Lost Cities/T

అంతరించిపోతున్న నగరాలు.

భవిష్యత్తులో కనుమరుగయ్యే నగరాలు…

రాబోయే శతాబ్దాలలో, గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టం 23 అడుగుల కు పైగా పెరుగుతుందని అంచనా వేయబడింది.

ఫలితంగా న్యూయార్క్, సౌత్ ఫ్లోరిడా వంటి సముద్ర తీర ప్రాంతాలలోని కొన్ని ప్రముఖ నగరాలు ప్రపంచ పటం నుండి తుడిచిపెట్టుకుపోబోతున్నాయని ఒక అంచనా.

గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి?

గ్లోబల్ వార్మింగ్ అనేది భూగోళపు ఉపరితల గాలిలో పెరిగే వేడి వల్ల వాతావరణంలో సంభవించే  మార్పులు.

గ్లోబల్ వార్మింగ్ వల్ల సంభవించే గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ (గ్రీన్‌హౌస్ ప్రభావం) వల్ల భూ వాతావరణం యొక్క సగటు ఉష్ణోగ్రత క్రమంగా  పెరుగుతుంది.

గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి?

దిగువ వాతావరణంలో సౌర వికిరణం (solar radiation) అక్కడే వుండిపోవటం వల్ల భూమి యొక్క ఉపరితలం వేడెక్కడాన్ని గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ అంటారు. అలా కానిచొ ఆ రేడియేషన్ తిరిగి  అంతరిక్షంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది.

ఇది ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు (CFCs), సహజ మీథేన్ ఉద్గారాలు మరియు ఇతర గ్రీన్హౌస్ వాయువుల ద్వారా జరుగుతుంది.

కార్బన్ డయాక్సైడ్ (CO2) మరియు ఇతర గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుదల భూతాప ప్రమాదాన్ని పెంచుతుంది.

గ్రీన్‌హౌస్ వాయువులు (greenhouse gases) అంటే ఏమిటి?

నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, ఓజోన్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ మరియు ఇతర వాతావరణ వాయువులను గ్రీన్‌హౌస్ గేసెస్ అంటారు. అవి కాంతి మరియు వేడిని కలిగి ఉంటాయి. అంతేకాక మొక్కలకు గ్రీన్‌హౌస్ లాగా భూమిపై జీవానికి మనుగడ కలుగజేస్తాయి.

సూర్యుని శక్తి లేదా సౌర వికిరణంలో 90% గ్రీన్‌హౌస్ వాయువుల ద్వారా గ్రహించబడుతుంది. ఈ శోషించబడిన శక్తి భూమి యొక్క ఉపరితలం వేడెక్కడానికి తోడ్పడుతుంది.

ఈ వాయువులు జీవితానికి చాలా అవసరం అయినప్పటికీ, అవి వాతావరణంలో సమతుల్యతను కలిగి వుండాలి. లేకుంటే పైన చెప్పినట్లుగా అది గ్లోబల్ వార్మింగ్‌కు దారి తీస్తుంది.

గ్లోబల్ వార్మింగ్ సమయంలో ఏర్పడ్డ రేడియేషన్ తిరిగి వెనక్కి పోలేక లాంగ్-వేవ్ రేడియేషన్ రూపంలో అక్కడే చిక్కుకుని ఉంటుంది.

గ్రీన్‌హౌస్ ప్రభావానికి మరొక కారణం కార్బన్ డయాక్సైడ్, CFCలు మరియు ఇతర కాలుష్య కారకాల స్థాయిలు పెరగడం.

వాతావరణ వాయువులు సూర్యరశ్మిని తమ గుండా ప్రవాహించడానికి అనుమతిస్తాయి కాని భూమి యొక్క వేడెక్కిన ఉపరితలం నుండి వెనక్కి ప్రసరించే వేడిని సంగ్రహించి స్పేస్ లోకి తిరిగి పోనివ్వవు.

వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువుల పెరుగుదలకు ప్రధాన కారణాలు:

1. శిలాజ ఇంధనాల (fossil fuels) దహనంతో పాటు క్లోరోఫ్లోరో కార్బన్‌ (CFC) ల వంటి ఇతర వాయువుల విడుదల.

2. అటవీ నిర్మూలన (deforestation).

భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా భూమిపై ఉన్న జలాలకు ఏమవుతుంది?

గ్లోబల్ వార్మింగ్ యొక్క ప్రధాన దుష్ప్రభావాలు:

1. వాతావరణ మార్పులు:

1750 నుండి ప్రధానంగా మానవ కార్యకలాపాల కారణంగా ఉష్ణ వినిమయం చదరపు మీటరుకు 2.3 వాట్‌లు పెరిగిందని గమనించారు. ఇది అసాధారణమైన వాతావరణ మార్పు అని చెప్పవచ్చు.

దీని ఫలితంగా సముద్రపు నీటి ఉష్ణోగ్రతతో పాటు వాతావరణంలో తేమ కూడా పెరుగుతుంది.

2. ధ్రువ ప్రాంతాలు తరిగి పోతున్నాయి.

గ్లోబల్ వార్మింగ్ కారణంగా ధ్రువ ప్రాంతాలలోని మంచు కరిగిపోతోంది. ఇది ధ్రువాల వద్ద వుండే సహజ మంచును వాటి పరిమాణాన్ని తగ్గిస్తుంది.

ఈ కరిగిన మంచు కారణంగా సముద్రపు నీటి మట్టాలు అసాధారణ స్థాయికి పెరగుతాయి.

ఫలితంగా, కొన్ని గొప్ప తీరప్రాంత నగరాలు భవిష్యత్తులో ‘లాస్ట్ సిటీస్’ అంటే కనుమరుగవుతాయి.

