ద ఫాదర్ ఆఫ్ యానిమేషన్ & ద వరల్డ్ ఆఫ్ యానిమేషన్
ఈ నాడు యానిమేషన్ లేని సినిమాలను ఉహించు కోలేము.
నిజం చెప్పాలంటే, యానిమేషన్ లేకుండా పెళ్లి తదితర ఫంక్షన్ల వీడియోలను కూడా ఆదరించలేనంత మెస్మరిజానికి మనల్ని తీసుకెళ్లి పోయాడీ యానిమేషన్ మాంత్రికుడు.
అసలు మొదట్లో అంటే 19-20 శతబ్దాల ట్రాన్సఫర్ పీరియడ్లో ఈ యానిమేషన్ కళ పుట్టింది. దీని కోసం ఒక వ్యక్తి నిద్రాహారాలు పట్టించు కోకుండా ఎంతో కృషి చేశాడు.
వాల్ట్ డిస్నీ లాంటి యానిమేషన్ బ్రహ్మ లకు స్ఫూర్తిగా నిలిచాడు.
ఆ మహానుభావుడి గురించి తెలిపే మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ…
మీ మేమ్ ల్యాబ్స్… నమస్కృతులతో… సమర్పిస్తోంది ఈ…
“ద ఫాదర్ ఆఫ్ యానిమేషన్”
Who is “the Father of Animation?”
“ద ఫాదర్ ఆఫ్ యానిమేషన్” అని ఎవరిని పిలుస్తారు?
యానిమేషన్ రంగం మొదలయి నప్పటి నుండీ నేటికి ఈ చిత్రాల మేకింగ్ లో అనేక మార్పులు వచ్చాయి.
అసలు యానిమేషన్ సినిమాని మొదట ఎవరు తీశారు? అనే ప్రశ్నకి సమాధానంగా “జెనాస్ విన్సర్ మెకెయ్” అని చెప్పవచ్చు.
జెనాస్ విన్సర్ మెక్కే ను యానిమేషన్ ఫిల్మ్స్ యొక్క ఫాదర్ గా పరిగణిస్తారు.
జేమ్స్ స్టువర్ట్ బ్లాక్‌టన్ మరియు ఎమిలే కోల్ వంటి వారు మెక్కే కి ముందుగా కొన్ని యానిమేషన్ ప్రయత్నాలు చేశారు.
అయితే ప్రపంచంలో యానిమేటెడ్ కార్టూన్లు వేసిన మొదటి వ్యక్తి మెక్కేయే అని చెప్పవచ్చు.
ఆయన ఎక్కడ, ఎప్పుడు జన్మించారన్న దానికి సరైన రికార్డ్స్ లేవు.
బహుశా ఆయన 1867-71 ల మధ్య US లేదా కెనడాలో జన్మించినట్లు చెబుతారు.
ఆయన 1934 జూలై 26 వ తేదీన US లోని న్యూయార్క్‌లో మరణించారు.
తన చిన్నతనం నుండి ఆయన డ్రాయింగ్‌లో అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఎంతో విశిష్టమైన ఆర్టిస్ట్ గా గుర్తింప బడ్డాడు.
ప్రారంభంలో ఆయన డైమ్ మ్యూజియంల కోసం పోస్టర్లు తయారు చేయడం, యితర సాంస్కృతిక కార్యక్రమాల కోసం పనిచేశాడు.
డైమ్ మ్యూజియంలు 19 వ శతాబ్దంలో అమెరికాలో శ్రామిక వర్గ ప్రజల కోసం విద్యా మరియు వినోద కేంద్రాలుగా విలసిల్లాయి.
ఆయన 1898 లో వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్‌లలో ఆర్టికల్స్ యొక్క బొమ్మలను చిత్రించే కార్టూనిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు.
1903లో ఆయన న్యూయార్క్ హెరాల్డ్ పత్రికలో చేరాడు. ఆ పత్రికలో ఆయన ‘లిటిల్ సేమీ స్నీజ్’ మరియు ‘డ్రీమ్ ఆఫ్ ది రేర్‌బిట్ ఫైండ్’ వంటి ప్రసిద్ధ కామిక్ స్ట్రిప్‌లను సృష్టించాడు.
