Good Food with Good Shelf Life/Tel

Foods & Foodies – 01

మన్నిక గల నాణ్యమైన ఆహారం

ఇప్పటి వేగవంతమైన జీవనశైలి మరియు వినియోగదారులలో నాణ్యత, పోషకాలపై పెరిగిన అవగాహన, ఈ రెండూ నేటి ఆహార రంగంలో రెడీ-టు-ఈట్ ఫుడ్ (తినటానికి సిద్ధంగా ఉన్న ఆహారం) కోసం రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది.

వినియోగదారుడి యొక్క ఈ ధోరణి నిస్సందేహంగా ముఖ్యంగా పండ్లు మరియు కూరగాయల రంగంలో నిమగ్నమై ఉన్న ఫుడ్ ప్రాసెసర్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తున్నది.

అంతేకాకుండా, ఆహార ఉత్పత్తుల షెల్ఫ్ లైఫ్ (ఆహార నిల్వ కాలం) అనే అంశం ఆహార ఉత్పత్తి మరియు వినియోగ రంగాల (ఫుడ్ చెయిన్) పై  గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నది.

ఎలా అంటే. ఉత్పత్తి అయిన ఆహరం యొక్క షెల్ఫ్ లైఫ్ తగ్గినట్లయితే దాని ప్రభావం సాగుదారులు, ప్రాసెసర్లు, రిటైలర్లు మరియు వినియోగదారుల యొక్క ఆర్ధిక మరియు ఆదాయ స్తితి గతులపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపెడుతుంది.

నిజానికి పండ్లు మరియు కూరగాయలు వంటివి త్వరగా పాడైపోతాయి. పంట కోసిన కొన్ని రోజుల వరకూ మాత్రమే అవి తినడానికి అనుకూలంగా వుంటాయి.

పండ్లు, కూరగాయలు యితర వ్యవసాయ ఉత్పత్తులు పాడై పోవటం వల్ల కలిగే నష్టం ప్రపంచవ్యాప్తంగా 40-50% గా అంచనా వేయబడింది.

అంటే ప్రతి సంవత్సరం వ్యవసాయ రంగ ఆహార ఉత్పత్తిలో దాదాపు సగం వరకు వృధా అవుతోంది.

కాబట్టి, పంటకోత అనంతరం వ్యవసాయ ఉత్పత్తుల షెల్ఫ్ లైఫ్ ని పొడిగించడం అనేది చాలా ముఖ్యమైన అంశం.

ప్రపంచ ఆహార వ్యవస్థ యొక్క పురోభివృద్ది, దాని పరిమాణం మరియు సంక్లిష్టతకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ పద్దతులు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతుంటాయి.

దురదృష్టవశాత్తు, ఈ అధునాతన ఆహార ప్రాసెసింగ్ పద్ధతులు ఫుడ్ సేఫిటీ మరియు భద్రతకు సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను కూడా కలిగి ఉంటున్నాయి.

అదే సమయంలో, ఆహార ఉత్పత్తులను కొన్ని నెలలపాటు రుచి మరియు రంగు కోల్పోకుండా తాజాగా ఉంచడం అనేది ఫుడ్ ప్రాసెసర్ మరియు రిటైలర్‌లకు చాలా కష్టమైన పని.

పంట అనంతర నిర్వహణ (post-harvest handling), వాణిజ్య ప్రాసెసింగ్ (commercial processing), పంపిణీ (distribution), నిల్వ మరియు తయారీ (storage and preparation) ల సమయంలో ఆయా ఆహార ఉత్పత్తులు తమ యొక్క బేసిక్ విటమిన్‌ లను (ప్రాథమిక పోషకాలు) కోల్పోకుండా చేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం.

ఈ అంశాలన్నింటికి సంబంధించి ఆహార ఉత్పత్తి లో నిర్ణయాత్మక పాత్ర వహించే అంశం – “షెల్ఫ్ లైఫ్, అంటే ‘ఆహార నిల్వ కాలం’.

