చేయడానికై న్యూయార్క్ వీధుల క్రింద (24 మీ = 80 అడుగులు క్రింద) ఒక (ఏక) ఖజానా ఉంది.

చాలా దేశాలు తమ వద్ద ఎంత బంగారం వుంది అని స్పష్టంగా ప్రకటించాలని కోరుకోవు. అందువల్ల నిర్దిష్ట దేశం ఆదా చేసిన బంగారాన్ని ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం.

FRBNYలో ఉన్న బంగార పరిమాణం 7250 మెట్రిక్ టన్నుల (8000 టన్నులు) కంటే ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేయబడింది.

బంగారం, ముత్యాలు, వజ్రాలు మొదలైన విలువైన లోహాల బరువును కొలవడానికి ఉపయోగించే యూనిట్ ‘ట్రాయ్ ఔన్స్’.

ఒక ట్రాయ్ ఔన్స్ 31.1 గ్రాములకు సమానం.

ప్రతి దేశంలోని బంగారాన్ని ఇటుకలు మరియు కడ్డీల రూపంలో ప్రత్యేక ఖజానాలలో నిల్వ చేస్తారు.

బంగారాన్ని బ్యాంకు వాల్ట్‌లలో ఎక్కువగా బార్‌ (కడ్డీ) ల రూపంలో (ఇటుకలు వంటివి) నిల్వ చేస్తారు. ప్రతి ఇటుక దాదాపు 400 ట్రాయ్ ఔన్సులు (12.4 కేజీలు లేదా 27 పౌండ్లు) బరువు ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం యొక్క ఒక ఇటుక ప్రస్తుత ధర $885,550 (ఫిబ్రవరి, 2024 నాటికి).

ఇటుకలతో పాటు చిన్న చిన్న బార్లు (‘హెర్షే బార్స్ అని మారుపేరు) కూడా వాల్ట్ లలో భద్రపరుస్తారు.  

ఈ చిన్న హెర్షే బార్‌లు USA లోని చాకొలేట్ తయారీ కంపెనీ అయిన హెర్షే వారిచే తయారు చేయబడిన చాక్లెట్ బార్‌ల రూపంలో వుండటం వల్ల అలా పిలుస్తారు. 

చూడటానికి ఈ బంగారు కడ్డీల కుప్పలు ఇటుక గోడలలా కనిపిస్తాయి.

కారణం FRBNYలో బంగారం యొక్క ఇంటర్-ట్రేడింగ్ చాలా సురక్షితమైనది మరియు సులభతరం. ఈ విలువైన్ లోహాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక చోటు నుండి మరొక ప్రదేశానికి రవాణా చేయాల్సిన రిస్క్ లేదు. బంగారు ఇటుకలు మాత్రమే సంబంధిత దేశాలకు చెందిన వాల్ట్ ల మార్చబడతాయి. బంగారం ట్రేడింగ్ చేయడానికి అంగీకరించిన దేశాల మధ్య ఈ షిఫ్తింగ్ ప్రక్రియ చాలా సులభంగా జరుగుతుంది. అవి తమ మధ్య కుదిరిన ఒప్పందం గురించి బ్యాంకుకు తెలియజేస్తాయి. దాని ననుసరించి విక్రేత-దేశం యొక్క ఖజానా నుండి సరైన సంఖ్యలో ఇటుకలు కొనుగోలుదారు-దేశం యొక్క ఖజానాకు మార్చబడతాయి.

ఖజానాల యొక్క యాజమాన్య దేశాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. ప్రతి దేశం యొక్క ఖజానాకు రహస్య కోడ్ నంబర్ ఇవ్వబడుతుంది కాబట్టి ఇతరులు యాజమాన్య దేశాన్ని గుర్తించలేరు. బంగారు ఇటుకలు వాల్ట్ యొక్క కంపార్ట్‌మెంట్లలో కుప్పలుగా వుంటాయి. బ్యాంకులోని అతిపెద్ద సింగిల్ కంపార్ట్‌మెంట్‌లో సుమారు 107,000 బంగారు యిటుకలు ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా బంగారం తరలింపు గురించి ఎవరూ ఆందోళన చెందనవసరం లేని విధంగా ఈ లావాదేవీలు నిర్వహించబడతాయి.

అన్ని లావాదేవీలలో, FRBNY బంగారు ఖజానా ఈ ఇటుకలను షిఫ్ట్ చేయడంలో బ్యాంక్ వారు తాము ఏర్పాటు చేసుకున్న అన్ని పటిష్ట సెక్యూరిటీ చర్యలు, ముందుజాగ్రత్త చర్యలను పకడ్బందీగా ఫాలో అవుతారు.

