“Retired Great Warrior” / Telugu

యుద్ధ రంగంలో యింకా పోరాడుతూ వున్న… “రిటైర్డ్ గ్రేట్ వారియర్”

ఒకప్పుడు అతను యుద్ధరంగంలో అరి వీర భయంకరుడు.

కానీ అతను చాలా కాలం క్రితమే రిటైర్ అయ్యాడు; ఇప్పుడు యుద్దభూమికి దూరంగా ఉంటున్నాడు.

బౌతికంగా రిటైర్ మెంట్ తీసుకున్నప్పటికీ కదన రంగంలో అతని వారసత్వం యిప్పటికీ నిరాటంకంగా గర్జిస్తూనేవుంది.

అతను మరెవరో కాదు – ఈ నాటి యుద్ధ టేంక్ లకు, ఫిరంగులకు గురువు మరియు ఆధ్యుడు.

సింపుల్ భాషలో చెప్పాలంటే అతన్ని – “పంగల కర్ర” (Catapult) అంటారు.

సరదాగా అనిపించినా ఇది నిజం. పురాతన యుద్ధ చిత్రాలను చూసే మనలో చాలా మందికి ఈ విషయం తెలుసు.

బాహుబలి సినిమాలో ప్రభాస్, పొడవైన చెట్లను పంగల కర్ర మాదిరిగా ఉపయోగించి శత్రువుల కోటలోకి ప్రవేశించి వారిని మట్టి కరిపించటం చూసాం గదా.

కానీ నేడవి పిల్లల ఆట వస్తువులుగా మిగిలిపోయాయి.

మన చరిత్రలో కొంచెం వెనక్కి వెళితే, వీటిని రక్షణ లేదా వేట సాధనాలుగా ఉపయోగించే వారు. ఇంకా పురాతన కాలానికి వెళ్తే యుద్దాలలో పెద్ద పెద్ద కేటపుల్ట్‌ (పంగల కర్ర) లను శత్రు సైన్యాన్ని, వారి కోట గోడలను ద్వంశం చేయటానికి ఉపయోగించే వారు.

ఆ నాటి యుద్ధాలలో ఈ కేటపుల్ట్స్ (పంగల కర్రలు) చాలా విశిష్ట పాత్ర పోషించాయి. తుపాకులు, కానన్లు కనిపెట్టక ముందు ఇవే యుద్ధాలలో హీరోలు. దూరం నుండే శత్రు శిబిరాలను ధ్వంసం చేసి యుద్ధ ఫలితాలను తారుమారు చేసేవి. ఈ దృశ్యాలను (హాలీవుడ్) సినిమాలలో పాత యుద్ధ సన్నివేశాలలో మనం చూస్తూ వుంటాం.

అంతేకాక ఈ నాటి క్షిపణులను ప్రయోగించే ఆధునిక ఫిరంగులు, అలాగే యుద్ద ఓడలపై నుండి క్షణ కాలంలో ఆకాశం లోకి దూసుకు పోయే యుద్ధ విమానాల టేక్ ఆఫ్ డివైసెస్ ల టెక్నాలజీలోను ఈ పంగల కర్రల వర్కింగ్ ప్రిన్సిపుల్ ని (పని చేసే విధానాన్ని) నేటికీ ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ పంగల కర్రను – “ఇంకా యుద్ద రంగంలో వున్న… రిటైరైన గొప్ప యుద్ధ వీరుడితో” పోల్చటం సరైనదే అనుకుంటాను.

పంగల కర్ర కి తెలుగులో మరొక పేరు ఒడిసెల.

ఇక పొతే, మనం ఇప్పుడు యుద్దాలలో వాడిన కేటపల్ట్ ల గురించి మాట్లాడుకుందాం:

ఈ కాటాపుల్ట్ ల యొక్క ప్రధాన భాగాలు ఏవిటంటే:

ఫ్రేమ్ (చక్రాలతో లేదా చక్రాలు లేకుండా), పొడవాటి ఆర్మ్, ఒక బకెట్, ఒక వించ్, అనేక త్రాడులు, మరియు పేలోడ్.

ప్రాథమికంగా కాటాపుల్ట్‌లను కదలని రకం (Fixed type) మరియు కదిలే (చక్రాల) రకాలు (movable or wheeled type లు) గా వర్గీకరించవచ్చు.

కదలనవి సాధారణంగా పెద్ద ఆకారంలో వుండే కేటపుల్ట్‌లు. శత్రువుల దాడి నుండి నగరాలను కోటలను  రక్షించడానికి లేదా పటిష్టపరచడానికి వాటిని శాశ్వతంగా ఒక స్తలంలోనే వుండే విధంగా నిర్మించే వారు.