  • షెల్ఫ్ లైఫ్ అనేది ఆహారాన్ని ఏ తేదీ ముందు వరకూ మాత్రమే వినియోగించాలో తెలిపే కాలం/తేదీ”.

ఈ నాడు మంచి షెల్ఫ్ లైఫ్ ను మెయింటైన్ చేయటంలో వచ్చే ప్రధాన ప్రాక్టికల్ సమస్యలు:

  • సుదూర ప్రాంతాలకి విస్తరిస్తూన్న ఫుడ్ సప్ప్లై చెయిన్.
  • సరైన సాంకేతికత, పెట్టుబడి, మౌలిక సదుపాయాలు మరియు నైపుణ్యాలు.

ఎందుకంటే ఈ రోజు ఫుడ్ ప్రాసెసర్‌లలో ఎక్కువ మంది కొత్తగా ఈ రంగంలోకి అడుగిడిన వ్యవస్థాపకులు (entrepreneurs) మరియు వ్యవసాయ వ్యాపార సంస్థలు (agribusiness companies).

రైతులలోను మరియు కార్మికులలోను ఫుడ్ ప్రాసెసింగ్ గురించి సరైన అవగాహన లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా వుంది.

షెల్ఫ్ లాఫ్ ని పొడిగించడం వలన రోగ కారక సూక్ష్మజీవుల వలన, mould (బూజు పట్టటం/పాసి పోవటం) వలన వ్యాధి కారక ఆహార వ్యాప్తిని కూడా నిరోధించవచ్చు.

  • ఇది వినియోగదారులకు విలువ జోడించిన మెరుగైన ఉత్పత్తులను సరఫరా చేయడం ద్వారా బ్రాండ్ ఇమేజ్‌ను నిర్ధారిస్తుంది.
  • ఇది పాసిపోయే వ్యవసాయ ఉత్పత్తుల వృధాను తగ్గిస్తుంది.
  • ఇది ఆహారం యొక్క పోషక లక్షణాలను కోల్పోకుండా కాపాడుతుంది.
  • ఇది ROI అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ (పెట్టుబడిపై వచ్చే రాబడి) ని పెంచుతుంది.
  • పంటకోత తర్వాత ఆ ఆహారానికి స్టోర్డ్ ఎనర్జీ మరియు ఆక్సిజన్‌ లను అందివ్వడం ద్వారా ఆ ఆహారాన్ని స్వచ్చంగా ఫ్రెష్ గా ఉండేలా చేయవచ్చు.

నేడు, వ్యవసాయ ఆహారం యొక్క షెల్ఫ్ లైఫ్ ని పొడిగించడానికి అనేక ఆధునిక పద్ధతులు ఉపయోగించ బడుతున్నాయి.

1. ఉష్ణ చికిత్సలు (Thermal treatments)

ఇవి పంటకోత తర్వాత అనుసరించే పద్ధతులు.

  • పంట ఉత్పత్తులను వేడి నీటిలో డిప్ చేయటం (hot water dip),
  • సంతృప్త నీటి ఆవిరిలో వేడి చేయటం (saturated water vapour heat) లేదా
  • తేలికపాటి వేడి గాలిలో ఉంచటం (hot dry air) వంటి అనేక శుభ్రపరిచే పద్ధతులు ఉన్నాయి.

ఈ చికిత్సలు ఆ ఆహార పదార్థాలలో వున్న సూక్ష్మజీవులు మరియు క్రిములు కీటకాలను చంపుతాయి. ఫంగస్ ల ద్వారా కలిగే క్షయం (fungal decay) ను త్వరగా సంభవించ కుండా ఆలస్యం చేస్తాయి.

అవి పండ్లు కూరగాయలు వంటివి ముగ్గి పోయే ప్రక్రియను కూడా ఆపివేస్తాయి లేదా నెమ్మదింప చేస్తాయి.

