ప్రాచీన ప్రపంచంలో బ్యాంకింగ్ వ్యవస్థ
నేటి బేంకింగ్ అండ్ ఫైనాన్స్ వ్యవస్థ గురించి మనందరికీ తెలుసు.
కానీ ప్రాచీన కాలంలో బలమైన ఆర్ధిక రాజకీయ శక్తులుగా వున్న ఈజిప్ట్, ఇండియా, ఆఫ్గనిస్తాన్, చైనా, జార్జియా, ఇథియోపియా, గ్రీకు, రోమన్, జపాన్, ఇరాన్, సేన్ మారినో లాంటి దేశాలలో ఈ బెంకింగ్ అంటే ఆర్ధిక లావాదేవీలు ఎలా వుండేవో తెలుసుకోవటం చాల ఇంట్రస్టింగ్ గా వుంటుంది.
దానిలో భాగం గానే ఈ మొదటి బ్లాగ్ లో ప్రాచిన చైనాలో బెంకింగ్ సిస్టమ్ ఎలా ఉండేదో పబ్లిష్ చేస్తున్నాము.
మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రాచీన ప్రపంచంలో భారత దేశం, చైనా, ఈజిప్ట్ మొదలైనవి గణనీయ ఆర్ధిక శక్తులుగానే కాకుండా అధిక జనావాస కేంద్రాలుగా ఉండేవి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుని మొదట చైనాతో ఈ సిరిస్ ను ప్రారంభిస్తున్నాము.
ప్రాచీన చైనాలో అప్పును (రుణాన్ని) 30% అధిక వడ్డీకి యిచ్చేవారని తెలుస్తోంది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా వున్నప్పటికీ నిజం.
పురాతన చైనాలో వాణిజ్యం, ఆర్ధిక లావదేవీలనేవి ప్రజల యొక్క అనవసరమైన భోకలాలసతను నియంత్రించేలా తమకు అవసరమైన వస్తువులను మాత్రమే సేకరించేలా అందరికీ ఉపయోగకరంగా ఉండేవని చారిత్రిక కథనాల ద్వారా తెలుస్తోంది.
చైనాలో ఒక కుటుంబం యొక్క వారసత్వ సంపదను విభజించట మనేది చాలా అరుదుగా జరిగేది. ఇంకా చెప్పాలంటే ఇతర దేశాలలో వలె అక్కడ సిరి సంపదలు, ఆస్తులు దేశంలో కొందరు మాత్రమే ధనవంతులుగా వుండి, మరికొందరు నిరుపేదలుగా మిగలకుండా ఉండేలా నియంత్రించ బడేదని అంటారు.
ఇంకొక విషయం ఏంటంటే దాదాపు 2000 సంవత్సరాల నుండి, చైనాలో అధిక వడ్డీపై డబ్బు ఇచ్చే విధానం వాడుకలో ఉంది.
ఈ అధిక వడ్డీ విధానం దేశంలో అనేక సార్లు రద్దు చేయబడింది మళ్ళీ పునరుద్దరించ బడింది.
లూనార్ క్యాలెండర్ విధానం (చంద్రమాన పంచాంగం) ప్రకారం రుణం పై వసూలుచేసే వడ్డీ – సంవత్సరానికి 30 శాతంగా వుండేది.
ఇంకా చెప్పాలంటే ‘అసలు మరియు వడ్డీ వసూలు చేసే విధానం’ చాలా ఖచ్చితంగానూ, కఠినంగానూ అమలు పరచ బడేది.
ఆ రోజుల్లో డబ్బు కోసం ఇంత అధిక వడ్డీని తీసుకోవడానికి ఆనాటి ప్రభుత్వాలు ఎందుకు అనుమతించేవో చరిత్ర కారులు స్పష్టంగా వివరించ లేకపోయారు.
ఈ రికవరీ చేసే విధానం ఎలా వుండేదంటే:
రుణ గ్రహీత నెలవారీ వడ్డీ చెల్లించాలి. ఇది వార్షిక వడ్డీలో 10వ భాగంగా వుండేది. ఒకవేళ చెల్లింపులో కనుక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రింది చట్టాలు అమలు పరచబడేవి:
నెలలు లేదా సంవత్సరాలలో ఎంత రుణం పేరుకుపోయి నప్పటికీ, అసలు మరియు వడ్డీ ఎల్లప్పుడూ అలాగే స్థిరంగా ఉండేది. అప్పును చెల్లించకుండా (ఈ విధానాన్ని) ఉల్లంఘించిన వారికి అనుసరించే శిక్షా విధానం ఇలా వుండేది:
- ఉల్లంఘించిన వ్యక్తి 40 పాన్-త్సీ (కొరడా) దెబ్బలని తినాలి.
- రుణ చేల్లిపు ఉల్లంగించటమే కాకుండా మోసపూరితంగా శిక్ష నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వంద కొరడా దెబ్బలు తినాలి.
మాండరిన్ (ఇంపీరియల్ చైనా యొక్క ప్రభుత్వ ఉన్నత అధికారి) ముందు దోషిగా నిర్ధారించబడే వారికి ఈ చట్టం మరింత కఠినంగా అమలు చేయ బడుతుంది:
- ఒక నెల వడ్డీ చెల్లించకపోతే – ఉల్లంఘించిన వ్యక్తికి 10 కొరడా దెబ్బలు.
- రెండు నెలలు వడ్డీ చెల్లించక పొతే – 20 కొరడా దెబ్బలు.
- మూడు నెలలు వడ్డీ చెల్లించక పొతే – 30 కొరడా దెబ్బలు.
- ఈ క్రమంలో ఆరో నెల అయితే 60 కొరడా దెబ్బలు విధించ బడతాయి.
శిక్షలతో పాటు రుణగ్రహీత అసలు మరియు వడ్డీ ని చెల్లించవలసి ఉంటుంది.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రుణ దాతలు ఒకవేళ హింస మరియు బలప్రయోగాల ద్వారా రుణాన్ని వసూలు చేయాలని ప్రయత్నిస్తే మాత్రం అలంటి వారు రుణదాతలు 24 కొరడా దెబ్బల శిక్షకు గురవుతారు.
Click Here For English Version of the Blog
Click Here For Other Telugu Posts / ఇతర తెలుగు పోస్ట్ ల కోసం క్లిక్ చేయండి
All Blogs & Vlogs from mamlabs.net