Frog’s Metamorphosis in Telugu

కప్పల రూపాంతర ప్రక్రియ

ఎందుకు కప్ప పిల్లలు, అంటే టాడ్‌పోల్స్ కు కాళ్లు వుండవు?

వీడియోల కోసం క్రింద లింకులను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=XUT5dY1j8Gw
in Telugu
https://www.youtube.com/watch?v=fl7y-RraaRg
in English

అప్పుడే పుట్టిన యువ దశలో వున్న కప్ప పిల్లలను టాడ్‌పోల్స్ అంటారు. టాడ్‌పోల్స్ అంటే చేప లాంటి రూపం గల జీవి అని అర్థం.

వాటికి తోక మరియు చేప వలె బాహ్య మొప్పలు వుంటాయి కానీ కాళ్ళు వుండవు.

ఇది తెలుసుకోవాలంటే, ముందుగా మనం కప్పలు, టోడ్‌లు, న్యూట్స్ మరియు సాలమండర్లు వంటి ఉభయచరాల గురించి తెలుసుకోవాలి.

ఉభయచరాలు చల్లని నెత్తురు కలిగిన వెన్నెముక గల ప్రాణులు.

అవి భూమిపైన నీటి లోనా కూడా జీవించగలవు. కానీ, సంతానోత్పత్తి మాత్రం నీటిలోనే చేస్తాయి.

క్లాస్ యాంఫిబియా అని పిలువబడే ఉభయచర జీవ తరగతిలో మూడు క్రమాలు, ఆర్డర్లు, వున్నాయి.

ఒకటి అనురా. కప్పలు మరియు టోడ్లు, తేర కప్పలు, ఈ క్రమంలో వస్తాయి.

రెండవది ఉరోడెలా. న్యూట్స్ మరియు సాలమండర్లు ఈ క్రమంలో కొస్తాయి.

మూడవ క్రమం అపోడా. సిసీలియన్ ఈ క్రమంలో కొస్తాయి. వాటికి కాళ్ళు వుండవు. చూపు కుడా సరిగా కనిపించని అంధులనే చెప్పాలి.

ఉభయచరాల యొక్క విలక్షణమైన లక్షణాలేంటంటే అవి తేమ, పొలుసులేని, వెంట్రుకలు లేని చర్మం మరియు ఊపిరితిత్తులు కలిగి ఉంటాయి. ముందు చెప్పినట్లుగా వాటి రక్తం చల్లగా వుంటుంది.

ఈ ఉభయచర జీవుల ఊపిరితిత్తులు పొట్ట భాగానికి వెనుకగా సంచుల వలె వుంటాయి.

మరొక అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే అవి పూర్తిగా రూపాంతరం చెందుతాయి.

అవి నీటిలో గుడ్లు పెడతాయి.

అవి నీటిలో గుడ్లు పెడతాయి.

అప్పుడు గుడ్ల నుండి నీటిలో నివసించే లార్వా యొక్క వివిధ దశల ద్వారా మెటామార్ఫోసిస్, రూపాంతరం,  మొదలవుతుంది, ఉదాహరణకు టాడ్‌పోల్స్ నుండి చిరు కప్పలు ఆ తర్వాత భూమిపై నివసించే పెద్ద కప్పల వరకు రూపాంతరం చెందుతాయి.

సాధారణంగా ఈ ఎదిగిన కప్పలు, మరియు టోడ్‌లు తోక లేని స్క్వాట్ బాడీ అంటే బలమైన పొట్టి కాళ్లుండి వాటి  మోకాళ్ళపై కూర్చుండే స్వరూపం గలవన్నమాట.

పొడవైన, శక్తివంతమైన వెనుక కాళ్ళు, ఉబ్బి నట్లుండె పెద్ద కళ్ళు కలిగి వుంటాయి.

ఎదిగిన న్యూట్స్ మరియు సాలమండర్ల విషయంలో, ఈ లక్షణాలు భిన్నంగా ఉంటాయి.

అవి సాధారణంగా బాగా వృద్ధి చెందిన తోకతో పొడవాటి శరీరాన్ని కలిగి ఉంటారు. కప్పలతో పోలిస్తే సమాన పరిమాణం గల చిన్న చిన్న కాళ్ళను కలిగి వుంటాయి.

అయినప్పటికీ, న్యూట్స్ మరియు సాలమండర్లు గణనీయమైన వైవిధ్యాన్ని కలిగివుంటాయి.

ఉదాహరణకు, కొన్ని జాతులలో ఎదిగినవ న్యూట్లు, మరియు సాలమండర్లు, చిన్న కాళ్లను కలిగి, ఊపిరితిత్తుల స్థానంలో బాహ్య మొప్పలను కలిగి ఉంటాయి. అవి జీవితాంతం నీటిలోనే గడుపుతాయి.

ఇప్పుడు ప్రధాన అంశానికి వద్దాం. చిన్న చిన్న కప్ప పిల్లలు అంటే టాడ్‌పోల్స్‌కు ఎందుకు కాళ్లు వుండవంటే,  దానికి ప్రధాన కారణం కప్పల యొక్క రూపాంతర లక్షణం, మెటా మొర్ఫసిస్ అనే చెప్పాలి.

అవి గుడ్లను (స్పాన్ అని పిలుస్తారు) నీటిలో పెడతాయి.

అక్కడే చిన్న టాడ్‌పోల్స్‌గా పొదగ బడతాయి.

ఈ టాడ్‌పోల్స్, నీటిలోని చిన్న కప్పలకు, తోక మరియు బాహ్య మొప్పలు ఉంటాయి కానీ కాళ్లు వుండవు.

టాడ్‌పోల్స్ పెరిగేకొద్దీ, మొప్పలు అదృశ్యమవుతాయి. వెనుక కాళ్ళు వృద్ధి చెందుతాయి. తరువాత ముందు కాళ్ళు మరియు తోకలు చిన్నవై పోతాయి. చివరికి తోక అదృశ్యమవుతుంది. ఫలితంగా మనం చూసే పెద్ద కప్ప  తయారవుతోందన్న మాట.

ఇది కప్పల రూపాంతరం యొక్క పూర్తి ప్రక్రియ.

Presented & Published by: mamlabs.net