చక్రాల (కదిలే) రకాలు, పై వాటితో పోల్చితే, చిన్నవిగా వుండి, యుద్ధంలో కోటలు మరియు కోట గోడలను నాశనం చేయడానికి ఉపయోగించ బడ్డాయి. దూసుకువస్తూన్న శత్రువులపై ఈటెలు లేదా బాణాలు విసిరేందుకు కూడా వీటిని ఉపయోగించెవారు.

ఒక పెద్ద కాటాపుల్ట్ 460 మీటర్ల (1500 అడుగులు) వరకు రాళ్లను విసర గలిగేది.

అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం, మొట్టమొదటగా 3200-3400 సంవత్సరాల క్రితం అంటే క్రీ.పూ. 1200-1000 ల నుండి ఈ యుద్ధ కేటపుల్ట్ లను ఉపయోగించినట్లు తెలుస్తోంది.

పురాతన రోమన్లు ఫిక్స్డ్ కాటాపుల్ట్‌ లకు మొట్ట మొదటగా చక్రాలను అమర్చటం ద్వారా వాటి ఉపయోగాన్ని మెరుగుపరచినట్లు తెలుస్తోంది.

ఈ కెటపుల్ట్‌లు వాటి రూపకల్పన, పని మరియు ప్రయోజనం ప్రకారం తిరిగి 4 ప్రధాన రకాలుగా ఉప-వర్గీకరించబడ్డాయి.

అవేంటంటే:

1. మాంగోనెల్ (Mangonel):

ఇది తక్కువ కోణాలలో ప్రక్షేపకాల (projectiles) ను క్షితిజ సమాంతర రేఖలో (horizontal గా) విసిరేలా రూపొందించబడింది. కోటలు లేదా కోట గోడలను నాశనం చేయడానికి మాంగోనెల్ సమర్థ వంతంగా  పనిచేసేది.

2. ట్రెబుచెట్ (Trebuchet):

దీనిని పెద్ద పెద్ద రాళ్లను ఎత్తైన కోణాల్లో సుదూర ప్రాంతాలకు విసిరేందుకు ఉపయోగించేవారు. ఇవి గోడలపై ప్రోజేక్తిల్స్ ను ప్రయోగించడానికి కుడా వాడేవారు.

3. ఒనేజర్ (Onager):

దీని డిజైన్ మాంగోనెల్ మరియు ట్రెబుచెట్ రెండింటి యొక్క కాంబినేషన్ గా ఉంటుంది. ఇది చాలా ఎక్కువ దూరానికి రాళ్ళను విసిరే విధంగా వుంటుంది.

4. బలిస్టా (Ballista):

ఇది మాంగోనెల్‌ను పోలిన పెద్ద క్రాస్‌బౌ మాదిరిగా వుంటుంది. దీనిని టోర్షన్-పవర్డ్ మాంగోనెల్ (torsion-powered mangonel) అని పిలువ వచ్చు. దీనిని ప్రధానంగా ఈటెలు, బాణాలు, బోల్ట్‌లు, యింకా రాళ్లను ఎక్కువ శక్తితో, ఖచ్చితత్వం (accuracy) తో విసిరేందుకు ఉపయోగించేవారు.

కేటపుల్ట్‌లను నిర్మించడానికి లేదా మరమ్మతు చేయడానికి వడ్రంగులు (carpenters) తరచుగా సైన్యాన్ని అనుసరించి వెళ్ళేవారు.

యుద్ధంలో ఉపయోగించే కెటపుల్ట్ ల యొక్క వర్కింగ్ ప్రిన్సిపుల్:

(ఇది పైన పేర్కొన్న కేటపుల్ట్ టైప్ ని బట్టి కొద్దిగా మారుతుంది).

1. సైనికులు వించ్‌ను చుట్టడం ద్వారా తాడు బిగించబడుతుంది.

2. దీని వల్ల త్రాడులన్నీ ఆర్మ్ యొక్క బేస్ వద్ద మరింత ఎక్కువ బిగుతుగా అవుతాయి.

3. సైనికులు ఆర్మ్ యొక్క బకెట్లో విసరాల్సిన పెద్ద రాయిని లోడ్ చేస్తారు.

4. తాడు యొక్క పట్టు అకస్మాత్తుగా వదలడం వల్ల బేస్ చుట్టూ ఉన్న త్రాడులు అన్నీ ఒక్కసారిగా విప్పబడతాయి.

5. ఆ స్ప్రింగ్ ఏక్షన్ ఫలితంగా బకెట్ నుండి విడివడిన రాయి లక్ష్యం వైపుగా గాలిలో దూసుకు పోతుంది.

Presented By:

Click Here for English Version

English Version

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply