Album: Mouname nee bhasha O muga manasa (మౌనమె నీ భాష ఓ మూగమనసా)
Film: Guppedu manasu (గుప్పెడు మనసు) (1979)
Language: Telugu
Lyrics: Acharya Athreya (ఆచార్య ఆత్రేయ)
Playback: M. Bala Murali Krishna (మంగళంపల్లి బాల మురళీ కృష్ణ)
Music: M.S. Viswanathan Director: K. Bala Chander

పల్లవి:
మౌనమె నీ భాష ఓ మూగమనసా ll మౌనమె నీ భాష ll
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు ll తలపులు ఎన్నెన్నో ll
కల్లలు కాగానె కన్నీరౌతావు
మౌనమె నీ భాష ఓ మూగమనసా… ఓ మూగమనసా…
చరణం 1:
చీకటి గుహనీవు
చింతల చెలి నీవు ll చీకటి గుహనీవు ll
నాటకరంగానివే మనసా
తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో
ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో
ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో – ఏమై మిగిలేవో
మౌనమె నీ భాష ఓ మూగమనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానె కన్నీరౌతావు
మౌనమె నీ భాష ఓ మూగమనసా…
ఓ మూగమనసా…
చరణం 2:
కోర్కెల చెల నీవు
కూరిమి వల నీవు ll కోర్కెల చెల నీవు ll
ఊహల ఉయ్యాలవే మనసా
మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమె నీ భాష ఓ మూగమనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానె కన్నీరౌతావు
మౌనమె నీ భాష ఓ మూగమనసా… ఓ మూగమనసా…
Lyrics in English
Intro:
Mouname nee bhasha O muga manasa ll Mouname ll
Talapulu ennenno kalaluga kantavu ll Talapulu ll
Kallalu kagane kanneeravutavu ll Mouname ll
Stanza 1:
Cheekati guha neevu
Chintala cheli neevu ll Cheekati ll
Naataka ranganive manasa
Tegina patanganive
Enduku valachevo
Enduku vagachevo
Enduku ragilevo
Emai migilevo
Enduku ragilevo – Emai migilevo ll Mouname ll
Stanza 2:
Korkela chela neevu
Kurimi vala neevu ll Korkela ll
Oohala uyyaalave manasa
Mayala deyyanive
Lenidi korevu – Unnadi vadilevu
Oka porapatuku yugamulu pogilevu ll Oka porapatuku ll
Mouname nee bhasha O muga manasa
Talapulu ennenno kalaluga kantavu
Kallalu kagane kanneeravutavu
Mouname nee bhasha O muga manasa… O muga manasa…
