Payaninche O Chiluka

Album: Payaninche O chiluka

పాట: పయనించే ఓ చిలుకా

Fillm: Kula Daivam

చిత్రం: కుల దైవం

Language – Release: Telugu – 1960

భాష – రిలూజు: తెలుగు – 1960

Starring: Jaggayya; Gummadi; Chalam; Anjali Devi; Girija; Krishna Kumari; Lakshmi; etc.

ముఖ్య తారాగణం:

జగ్గయ్య; గుమ్మడి; చలం; అంజలి దేవి; గిరిజ;

కృష్ణ కుమారి; లక్ష్మి; తదితరులు

Lyrics: Samudrala (Junior)

గేయ రచన: సముద్రాల (జూనియర్)

Playback: Gantasala

నేపథ్యగానం: ఘంటసాల

Music: Pendyala Nageswara Rao

సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు

Director: Kabir Das

దర్శకత్వం: కబీర్ దాస్

పల్లవి:

పయనించే ఓ చిలుకా…

పయనించే ఓ చిలుకా – ఎగిరిపో పాడై పోయెను గూడు

పయనించే ఓ చిలుకా – ఎగిరిపో పాడై పోయెను గూడు

పయనించే ఓ చిలుకా…

చరణం 1:

తీరెను రోజులు నీకీ కొమ్మకు

కొమ్మా ఈ చోటు వదలి

తీరెను రోజులు నీకీ కొమ్మకు

కొమ్మా ఈ చోటు వదలి

ఎవరికి వారే ఏదో నాటికి

ఎరుగము ఎటకో ఈ బదిలీ

మూడు దినాల ముచ్చటయే.. ఏ… ఏ…

మూడు దినాల ముచ్చటయే

ఈ లోకంలో మన మజిలీ

నిజాయితీగా ధర్మ పథాన

నిజాయితీగా ధర్మ పథాన

సనుమా ధైర్యమే తోడు

పయనించే ఓ చిలుకా – ఎగిరిపో పాడై పోయెను గూడు

పయనించే ఓ చిలుకా…

పుల్ల పుడక ముక్కున కరచి

గూడును కట్టితివోయి

పుల్ల పుడక ముక్కున కరచి

గూడును కట్టితివోయి

వానకు తడిసిన నీ బిగి రెక్కలు

ఎండకు ఆరిన వోయి

ఫలించ లేదని చేసిన కష్టము

ఫలించ లేదని చేసిన కష్టము

మదిలో వేదన వలదోయి

రాదోయి సిరి నీ వెను వెంట

రాదోయి సిరి నీ వెను వెంట

త్యాగమే నీ చేదోడు

పయనించే ఓ చిలుకా – ఎగిరిపో పాడై పోయెను గూడు

పయనించే ఓ చిలుకా…

Chorus:

Payaninche O chiluka…

Payaninche O chiluka – Egiripo padai poyenu gudu

Payaninche O chiluka – Egiripo padai poyenu gudu

Payaninche O chiluka…

Stanza 1:

Tirenu rojulu niki kommaku

Komma ee chotu vadali

Tirenu rojulu niki kommaku

Komma ee chotu vadali

Evariki vare edo natiki

Erugamu etako ee badili

Mudu dinala mucchataye… eh.. eh…

Mudu dinala mucchataye

Ee lokamlo mana majili

Nijayitiga dharma padhana

Nijayitiga dharma padhana

Sanuma dhairyame thodu

Payaninche O chiluka – Egiripo padai poyenu gudu

Payaninche O chiluka…

Stanza 2:

Pulla pudaka mukkuna karachi

Gudunu kattitivoyi

Pulla pudaka mukkuna karachi

Gudunu kattitivoyi

Vanaku tadisina ni bigi rekkalu

Endaku aarina voyi

Phalincha ledani chesina kashtamu

Phalincha ledani chesina kashtamu

Madilo vedana valadoyi

Radoyi siri ni venu venta

Radoyi siri ni venu venta

Tyagame ni chedodu

Payaninche O chiluka – Egiripo padai poyenu gudu

Payaninche O chiluka…