Kalam Kani Kalamlo

కాలం కాని కాలంలో

Film: Appu Chesi Pappu Kudu  

చిత్రం: అప్పు చేసి పప్పు కూడు

Language & Release: Telugu & 1959

భాష – రిలీజు : తెలుగు – 1959

Starring:

(Sr) NT Rama Rao; Savitri; SV Ranga Rao; Jaggayya: Jamuna; CSR; Relangi; Ramana Reddy; etc.

ముఖ్య తారాగణం:

(Sr) NT రామారావు; సావిత్రి; CSR; SV రంగారావు; జగ్గయ్య; జమున; రేలంగి; రమణా రెడ్డి తదితరులు.

Lyrics: Pingali

గేయ రచన: పింగళి

Playback: P. Leela & P. Susheela

నేపథ్య గానం: P. లీల & P. సుశీల

Music: S. Rajeswara Rao

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు

Director: L. V. Prasad

దర్శకత్వం: L. V. ప్రసాద్

Banner: Vijaya Productions నిర్మాణం: విజయ ప్రొడక్షన్స్

Lyrics in Telugu:

పల్లవి:

చిగురుల పూవుల సింగారముతో

తీవెలు సొంపులు గన లేదు

ముసి ముసి నవ్వుల గిలిగింతలతో

వసంత ఋతువా రానే లేదు

కాలం కాని కాలంలో కోయిల కూత లెందుకనో

తరుణం కాని తరుణంలో నా మది ఈ గుబులెందుకనో

కాలం కాని కాలంలో కోయిల కూత లెందుకనో

వలపులు మీటగ తీయని పాటలు హృదయ వీణపై పలికెనుగా

ప్రియతము గాంచిన ఆనందములో మనసే వసంత ఋతువాయెనుగా

కాలం కాని కాలంలో కోయిల కూత లెందుకనో

తరుణం కాని తరుణంలో నా మది ఈ గుబులెందుకనో

చరణం 1:

తళుకు బెళుకుల తారామణులతో శారద రాత్రులు రాలేదు

ఆకాశంలో పకపకలాడుచు రాకాచంద్రుడా రానే లేదు

కాలం కాని కాలంలో చల్లని వెన్నెల ఎందుకనో

తరుణం కాని తరుణంలో నా మది ఈ గుబులెందుకనో

కాలం కాని కాలంలో చల్లని వెన్నెల ఎందుకనో

తలచిన తలపులు ఫలించగలవని బులపాటము బలమాయేనుగా

పగటి కలలుగను కన్యామణులకు ప్రియుడే రాకాచంద్రుడుగా

కాలం కాని కాలంలో చల్లని వెన్నెల అందుకనే

తరుణం కాని తరుణంలో నీ మది ఈ గుబులందుకనే

కాలం కాని కాలంలో చల్లని వెన్నెల అందుకనే

Lyrics in English

Chorus:

Chigurula puvula singaramuto

Tivelu sompulu ganaledu

Musi musi navvula gili gintalato

Vasantha ruthuva rane ledu

Kalam kani kalamlo koyila kootha lendukano

Tarunam kani tarunamlo na madi ee gubulendukano

Kalam kani kalamlo koyila kutha lendukano

Valapulu mitaga tiyani patalu

Hrudaya vinapai palikenuga

Priyathamu ganchina anandamulo

Manase vasantha ruthuvayenuga

Kalam kani kalamlo koyila kootha lendukano

Tarunam kani tarunamlo na madi ee gubulendukano

Stanza 1:

Taluku belikula taramanulato

Sarada ratrulu raledu

Akasamlo paka paka laduchu

Raka chandruda rane ledu

Kalam kani kalamlo challani vennela endukano

Taranam kani tarunamlo naa madi ee gubulendukano

Kalam kani kalamlo challani vennela endukano

Talachina talapulu phalinchagalavani

Bulapatamu balamayenuga

Pagati kalaluganu kanya manulaku

Priyude raka chandruduga

Kalam kani kalamlo challani vennela andukane

Tarunam kani tarunamlo nee madi ee gubulandukane

Kalam kani kalamlo challani vennela andukane