1. ప్రతి బార్ రికార్డు ప్రకారం తూకం వేయబడుతుంది.

2. ప్రతి బార్‌ను FRBNY అధికారులు పరీక్షించి బంగారం యొక్క నాణ్యతను రికార్డుల ప్రకారం తనిఖీ చేస్తారు.

ఈ బేంక్ యొక్క భద్రతా వ్యవస్థ లోపరహితంగా పకడ్బందీగా ఏర్పాటు చేయబడింది.

ఖజానాకు ప్రవేశ మార్గం పెద్ద ఉక్కు సిలిండర్‌లో ఇరుకైన మార్గంలో వుంటుంది. సిలిండర్ 100-టన్నుల (90-మెట్రిక్ టన్నుల) ఉక్కుతో తయారు చేయబడింది. స్టీల్ సిలిండర్ యొక్క ప్రవేశ ద్వార రూపకల్పనలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సిలిండర్ తిరిగటం వల్ల మార్గాన్ని తెరవటం లేదా మూసివేయటం ద్వారా ఈ ఖజానా పటిష్ట భద్రత కలిగివుంది.

సిలిండర్ యొక్క ప్రవేశ ద్వారం ఎనిమిది బోల్ట్‌ల లాక్ యొక్క వివిధ కాంబినేషన్స్ ద్వారా సురక్షితం చేయబడింది. ఏ ఒక్క వ్యక్తికి అన్ని కాంబినేషన్స్ తెలియవు. కాబట్టి ఖజానాలోకి ప్రవేశించడానికి, తలుపు తెరవడానికి మొత్తం ఎనిమిది మంది వ్యక్తులు అవసరం అవుతుంది.

బ్యాంకు నోట్లు ఆయా దేశాల బంగారు నిల్వల యొక్క రశీదులు మాత్రమే. చలామణిలో వున్న నోట్ల విలువ రిజర్వ్‌లో ఉన్న బంగారం విలువకి సరిపోవాలి.

కానీ దేశ ఆర్థికాభివృద్ధికి డబ్బు చలామణిలో ఉండాలి కాబట్టి హెచ్చు సంఖ్యలో నోట్లను ముద్రించటం అప్పుడప్పుడు జరిగుతుంది. ఇది “ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్” వంటి ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది.

రిజర్వ్‌లో ఉన్న బంగారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆర్థిక వృద్ధి కోసం బ్యాంకులు ఎక్కువ బ్యాంకు నోట్లను ముద్రిస్తే, బంగారం నిల్వలు చెలామణిలో ఉన్న నోట్ల విలువలో కొంత భాగం అవుతాయి. యుద్ధాల వంటి సమస్యాత్మక సమయాల్లో, ప్రతి ఒక్కరికీ చెల్లించడానికి బ్యాంకుల వద్ద తగినంత డబ్బు ఉండకపోవచ్చు. దీనినే “ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్” అంటారు. ఇది ఒక రకమైన ఆర్ధిక మాంద్యానికి దారి తీస్తుంది.

ఈ రకమైన ఆర్థిక-పతనాన్ని అరికట్టడానికి, ప్రభుత్వాలు కేంద్ర బ్యాంకులను ఏర్పాటు చేశాయి. US ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి ఆయా దేశాలచే స్థాపించబడిన అటువంటి కేంద్ర బ్యాంకులు.

దేశంలోని చాలా బంగారం నిల్వలు ఈ సెంట్రల్ బ్యాంకుల వద్ద వుంటుంది. దీని ప్రకారం వారు బ్యాంకు నోట్లను జారీ చేస్తారు.

మొదట్లో చెలామణిలో ఉన్న దేశం యొక్క డబ్బు దాని బంగారం నిల్వలపై ఆధారపడి ఉండేది. కానీ ఇప్పుడు దృశ్యం మారిపోయింది. ఇది ఇప్పుడు పూర్తిగా ప్రతి దేశం యొక్క సెంట్రల్ బ్యాంకుల ముఖ్య కార్యవర్గంపై అద్దారపడివుంది. సెంట్రల్ బ్యాంకుల అధిపతులు రహస్యంగా క్రమం తప్పకుండా సమావేశమవుతారు. వారు బ్యాంకు రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ శాతాన్ని అంచనా వేస్తారు. దేశంలో ఎంత డబ్బు చలామణిలో ఉండాలో నిర్ణయిస్తారు. ఈ విధంగా ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ తగిన సమతుల్యతతో పరిపుష్టంగా వుండడానికి సహాయ పడతారు.

Presented by

Leave a Reply