
Album (గీతం):
Chigurulu Vesina Kalalanni (చిగురులు వేసిన కలలన్ని)
Movie (చిత్రం):
Poola Rangadu of 1967 (పూల రంగడు of 1967)
Language (భాష):
Telugu (తెలుగు)
Starring (ముఖ్య తారాగణం):
ANR (Akkineni Nageswara Rao); Jamuna; Sobhan babu; Vijaya Nirmala
ANR (అక్కినేని నాగేశ్వర రావు); జమున; శోభన్ బాబు; విజయ నిర్మల
Lyrics (గీత రచన):
Dasaradhi (దాశరధి)
Playback (గాత్రం):
KB Mohan Raju & P Susheela
Music (సంగీతం):
Saluri Rajeswara Rao (సాలూరి రాజేశ్వర రావు)
Director (దర్శకత్వం):
Adurthi Subba Rao (ఆదుర్తి సుబ్బారావు)
పల్లవి:
చిగురులు వేసిన కలలన్ని
సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ
మమతల తీరం చేరినవి
మమతల తీరంచేరినవి..
ఆ… ఆ… ఓ… .ఓ…
చరణం 1:
సన్నజాజి తీగలాగ
నిన్ను చేరుకున్నానూ llసన్నజాll
నిండు మనసు పందిరి కాగా
నిన్ను అందుకున్నాను
నిన్నే అందుకున్నాను
చరణం 2:
దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు llదాగలేనిll
నా తనువు అణువణువు
నీదే నీదే ఈనాడు
నీదే నీదే ఏనాడు llచిగురులుll
చరణం 3:
నీటిలోని కలువను కోరి
నింగి దిగిన జాబిలి నీవే llనీటిలోనిll
పరిమళాల తరగలలోనే llపరిమళాలll
కరిగించిన చెలియవు నీవే llకరగించినll
చిగురులు వేసిన కలలన్ని
సిగలో పూలుగ మారినవి
మనసున పొంగిన అలలన్నీ
మమతల తీరం చేరినవి
మమతల తీరంచేరినవి
ఆ… ఆ… ఓ… ఓ… ఓ…
Lyrics in English:
Stanza 1:
Sannajaji tigalaga ninnu cherukunnanu
Sannajaji tigalaga ninnu cherukunnanu
Nindu manasu pandiri kaga
Ninnu andukunnanu
Ninne andukunnanu
Chigurulu vesina kalalanni
Sigalo puluga marinavi
Manasuna pongina alalanni
Mamatala teeram cherinavi
Mamatala teeram cherinavi
Stanza 2:
Dagaleni ragalevo dachinavu aa nadu
Dagaleni ragalevo dachinavu aa nadu
Naa tanuvu anuvanuvu
Nide nide ee nadu – nide nide enadu
Chigurulu vesina kalalanni
Sigalo puluga marinavi
Manasuna pongina alalanni
Mamatala teeram cherinavi Mamatala teeram cherinavi