అతను 1905లో “లిటిల్ నెమో ఇన్ స్లంబర్‌ల్యాండ్” పేరుతో మొదటిసారిగా ఒక ఫాంటసీ కామిక్ స్ట్రిప్‌ను అందించాడు.
ఇది ఒక చిన్న పిల్లవాడు మరియు అతను కనే సాహసోపేతమైన కలలకు సంబంధించిన సిగ్నేచర్ స్ట్రిప్.
అదే సమయంలో ఆయన అనేక వివరణాత్మక సంపాదకీయ కార్టూన్లు కూడా రూపొందించాడు.
ఆయన సంపాదకీయ కార్టూన్లు ప్రజా రంగంలో ప్రసిద్ది చెందిన వ్యక్తుల యొక్క గ్రాఫికల్ వ్యంగ్య చిత్రాలతో కూడిన రాజకీయ కార్టూన్లుగా ప్రసిద్ది చెందాయి.
ఆ రోజుల్లో వాడేవిల్లే సర్క్యూట్‌లో ప్రదర్శించే చాక్ టాక్స్ అనే కార్యక్రమాలు చాలా పేరు గాంచాయి.
వాడెవిల్లే సర్క్యూట్ అనేది 19వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో ఒక రంగస్థల వినోద కార్యక్రమాలు నిర్వహించే సంస్ట పేరు.
ఆయన వాడేవిల్లే సర్క్యూట్‌లో అలాంటి చాక్ టాక్స్ ప్రదర్శించడంలో ప్రసిద్ధి చెందాడు.
చాక్ టాక్స్ అనేది శ్రోతలలో ఆసక్తిని కలిగించే లెక్చర్ పాయింట్‌లను బొమ్మల ద్వారా తెలియ చెప్పే ప్రదర్శనలు.
20వ శతాబ్దం ప్రారంభంలో మెక్కే తన చిత్రాలను స్వయంగా యానిమేట్ చేయడం ప్రారంభించాడు.
యానిమేషన్ సినిమాల కోసం ఆయన ప్రతి చిత్రాన్ని విడిగా గీసేవారు. తర్వాత ఆయా చిత్రాలను ఒక్కటొక్కటిగా ఫొటోలు తీసే వారు.
ఒక్క నిమిషం సినిమా తీయాలంటే వందల కొద్దీ చిత్రాలు గీయవలసి వచ్చేది.
ఎంతో ఓపికగా చాలా సమయం తీసుకునే కష్టమైన పని అది. కొన్నిసార్లు ఐదు నిమిషాల యానిమేషన్ కార్టూన్ చేయడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పట్టేది.
తన పనిలో ఆయన ఎంతో సంతృప్తి చెందేవారు. దాన్ని గర్వంగా భావించారు.
ఆయన 1911 మరియు 1921 ల మధ్య 10 యానిమేషన్ సినిమాలు పూర్తి చేసారు. మరో మూడు తీయడానికి ప్లాన్ చేశారు.
ఆయన మొదటి యానిమేషన్ చిత్రమైన “లిటిల్ నెమో” 1911 ఏప్రిల్ 8న థియేటర్‌లలో విడుదలైంది.
దీనిని 4000 డ్రాయింగ్‌లతో బ్లేక్ అండ్ వైట్ సినిమాగా ఆయన రూపొందించారు.
ఈ చిత్రానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. దానితో దీనిని కలర్ లో రిమేక్ చేయాలని భావించి ఫ్రేమ్ ఫ్రేమ్‌కు రంగులద్ది కలర్ యానిమేషన్ మూవీగా రిలీజ్ చేశారు.
ఆయన 1912లో తన రెండవ యానిమేషన్ చిత్రం “హౌ ఎ మస్కిటో ఆపరేట్స్”ని విడుదల చేశారు.
