
Film: Adrusta Vanthulu
చిత్రం: అదృష్టవంతులు
Language – Year Released: Telugu – 1969
భాష & రిలీజ్: తెలుగు – 1969
Starring: Akkineni Nageswara Rao; Jayalalitha; Jaggayya; Gummadi; Relangi; Padmanabham; Prabhakar Reddy; Thyagaraju; etc.
ముఖ్య తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు; జయలలిత; జగ్గయ్య; గుమ్మడి; రేలంగి; పద్మనాభం; ప్రభాకర రెడ్డి; త్యాగరాజు; తదితరులు
Lyrics: Konakalla Venkata Ratnam
గీత రచన: కొనకళ్ళ వెంకటరత్నం
Playback: P. Susheela
నేపథ్య గానం: P. సుశీల
Music: K.V. Mahadevan
సంగీతం: K.V. మహదేవన్
Director: V. Madhusudana Rao
దర్శకత్వం: V. మధుసూదన రావు
Banner: Jagapathi Art Pictures
నిర్మాణ సంస్థ: జగపతి ఆర్ట్ పిక్చర్స్
Lyrics in Telugu
పల్లవి:
మొక్కజొన్న తోటలో ముసిరిన చికట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువ్వు మరువకు మరువకు మావయ్య
మొక్కజొన్న తోటలో – ముసిరిన చికట్లలో
మంచెకాడ కలుసుకో – మరువకు మావయ్య
నువ్వు మరువకు మరువకు మావయ్య
చరణం 1:
చుక్కలన్నీ కొండమీద సోకు చేసుకొనే వేళ
చల్లగాలి తోటనంత చక్కిలిగిలి పెట్టువేళ
చుక్కలన్నీ కొండమీద సోకు చేసుకొనే వేళ
చల్లగాలి తోటనంత చక్కిలిగిలి పెట్టువేళ
పొద్దువాలినంతనే సద్దు మణగ నిచ్చిరా
పొద్దువాలినంతనే సద్దు మణగ నిచ్చిరా
వేళ దాటి వస్తివా వెనక్కి తిరిగి పోతివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య
చరణం 2:
మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినపుడు
వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు
ఆ… ఆ… ఊ…
మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినపుడు
వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు
కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని
కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని
నలుగురిలో చిన్న బోయినానని
నవ్వుల పాలైతివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య
చరణం 3:
గడ్డి బళ్ల ఎనాకతల గమ్మత్తుగ నక్కినా
ఊర చెరువు రెల్లుపక్క ఒంగి ఒంగి నడిచినా
గడ్డి బళ్ల ఎనాకతల గమ్మత్తుగా నక్కినా
ఊర చెరువు రెల్లుపక్క ఒంగి ఒంగి నడిచినా
అయినవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలవుతాను
అయినవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలవుతాను
గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య
Lyrics in English
Chorus:
Mokkajonna thotalo musirina chikatlalo
Manchekada kalusuko maruvaku mavayya
Nuvvu maruvaku maruvaku mavayya
Mokkajonna thotalo musirina chikatlalo
Manchekada kalusuko maruvaku mavayya
Nuvvu maruvaku maruvaku mavayya
Stanza 1:
Chukkalanni kondamida soku chesukone vela
Challagali thotanantha chakkiligili pettuvela
Chukkalanni kondamida soku chesukone vela
Challagali thotanantha chakkiligili pettuvela
Podduvali nanthane saddu managa nicchiraa
Podduvali nanthane saddu managa nicchiraa
Vela dati vasthiva venakki thirigi pothiva
Thantaa mana iddariki tappadu mavayya
Tappadu tappadu mavayya
Stanza 2:
Monna rethiri jatharalo kannu gitinapudu
Vanga thota malupukada kongu laginapudu
aa… aa… oo..
Monna rethiri jatharalo kannu gitinapudu
Vanga thota malupukada kongu laginapudu
Kasiri thittinanani visiri kottinanani
Kasiri thittinanani visiri kottinanani
Nalugurilo chinna boyinanani
Navvula palaithiva
Thantaa mana iddariki tappadu mavayya
Tappadu tappadu mavayya
Stanza 3:
Gaddi balla gammatthuga nakkina
Oora cheruvu rellu pakka ongi ongi nadichina
Gaddi balla gammatthuga nakkina
Oora cheruvu rellu pakka ongi ongi nadichina
Ayina valla kalla badaku allari palavutanu
Ayina valla kalla badaku allari palavutanu
Guttu bayata pedithiva gola gani chesthiva
Thantaa mana iddariki tappadu mavayya
Tappadu tappadu mavayya