2. ఆహార పటిష్టత/పౌష్టికత (Food Fortification):

ఆహార పదార్ధాలలో వుండే పోషక లోపాలను తగ్గించడానికి ఆహారానికి పౌష్టికత అందించటం అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలలో అవలంభిస్తున్న ఒక ఆధునిక పరిష్కార మార్గం.

సాధారణంగా ఇది ఫుడ్ ప్రాసెసింగ్ సమయంలో తినే ఆహారాలకు అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉన్న ప్రీమిక్స్ పోషకాలను (nutrient-rich premix) కొలతల ప్రకారం జోడించడం అన్న మాట.

దీనికి మనందరికీ తెలిసిన ఉదాహరణలు ఏవిటంటే:

  • ప్రాసెసింగ్ సమయంలో ఉప్పుకు అయోడిన్ ను కలపడం.
  • మామూలు పిండిలో ఇనుము మరియు ఫోలిక్ యాసిడ్‌లను జోడించటంతో ఫోషక విలువలు గల పిండిగా రూపుదిద్డటం.

3. ఎడిబుల్ కోటింగ్ (తినడానికి అనువైన కోటింగ్) యిచ్చే సాంకేతిక పద్దతులు (Techniques of edible coatings):

ఇవి తాజా ఆహార ఉత్పత్తుల ఉపరితలంపై ఇవ్వబడిన బాహ్య పూతలు.

అవి ఏజింగ్ (aging) మరియు ఆక్సీకరణ ప్రక్రియలు (oxidation processes) అంటే నిల్వవుంచిన ఆహార పదార్థాలు కాలం గడిచే కొద్దీ పాడై పోవటం సహజం. అలాంటి లక్షణాలను మందగింపచేయడం లాంటి గ్యాస్ బేరియర్లుగా ఈ ఎడిబుల్ కోటింగ్స్ పనిచేస్తాయి.

ఈ పద్దతి వల్ల ఆహార పదార్థాలు తమ తేమను కోల్పోకుండా నిరోధించవచ్చు.

4. ప్యాకేజింగ్ పద్ధతులు (Packaging techniques):

ఫుడ్ ప్యాకేజీలను రక్షిత వాయువు (protective gas) తో భర్తీ చేయటం.

ఈ పద్ధతిని MAP (మోడిఫైడ్ అట్మాస్పియర్ ప్యాకేజింగ్) అంటారు.

MAP యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆహార ఉత్పత్తుల యొక్క తాజాదనం పాడవకుండా పొడిగించటం.

5. నిల్వ పద్ధతులు (Storage techniques):

ఈ పద్ధతుల ద్వారా ఆహారం నిల్వ చేసే గదిలో వుండే వాతావరణం నియంత్రించబడుతుంది.

ఈ రకమైన ఆహార ఉత్పత్తుల నిల్వను CAS (Controlled Atmosphere Storage) అంటే నియంత్రిత వాతావరణంలో నిల్వచేయటం అంటారు.

ఆక్సిజన్, నైట్రోజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులతో పాటు ప్రధానంగా ఉష్ణోగ్రత మరియు తేమలు  స్టోరేజ్ రూమ్ లలో నియంత్రించబడతాయి.

6. ఆహార సరఫరా వ్యవస్థ (Food Supply Chain):

ఆహార సరఫరా వ్యవస్థలో కోల్డ్ చైన్ టెక్నాలజీ ఉపయోగించబడుతుంది.

ఈ టెక్నాలజీ ద్వారా నియంత్రిత ఉష్ణోగ్రత పద్ధతులను అనుసరించడం ద్వారా ఆహార ఉత్పత్తుల యొక్క నిల్వ మరియు నిరంతరాయ పంపిణీ వ్యవస్థ సాధ్య మవుతుంది.