3. ఓజోన్ పొర వైఫల్యం:

ఇది పలచబడి ఓజోన్ రంధ్రం ఏర్పడటానికి దారితీస్తుంది.

ఓజోన్ పొర అంటే ఏమిటి?

ఇది భూమి యొక్క స్ట్రాటో ఆవరణ (stratosphere) లో ఏర్పడిన ఒక పొర (సుమారు 10 కి.మీ ఎత్తులో వుంటుంది). ఇది ఓజోన్ అనే నీలిరంగు వాయువు యొక్క అధిక సాంద్రతను కలిగి ఉంటుంది. ఇది సూర్యుని యొక్క అతినీలలోహిత కిరణాల (ultraviolet rays) చే సృష్టించబడుతుంది.

అతినీలలోహిత కిరణం తాకినప్పుడు ఓజోన్ అణువు వేరుగా విడిపోతుంది. దీనిలో ఉత్పత్తి చేయబడిన ఫ్రీ ఆక్సిజన్ మరొక ఫ్రీ ఆక్సిజన్‌తో కలిపినప్పుడు ఒక పొరలా వ్యాపిస్తుంది.

ఓజోన్ పొర వాతావరణ వాయువులలో ఒక మిలియన్ వంతు మాత్రమే వుంటుంది. ఓజోన్ సూర్యుని అతినీలలోహిత కిరణాలను చాలా వరకు గ్రహిస్తుంది.

లేకపోతే ఈ కిరణాలు భూమిపై ఉన్న సమస్త జీవరాశిని నాశనం చేస్తాయి.

ఓజోన్ పొరలో బీటలు:

ఓజోన్ రంధ్రం ఏర్పడటం:

క్లోరోఫ్లోరోకార్బన్స్ (CFCలు) వంటి కొన్ని హానికరమైన రసాయనాలు స్ట్రాటో ఆవరణలో ఓజోన్ పరిమాణాన్ని తగ్గిస్తాయి. ఓజోన్ పొర పలుచన కావటాన్ని ఓజోన్ రంధ్రం అంటారు.

ఈ CFCలు ఎక్కువగా రిఫ్రిజెరెంట్లు మరియు ఏరోసోల్ స్ప్రేలలో కనిపిస్తాయి.

ఓజోన్ రంధ్రాలు సాధారణంగా ధ్రువాల వద్ద ఏర్పడతాయి.

1980 నుండి 1990 వరకు, అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రం యొక్క పరిమాణంలో నాటకీయ పెరుగుదల కనిపించింది. అయితే అది ఇప్పుడు స్థిరపడింది.

ఆర్కిటిక్ ప్రాంతంలో ఇటీవలి సంవత్సరాలలో చిన్న రంధ్రం ఏర్పడి అభివృద్ధి చెందుతోంది.

భూమిపై నీటి సంక్షోభం:

1. తాగునీటికి ముప్పు:

డిమాండ్‌కు తగ్గట్టుగా మంచినీటి సరఫరా లేదు. 1970 నుండి మంచినీటిలో 30% క్షీణత ఏర్పడిందని అంచనా వేయబడింది, దీని ఫలితంగా మానవులకు త్రాగునీటి లభ్యత ఒక శాతం కంటే తక్కువగా ఉంది.

2. మంచినీటి అసమాన పంపిణీ:

మళ్లింపు కారణంగా నదులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు సామర్థ్యానికి మించి ఉపయోగించటం వల్ల వాటి సహజ పునరుద్ధరణ జరగడం లేదు. ప్రపంచ జనాభాలో దాదాపు 30% మందికి తమ వినియోగానికి సరిపడా నీరు లేదు. 2025 నాటికి జనాభాలో సగం కంటే ఎక్కువ మంది తమ ప్రాథమిక అవసరాలకు చాలని నీటి కొరతతో బాధపడుతుంటారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

3. అనర్హమైన నీరు మృత్యు గంటలను మోగిస్తుంది:

వివిధ రకాల కాలుష్యాలు, రసాయనాలను విరివిగా ఉపయోగించటం మరియు రక రకాల సూక్ష్మజీవుల కారణంగా నీరు రోజురోజుకు పనికిరాకుండా పోతోంది.

కలుషిత నీరు తాగి ప్రతిరోజు 1500 మంది వరకు చిన్నారులు మరణిస్తున్నారు.

4. సముద్రాలు మరియు మహాసముద్రాలలో ఏర్పడుతున్న ప్లాస్టిక్ సూప్:

సముద్రాలు మరియు మహాసముద్రాలు వివిధ వ్యర్థాల ప్లాస్టిక్ సూప్‌తో కప్పబడి వున్నాయి. ఈ ప్లాస్టిక్ సూప్ భూమి, నౌకలు మరియు చమురు ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఏర్పడు తున్నాయి. ఇవి సముద్ర ఉపరితలానికి కొంచెం దిగువన సుడిగుండం రూపంలో ప్రయాణిస్తుంటాయి.

ప్రతి చదరపు మైలుకు సగటున 46,000 ప్లాస్టిక్ ముక్కలు తేలుతున్నాయని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

5. ఆయిల్ స్పిల్ వల్ల సంభవించే భయంకర ముప్పు:

ఆయిల్ ట్యాంకర్ల నుండి చమురు సముద్రంలో చిందటం; దాన్ని శుభ్రపరచడం అనేది పెను సవాలుగా మారింది. తీరప్రాంతం వెంబడి ప్రమాదంలో ఉన్న స్పిల్ మరియు సైట్ల స్వభావాన్ని తక్షణం గుర్తించడం చాలా అవసరం. అంతేకాక ఈ ఆయిల్ స్పిల్ వల్ల తక్కువ హాని కలిగేలా చేయడం అత్యవసరం.

Presented by:

Leave a Reply