Mouname Nee Bhasha

Album: Mouname nee bhasha O muga manasa  (మౌనమె నీ భాష ఓ మూగమనసా)

Film: Guppedu manasu (గుప్పెడు మనసు) (1979)    

Language: Telugu

Lyrics: Acharya Athreya (ఆచార్య ఆత్రేయ)

Playback: M. Bala Murali Krishna (మంగళంపల్లి బాల మురళీ కృష్ణ)

Music: M.S. Viswanathan Director: K. Bala Chander

పల్లవి:

మౌనమె నీ భాష ఓ మూగమనసా           ll మౌనమె నీ భాష ll

తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు       ll తలపులు ఎన్నెన్నో ll  

కల్లలు కాగానె కన్నీరౌతావు 

మౌనమె నీ భాష ఓ మూగమనసా… ఓ మూగమనసా… 

చరణం 1:

చీకటి గుహనీవు

చింతల చెలి నీవు                     ll చీకటి గుహనీవు ll  

నాటకరంగానివే  మనసా

తెగిన పతంగానివే 

ఎందుకు వలచేవో

ఎందుకు వగచేవో 

ఎందుకు రగిలేవో

ఏమై మిగిలేవో 

ఎందుకు రగిలేవో – ఏమై మిగిలేవో

మౌనమె నీ భాష ఓ మూగమనసా 

తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు 

కల్లలు కాగానె కన్నీరౌతావు 

మౌనమె నీ భాష ఓ మూగమనసా…

ఓ మూగమనసా…

చరణం 2:

కోర్కెల చెల నీవు

కూరిమి వల నీవు                                  ll కోర్కెల చెల నీవు ll

ఊహల ఉయ్యాలవే మనసా

మాయల దెయ్యానివే 

లేనిది కోరేవు ఉన్నది వదిలేవు

ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు 

ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

మౌనమె నీ భాష ఓ మూగమనసా 

తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు 

కల్లలు కాగానె కన్నీరౌతావు 

మౌనమె నీ భాష ఓ మూగమనసా… ఓ మూగమనసా… 

Lyrics in English

Intro:

Mouname nee bhasha O muga manasa           ll Mouname ll

Talapulu ennenno kalaluga kantavu                  ll Talapulu ll

Kallalu kagane kanneeravutavu                          ll Mouname ll

Stanza 1:

Cheekati guha neevu

Chintala cheli neevu                                                  ll Cheekati ll

Naataka ranganive manasa

Tegina patanganive

Enduku valachevo

Enduku vagachevo

Enduku ragilevo

Emai migilevo

Enduku ragilevo – Emai migilevo                        ll Mouname ll

Stanza 2:

Korkela chela neevu

Kurimi vala neevu                                                        ll Korkela ll

Oohala uyyaalave manasa

Mayala deyyanive

Lenidi korevu – Unnadi vadilevu

Oka porapatuku yugamulu pogilevu                   ll Oka porapatuku ll

Mouname nee bhasha O muga manasa

Talapulu ennenno kalaluga kantavu

Kallalu kagane kanneeravutavu

Mouname nee bhasha O muga manasa… O muga manasa…