
Film: Panthulamma
చిత్రం: పంతులమ్మ
Language – Year Released: Telugu – 1978
భాష & రిలీజ్: తెలుగు – 1978
Starring: Ranganath; Lakshmi; Deepa; Sarath Babu; Ravi Kondala Rao; Girija; etc.
ముఖ్య తారాగణం: రంగనాథ్; లక్ష్మి; దీప; శరత్ బాబు; రావి కొండల రావు; గిరిజ; తదితరులు
Lyrics: Veturi Sundara Rama Murthy
గీత రచన: వేటూరి సుందర రామ మూర్తి
Playback: S P Balasubrahmanyam
నేపథ్య గానం: S P బాల సుబ్రహ్మణ్యం
Music: Rajan – Nagendra
సంగీతం: రాజన్ – నాగేంద్ర
Director: Singitam Srinivasa Rao
దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు
Banner: Navata Arts
నిర్మాణ సంస్థ: నవత ఆర్ట్స్
Lyrics in Telugu
పల్లవి:
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటే నీవే
ఎన్నెల్లు తేవే ఎద మీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
చరణం 1:
ఎలదేటి పాట చెలరేగే నాలో
చెలరేగి పోవే మధుమాస మల్లె
ఎలమావి తోట పలికింది నాలో
పలికించు కోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూట నవ్వే వన దేవతల్లే
పున్నాగ పూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే ఎద మీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
చరణం 2:
మరుమల్లె తోట మారాకు వేసే
మారాకు వేసే నీ రాక తోనే
నీ పలుకు పాటై బ్రతుకైన వేళ
బ్రతికించు కోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే
అనురాగమల్లె సుమగీతమల్లె
నన్నల్లు కోవే నా ఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే ఎద మీటిపోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
ఆహాహా… లల లాల లాల…
Lyrics in English
Chorus:
Sirimalle nive virijallu kave
Varadalle rave valapante nive
Ennellu teve eda miti pove
Sirimalle nive virijallu kave
Stanza 1:
Eladeti pata chelarege nalo
Chelaregi pove madhumasa malle
Elamavi thota palikindi nalo
Palikinchu kove madi koyilalle
Nee paluku nade naa brathuku nide
Tholiputa navve vana devatalle
Punnagapoole sannayi pade
Ennellu teve eda miti pove
Sirimalle nive virijallu kave
Stanza 2:
Marumalle thota maaraku vese
Maaraku vese nee raka thone
Nee paluku patai brathukaina vela
Bratikinchu kove nee padamugane
Naa padamu nive naa brathuku nive
Anuragamalle suma gitamalle
Nannallukove naa illu nive
Ennellu teve eda miti pove
Sirimalle nive virijallu kave
Aa haa haa… lala laala laala…