ఇది 1909లో ప్రచురించబడిన అతని కామిక్ స్ట్రిప్ ‘రేర్బిట్ ఫైండ్’ ఎపిసోడ్ ఆధారంగా రూపొందించ బడిన చిత్రం.
ఈ చిత్రం ఆహ్లాదకర మైన కామెడీ యానిమేషన్ కి ఒక ఉదాహరణ.
ఈ మూవీలో నిద్రిస్తున్న ఒక వ్యక్తిని ఒక పెద్ద దోమ రక్తం పీలుస్తూ చికాకు పెడుతుంటుంది.
ఆ మనిషికి దొరక్కుండా అది తప్పించుకుంటూ వుంటుంది. చివరికి రక్తాన్ని మితి మీరి తాగడంతో దాని పొట్ట పేలి తనే చనిపోతుంది.
ఆయన నెక్స్ట్ యానిమేషన్ చిత్రం “గెర్టీ ది డైనోసార్”. ఈ సినిమా వివరణాత్మక బెక్ గ్రౌండ్ నేపథ్య యానిమేషన్‌తో 1914 ఫిబ్రవరి లో విడుదలై మంచి పేరు తెచ్చుకొంది.
ఈ చిత్రంలో మెక్కే తనే స్వయంగా పోర్ గ్రౌండ్ లో కనిపించి బందిఖానాలో వున్న “Gertie” అనే డైనోసార్ ను పరిచయం చేస్తాడు.
ఆయన ఒక కొరడాతో దానిని ఆజ్ఞాపిస్తూ ప్రేక్షకులకు నమస్కరించడం వంటి అనేక యానిమేటెడ్ ట్రిక్స్ దాని చేత ప్రదర్శింపచేస్తాడు.
ఈ యానిమేషన్ చలనచిత్రంలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, మెక్కె స్టేజ్‌పై నుంచి మాయమయి యానిమేషన్ రూపంలో సినిమా యొక్క సీన్లోకి ఎంటరవుతాడు. చివరగా ఆ డైనోసార్ మీద స్వారీ చేస్తూ వెల్తాడు.
ఇవే కాక “ఎ టేల్ ఆఫ్ ది జంగిల్ ఇంప్స్”, లిటిల్ సామీ స్నీజ్” వంటి అనేక కామిక్ స్ట్రిప్‌లు ఆయనచే రూపొందించబడ్డాయి.
పైన చెప్పిన వాటితో సహా దాదాపు 11 యానిమేషన్ సినిమాలను మెక్కె నిర్మించాడు.
ఆయన నిర్మించిన ఇతర యానిమేషన్ సినిమాలు “ది పెట్”, “ది ఫ్లయింగ్ హౌస్”, “ఫ్లిప్స్ సర్కస్” మొదలైనవి.
డ్రీమ్ ఆఫ్ ది రేర్‌బిట్ ఫైండ్‌లో, ఆయన తన పేరుకి బదులుగా ‘సిలాస్’ అనే కలం పేరును ఉపయోగించాడు.
ఆయన రచనలన్నీ వాస్తవిక దృక్పథంతో గొప్ప అవగాహనతో రూపొందించబడ్డాయి.
ఆయన యానిమేషన్ టెక్నిక్స్ తదనంతర కాలంలో వాల్ట్ డిస్నీ యొక్క యానిమేషన్ చిత్రాలలో అనుసరించబడ్డాయి.
మెక్కే యొక్క టెక్నిక్‌లను వాల్ట్ డిస్నీ ఎంతో కీర్తించారు. డిస్నీల్యాండ్ బేనర్ లో 1955లో నిర్మిచిన “ది స్టోరీ ఆఫ్ యానిమేటెడ్ డ్రాయింగ్” అనే ఎపిసోడ్‌లో మెక్కెకి ఘనంగా నివాళులర్పించారు.
యానిమేషన్ రంగానికి ఫాదర్ గా కీర్తించ బడే “జెనాస్ విన్సర్ మెక్కే” యొక్క క్లుప్తమైన కథ ఇది.
All Blogs & Vlogs from mamlabs.net