7. సరైన నిల్వ సాధనాలను ఉపయోగించడం (Using Proper Storage Tools):

ఉష్ణోగ్రత మరియు తేమను పర్యవేక్షించడానికి థర్మామీటర్లు, థర్మోస్-హైడ్రోమీటర్లు, డేటా లాగర్లు మరియు ఇతర ప్యాకేజింగ్ పరికరాల వంటి సాధనాలు ఉపయోగించబడతాయి.

ఉత్పత్తుల యొక్క దృఢత్వం మరియు చక్కెర (షుగర్) కంటెంట్‌ను కొలవడానికి మరి కొన్ని ఇతర పరికరాలు కూడా ఉపయోగించబడతాయి.

8. సరైన ప్యాకేజింగ్ సాధనాలను ఉపయోగించడం (Using Proper Packaging Tools):

సాధారణంగా ఈ సాధనాలను ఆహారం యొక్క ప్యాకింగ్ లో మాడిఫైడ్ వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగిస్తారు.

ఇథిలీన్ శోషణ ప్యాకేజింగ్‌ (ethylene absorption packaging) లో, ఉత్పత్తి వున్న పెట్టెలను కప్పి ఉంచే ప్యాలెట్ ర్యాప్‌లలో ఎడిటివ్ లను ఉపయోగించి పేకింగ్ చేస్తారు.

క్లుప్తంగా చెప్పాలంటే, ముడిసరుకు నాణ్యతను నియంత్రించడం, ఉత్పత్తి & ప్యాకేజింగ్ కోసం గుడ్ మానుఫేక్చరింగ్ ప్రాక్టీస్ (GMP) మరియు తుది ఉత్పత్తి యొక్క నాణ్యతను పరీక్షించడం వంటివి మెరుగైన షెల్ఫ్ లైఫ్‌తో మంచి ఆహారాన్ని ఉత్పత్తి చేయడమె కాకుండా సుదూర పంపిణీ చేయడంలోనూ విజయం సాధించవచ్చు.

ఫుడ్ ప్రాసెసర్ గుర్తుంచుకోవలసిన ప్రధానమైన విషయం ఏమిటంటే, వినియోగదారులకు మంచి షెల్ఫ్ లైఫ్‌తో ఆహార ఉత్పత్తులను సరఫరా చేయడం మరియు తద్వారా ఆహార వృధాను తగ్గించడం.

ఈ ప్రాసెసింగ్ లో సరైన ప్రిజర్వేటివ్స్ మరియు ఎడిటివ్ లను ఉపయోగించక పొతే ఆహార సంబంధిత అనారోగ్యాలు కలిగే అవకాశం వుంది.

ఉదాహరణకు ఉప్పు మరియు మరి కొన్ని రుచికరమైన పదార్ధాల అధిక వినియోగం ఊబకాయం మరియు ఆహార సంబంధిత అనారోగ్యాలకు దారితీయవచ్చు.

ఇవి ముఖ్యంగా పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి.

ఈ దుష్ప్రభావాలన్నింటినీ తగ్గించడానికి, 4, 5 మరియు 6 పాయింట్లలో పైన చర్చించిన విధంగా ప్యాకేజింగ్, నిల్వ మరియు సరఫరా చెయిన్ వంటి వాతావరణ-స్మార్ట్ పద్ధతులు మంచి షెల్ఫ్ లైఫ్‌తో కూడిన బలవర్థక ఆహార ఉత్పత్తికి దోహదపడుతాయి.

కాబట్టి, పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో సైన్స్ మరియు టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా సురక్షితమైన, రుచికరమైన, పోషకమైన, సమృద్ధిభరితమైన, వైవిధ్యమైన, అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్పత్తులను మన్నికైన మంచి షెల్ఫ్ లైఫ్ తో అందించ వచ్చు.

“గుడ్ షెల్ఫ్ లైఫ్ తో కూడిన ఆహారం అంటే మంచి నాణ్యమైన ఆహారం”

Presented by:

All Blogs & Vlogs from mamlabs.net

Leave a Reply