Andam Nilo Vundani

అందం నీలో వుందని

Film: Mooga Nomu

చిత్రం: మూగ నోము

Language – Year Released: Telugu – 1969

భాష & రిలీజ్: తెలుగు – 1969

Starring: Akkineni Nageswara Rao; SV Ranga Rao; Jamuna; Vennera Aadai Nirmala; Nagayya; Rajanala; Padmanabham; Vijaya Lalitha; Gitanjali; etc.

ముఖ్య తారాగణం: అక్కినేని నాగేశ్వర రావు; SV రంగారావు; జమున; వెన్నెరాడై నిర్మల; నాగ్గయ్య; రాజనాల; పద్మనాభం; విజయ లలిత; గితాంజలి; తదితరులు

Lyrics: Dr. C. Narayana Reddy  

గీత రచన: Dr. C.  నారాయణ రెడ్డి

Playback: Gantasala & P. Susheela

నేపథ్య గానం: ఘంటసాల & P. సుశీల

Music: R. Govardhanam

సంగీతం: R. గోవర్ధనం

Director: D. Yoganand

దర్శకత్వం: D. యోగానంద్

Banner: AVM Productions

నిర్మాణ సంస్థ: AVM ప్రొడక్షన్స్

పల్లవి:

అందం నీలో వుందని

అది అందుకునే వీలుందని

తొందర చేసెను హృదయం

తొలి పందెం వేసెను పరువం

అందం నీలో వుందని

అది అందుకునే వీలుందని

తొందర చేసెను హృదయం

తొలి పందెం వేసెను పరువం

చరణం 1:

విర బూసిన కలువల కనులు

అర మూసిన అది ఒక అందం

చిరు గాలికి నల్లని కురులు

చెల రేగిన అది ఒక అందం

ఆ పెదవుల దాగిన నవ్వే

అందాలను దోచిన అందం

అందాలను దోచిన అందం

అందం నాలో వుందని

నీ కందించే వీలుందని

తొందర చేసెను హృదయం

తొలి పందెం వేసెను పరువం

చరణం 2:

పచ్చని ఆ తీగకు అందం

పందిరి కొసలందిన నాడే

కదిలే సెలయేటికి అందం

కడలి లోన చేరిన నాడే

నా మేనికి నిజమౌ అందం

నీ దానిగ నిలిచెన నాడే

నీ దానిగ నిలిచెన నాడే

అందం నీలో వుందని

అది అందుకునే వీలుందని

తొందర చేసెను హృదయం

తొలి పందెం వేసెను పరువం

ఆహా ఆహా ఆహాహా – అహ ఆహాహాహా ఆహహా…

లాలల లాలల లాలల్లా – లల లాల లాలల ల్లా…

Chorus:

Andam nilo vundani

Adi andukune vilundani

Tondara chesenu hrudayam

Toli pandem vesenu paruvam

Andam nilo vundani

Adi andukune vilundani

Tondara chesenu hrudayam

Toli pandem vesenu paruvam

Stanza 1:

Vira busina kaluvala kanulu

Ara musina adi oka andam

Chiru galiki nallani kurulu

Chela regina adi oka andam

Aa pedavula dagina navve

Andalanu dochina andam

Andalanu dochina andam

Andam nalo vundani

Nee kandinche vilundani

Tondara chesenu hrudayam

Toli pandem vesenu paruvam

Stanza 2:

Pacchani aa tigaku andam

Pandiri kosalandina nade

Kadile selayetiki andam

Kadali lona cherina nade

Naa meniki nijamavu andam

Nee daniga nilichina nade

Nee daniga nilichina nade

Andam nilo vundani

Adi andukune vilundani

Tondara chesenu hrudayam

Toli pandem vesenu paruvam

Aaha Aaha aahaha – aha aahahaha aahaha…

Laalala laalala lalallaa – lala laalaa laa laa llaa…