ధూమపానానికి 27 మంది బెస్ట్ ఫ్రెండ్స్
యాక్టివ్ లేదా పాసివ్ ఏదయినా, ధూమపానంతో పాటు దాని యొక్క 27 మంది బెస్ట్ ఫ్రెండ్స్ మనల్ని పలకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
వారెవరో తెలుసుకుందాం:
1. నాడీ సంబంధిత అజీర్తి
శారీరక లేదా మానసిక అలసట. శక్తి లేకపోవడం.
2. నిద్రలేమి
నిద్ర లేకపోవడంతో కలిగే తాత్కాలిక అశాంతి.
3. కడుపులో దేవి నట్లుండటం
కడుపులో నిరంతరం ఆందోళన కలిగించే లేదా బాధించే నొప్పి.
4. తలనొప్పి
నిరంతర తల నొప్పి.
5. బలహీనమైన కళ్ళు
6. చర్మంపై ఎర్రటి మచ్చలు
7. గొంతు గర గర
8. ఆస్తమా
శ్వాసకోశ రుగ్మత, ఇది శ్వాసలో గురక ద్వారా వర్గీకరించబడుతుంది; సాధారణంగా అలెర్జీ మూలంగా సంభవిస్తుంది.

9. బ్రోన్కైటిస్
శ్వాసనాళాల పొరల వాపు. ఇది సాధారణంగా శ్వాసనాళాల వాపు మరియు దగ్గుకు కారణమవుతుంది.
10. గుండె ఆగిపోవడం
11. ఊపిరితిత్తుల సమస్య
12. క్యాటరా
ముక్కు మరియు గొంతు వాపు. శ్లేష్మం పెరగడం.
13. మానసిక వ్యాకులత
సాధారణంగా స్పష్టమైన కారణం లేకుండా కలిగే విచారం.
14. న్యూరాస్తెనియా
నాడీ విచ్ఛిన్నం. (పాత ఉపయోగం). నీరసం, అలసట, తలనొప్పి మరియు చిరాకు వంటి లక్షణాలను కలిగి ఉన్న ఒక అస్పష్టమైన వైద్య పరిస్థితి. ప్రధానంగా భావోద్వేగ భంగంతో సంబంధం కలిగి ఉంటుంది.
15. జ్ఞాపకశక్తి కోల్పోవడం
16. మనోబలం సన్నగిల్లడం
17. రుమాటిజం
కీళ్ళు, కండరాలు లేదా పీచు కణజాలంలో, ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో మంట మరియు నొప్పితో గుర్తించబడిన వ్యాధి.
18. లుంబాగో
నడుము ప్రాంతం లేదా నడుము దిగువ భాగాన్ని ప్రభావితం చేసే వెన్నునొప్పి. కండరాల ఒత్తిడి లేదా ఆర్థరైటిస్ లేదా వాస్కులర్ లోపం, లేదా పగిలిన ఇంటవర్టిబ్రల్ డిస్క్స్ వల్ల సంభవించవచ్చు.

19. సయాటికా
సయాటిక్ నరాలలో సంభవించే న్యూరల్జియా. వెన్ను, తుంటి మరియు కాలు బయటి వైపు నొప్పి వస్తుంది, ఇది దిగువ వీపులోని వెన్నెముక నరాల మూలం యొక్క కుదింపు వలన సంభవిస్తుంది, తరచుగా ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ క్షీణత కారణంగా వస్తుంది.
20. న్యూరైటస్
ఫెరిఫెరల్ నరాలు లేదా నరాల యొక్క వాపు. సాధారణంగా నొప్పితో నరాల పనితీరును కోల్పోవడానికి కారణమవుతుంది.
21. గుండెల్లో మంట
గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్. తిన్న తిండి కడుపు నుండి తిరిగి అన్నవాహికకు ఎగదన్నటం. దీని వల్ల ఛాతీలో బాధాకరమైన మంట పుడుతుంది. ఇది అల్సర్ లేదా డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా లేదా ఇతర రుగ్మతల లక్షణం కావచ్చు.
22. టోర్పిడ్ లివర్
కాలేయ పనితీరు మందగించడం.
23. ఆకలి లేకపోవడం
24. నిస్సత్తువ
శక్తి లేదా తేజస్సు తగ్గిపోయిన భావన. అలసట.
25. నీరసం
శారీరక లేదా మానసికంగా అలసినట్లుండే స్థితి. శక్తి లేకపోవడం.
26. నిరాసక్తత
27. జుట్టు రాలడం
సేకరణ.
ఈ సమాచారం ప్రసిద్ధ ఆంగ్ల రచయిత P.G. వోడ్‌హౌస్ రాసిన ఒక కథ నుండి సేకరించ బడింది.
Go to Home
