ఊహలు గుస గుసలాడే

Film: Bandi Potu
చిత్రం: బందిపోటు
Language – Year Released: Telugu – 1963
భాష & రిలీజ్: తెలుగు – 1963
Starring: NT Rama Rao (Sr); Krishna Kumari; Rajanala; Relangi; Nagayya; Gummadi; Ramana Reddy; etc.
ముఖ్య తారాగణం: NT రామారావు (Sr); కృష్ణకుమారి; రాజనాల; రేలంగి; నాగయ్య; గుమ్మడి; రమణారెడ్డి; తదితరులు
Lyrics: Dr. C. Narayana Reddy
గీత రచన: Dr. C. నారాయణ రెడ్డి
Playback: Gantasala & P. Susheela
నేపథ్య గానం: ఘంటసాల & P. సుశీల
Music: Gantasala
సంగీతం: ఘంటసాల
Director: B. Vitalacharya
దర్శకత్వం: B. విఠలాచార్య
Banner: Rajyalakshmi Productions
నిర్మాణ సంస్థ: రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్
Lyrics in Telugu
పల్లవి:
ఊ హూ హూ… ఊ ఊ ఊ…
ఊ ఊ ఊ… ఊ ఊ ఊ…
ఊ హూ హూ… ఊ ఊ ఊ…
ఊ ఊ ఊ… ఊ ఊ ఊ…
ఊహలు గుస గుసలాడే
నా హృదయము ఊగిసలాడే
ప్రియా… ఊ
ఊహలు గుస గుసలాడే
నా హృదయము ఊగిసలాడే
చరణం 1:
వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే
అది నీకు మునుపే తెలుసు
ఊహలు గుస గుసలాడే
నా హృదయము ఊగిసలాడే
చరణం 2:
నను కోరి చేరిన బేలా
దూరాన నిలిచే వేలా
నను కోరి చేరిన బేలా
దూరాన నిలిచే వేలా
నీ ఆనతి లేకున్నచో
విడలేను ఊపిరి కూడా
ఊహలు గుస గుసలాడే
నా హృదయము ఊగిసలాడే
చరణం 3:
దివి మల్లె పందిరి వేసే
భువి పెళ్లి పీటను వేసే
దివి మల్లె పందిరి వేసే
భువి పెళ్లి పీటను వేసే
నెర వెన్నెల కురిపించుచు
నెలరాజు పెండ్లిని చేసే
ఊహలు గుస గుసలాడే
నా హృదయము ఊగిసలాడే
Lyrics in English
Chorus:
Oo hu hu… oo oo oo…
oo oo oo… oo oo oo…
Oo hu hu… oo oo oo…
oo oo oo… oo oo oo…
Oohalu gusa gusalade
Na hrudayamu oogisalede
Priya… oo
Oohalu gusa gusalade
Na hrudayamu oogisalede
Stanza 1:
Valadanna vinadi manasu
Kalanaina ninne talachu
Valadanna vinadi manasu
Kalanaina ninne talachu
Tolipremalo balamundile
Adi niku munupe telusu
Oohalu gusa gusalade
Na hrudayamu oogisalede
Stanza 2:
Nanu kori cherina bela
Durana niliche vela
Nanu kori cherina bela
Durana niliche vela
Ni anati lekunnacho
Vidalenu oopiri kuda
Oohalu gusa gusalade
Na hrudayamu oogisalede
Stanza 3:
Divi malle pandiri vese
Bhuvi pelli pitanu vese
Divi malle pandiri vese
Bhuvi pelli pitanu vese
Nera vennela kuripinchuchu
Nelaraju pendlini chese
Oohalu gusa gusalade
Na hrudayamu oogisalede
